Take a fresh look at your lifestyle.

31 ‌శాతం మందికే.. లక్షణాలు

  • 69 శాతం మందికి లక్షణాలు లేకుండానే కొరోనా పాజిటివ్‌ !
  • ‌రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తాజా నివేదిక!!

తెలంగాణలో చాలా మంది కొరోనా వైరస్‌ ‌లక్షణాలు లేకుండానే వైరస్‌ ‌బారినపడుతున్నారని వెల్లడైంది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఇప్పటి వరకు వచ్చిన కేసులను పరిగణనలోకి తీసుకోని ..మొత్తం కేసుల్లో 69 శాతం మంది లక్షణాలు లేకుండానే కొరోనా బారినపడినట్టు తేల్చారు. ఇక 31 శాతం మందికే కొరోనా లక్షణాలు బయటపడ్డాయని తేల్చింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,24,963 పాజిటివ్‌ ‌కేసులు నమోదు కాగా అందులో 86225 మందికి లక్షణాల్లేవని వెల్లడించారు. ఇక 38,738 మందిలో లక్షణాలు కనిపించాయి. ఈ కేసుల కారణంగానే ఇతరులకు పెద్ద సంఖ్యలో వైరస్‌ ‌సోకుతోంది. ఈ కారణంగానే అనేక కుటుంబాల్లో 15 నుంచి 20 మందికి కూడా కొరోనా సోకినట్లు అధికారులు చెప్తున్నారు. కాంటాక్ట్ ‌ట్రేసింగ్లో వైద్య ఆరోగ్యశాఖ ముందంజలో ఉంది. ఆదివారం 37,791 శాంపిళ్లను సేకరించగా వాటిలో ప్రాథమిక రెండో కాంటాక్ట్ ‌ద్వారా అనుమానిత లక్షణాలతో పరీక్ష చేయించుకున్న వారు 59 శాతం మంది ఉన్నారు.

మిగిలిన 41 శాతం మంది డైరెక్ట్ ‌బాధితులు. అంటే ఈ బాధితుల ద్వారా ప్రాథమిక కాంటాక్టు అనుమానంతో 17,006 (45) మందికి కొరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ ప్రాథమిక కాంటాక్టుల నుంచి రె•డో కాంటాక్టు అయిన వారిలో 5,290 (14) మందికి పరీక్షలు నిర్వహించారు. ముఖ్యంగా జిల్లాల్లో ట్రేసింగ్‌ ‌పక్రియ పకడ్బందీగా సాగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రాథమిక సెకండరీ కాంటాక్టులను వెంటనే గుర్తించడం వల్ల వైరస్‌ ‌వ్యాప్తికి అడ్డుకట్ట పడుతోందని చెప్తున్నారు. లక్షణాల్లేకుండా ఎక్కువ మంది వైరస్‌ ‌బారినపడటం వారి ద్వారా వైరస్‌ ‌సోకిన ప్రాథమిక సెకండరీ కాంటాక్టులను పరీక్షల ద్వారా గుర్తించి తక్షణ వైద్యం చేయడం వల్ల చాలామంది వేగంగా కోలుకుంటున్నారు. వీరిని ఇళ్లలోనే ఉంచుతూ చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 31,299 యాక్టివ్‌ ‌కేసులుంటే 24,216 మంది ఇళ్లు లేదా వివిధ సంస్థల ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. మొత్తంగా రాష్ట్రంలో కొరోనా బారినపడిన వారిలో 31 శాతం మందిలో మాత్రమే లక్షణాలు ఉన్నాయని 69 శాతం మంది ఎలాంటి లక్షణాలు లేకుండానే వైరస్‌ ‌బారినపడినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Leave a Reply