Take a fresh look at your lifestyle.

పట్టుదలతో కృషిచేస్తేనే ఉన్నత శిఖరాలు: ఆచార్య డేవిడ్‌

 Only by persevering High Peaks: Professor David
యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య కె.డేవిడ్‌

విద్యార్థులు అంకితభావం పట్టుదలతో కృషి చేస్తేనే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య కె.డేవిడ్‌ అన్నారు. శుక్రవారం డాక్టర్‌ ‌సంగాని మల్లేశ్వర్‌ అధ్యక్షతన జర్నలిజం విభాగంలో నిర్వహించిన ఫ్రెషర్స్‌డే కార్యక్రమానికి ప్రిన్సిపాల్‌ ‌ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు తమ శక్తి సామర్థ్యాలను గుర్తించి దానికి అనుగుణంగా విజయాన్ని సాధించేందుక కృషి చేయాలని, లేని వాటి గురించి ఆలోచించి సమయాన్ని వృథా చేసుకోవద్దన్నారు.

మనిషి అవసరాల నుంచే కొత్త ఆవిష్కరణలు ఉద్భవిస్తాయని, జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడే మనం లక్ష్యాన్ని సాధించుకోగలుగుతామన్నారు. జర్నలిజం విభాగానికి కావల్సిన అవసరాలను దశలవారీగా తీర్చుతానని హామీ ఇచ్చారు. ప్రశ్నించడం ద్వారానే సమాజంలో మార్పు వస్తుందని, జర్నలిజం విద్యార్థులు తమ వృత్తి నైపుణ్యాలకు అనుగుణంగా ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలన్నారు. జర్నలిజం విభాగం అధ్యక్షులు డాక్టర్‌ ‌సంగాని మల్లేశ్వర్‌ ‌మాట్లాడుతూ కాకతీయ విశ్వవిద్యాలయంలో జర్నలిజం విభాగానికి మంచి గుర్తింపు ఉందని, ఇక్కడ చదువుకున్న విద్యార్థులు జర్నలిజం వృత్తిలో ఉన్నత స్థానాల్లో ఉన్నారన్నారు. ప్రస్తుత విద్యార్థులంతా వారిని ఆదర్శంగా తీసుకొని జీవితంలో స్థిరపడాలన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ఎ.సంపత్‌కుమార్‌, ‌దాడబోయిన శ్రీకాంత్‌యాదవ్‌, ‌డాక్టర్‌ ‌వంగాల సుధాకర్‌, ‌పి.వెంకటేశ్వర్లు, పద్మ సీనియర్‌ ‌విద్యార్థులు ప్రశాంత్‌, అనిల్‌, ‌హర్షిని, భవాని, ఫ్రూటీ, మంజు భార్గవి, అనిల్‌కుమార్‌, ‌దేవేందర్‌, ‌జూనియర్‌ ‌విద్యార్థులు గద్దర్‌, ‌వెంకటఫణి, దీపిక, అను పాల్గొన్నారు.

Tags: persevering, High Peaks, Professor David, university principal, freshers day

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply