Take a fresh look at your lifestyle.

ఒక్కో తరగతి గదిలో 50శాతం మందికే అనుమతి

  • డిగ్రీ, పీజీ, వృత్తి విద్యా కోర్సుల్లో హాజరుపై నిర్ణయం
  • విద్యాశాఖాధికారులతో సమీక్ష లో మంత్రి సబిత

రాష్ట్రంలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రత్యక్ష విద్యా బోధన ప్రారంభం కానున్నందని ఈ నేపధ్యంలో డిగ్రీ, పీజీ, వృత్తి విద్యా కోర్సుల్లో తరగతిగదిలో 50 శాతం విద్యార్థులను మాత్రమే అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం తన కార్యాలయంలో ఉన్నత విద్యాశాఖాధికారులతో మంత్రి సవి•క్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతీ కళాశాల తరగతుల వారిగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

- Advertisement -

కొవిడ్‌ ‌మార్గదర్శకాలను అనుసరించి తరగతులను నిర్వహించాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ‌విద్యా సంస్థలను తరచూ తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతినిత్యం శానిటైజేషన్‌ ‌పక్రియను చేపట్టేందుకు వీలుగా ప్రతీ యూనివర్సిటీకి రూ. 20 లక్షలు తక్షణసాయంగా అందించాలని ఆదేశించారు. కళాశాలలు పూర్తి సురక్షితం అన్న భావనను కల్పించాలన్నారు.

కాలేజీల్లో విద్యార్థులు గుమికూడకుండా యాజమాన్యాలు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు భౌతికదూరం పాటించే విధంగా చూడాల్సిన బాధ్యత యాజమాన్యాలదేనన్నారు. ఈ సమావేశంలో ఉన్నత విద్య కమిషనర్‌ ‌నవీన్‌ ‌మిట్టల్‌, ‌విద్యామండలి చైర్మన్‌ ‌ప్రొఫెసర్‌ ‌తుమ్మల పాపిరెడ్డి, కార్యదర్శి శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply