Take a fresh look at your lifestyle.

వ్యవసాయేతర ఆస్తుల ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు షురూ

  • స్లాట్‌ ‌బుకింగ్‌ ‌పద్ధతిని ప్రారంభించిన సిఎస్‌ ‌సోమేష్‌కుమార్‌
‌స్టాంప్స్ అం‌డ్‌ ‌రిజిస్ట్రేషన్‌ ‌శాఖ వెబ్‌ ‌సైట్‌ ‌ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌ ‌కోసం అవసరమైన స్లాట్‌ ‌బుకింగ్‌ ‌పద్ధతిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ ‌కుమార్‌ ‌లాంఛనంగా శుక్రవారం బిఆర్‌ ‌కెఆర్‌ ‌భవన్‌లో ప్రారంభించారు. సిఎం కె చంద్రశేఖర్‌ ‌రావు విజన్‌ ‌మేరకు గౌరవ హైకోర్టు ఆదేశాలకనుగుణంగా రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌ ‌స్లాట్‌ ‌బుకింగ్‌ ‌ద్వారా పారదర్శకంగా, సులభతరంగా, ఎటువంటి విచక్షణ లేకుండా ఆన్‌ ‌లైన్‌ ‌పద్ధతి ద్వారా జరుగుతాయని ఈ సందర్భంగా సిఎస్‌ ‌తెలిపారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సులభమైన పద్ధతిలో ఆస్తుల విలువల కనుగుణంగా ఆన్‌ ‌లైన్‌ ‌పద్ధతిలో, నెట్‌ ‌బ్యాంకింగ్‌ ‌ద్వారా చలాన్‌ ‌కనుగుణంగా చెల్లింపులు చేసుకొని తదనంతరం బుక్‌ ‌చేసుకున్న స్లాట్‌కు అనుగుణంగా రిజిస్ట్రేషన్‌ ‌కార్యాలయానికి వెళ్ళవలసి ఉంటుందని సిఎస్‌ ‌తెలిపారు.
రిజిస్ట్రేషన్‌కు సంబంధించి పాత చార్జీలే అమలులో ఉన్నాయన్నారు. రిజిస్ట్రేషన్‌ ‌చేయవలసిన ప్రాపర్టీ వివరాలు నమోదు చేయగానే సిస్టం ద్వారా రిజిస్ట్రేషన్‌ ‌చార్జీ, స్టాంపు డ్యూటి, ఇతర చార్జీల చెల్లింపు వివరాలు జనరేట్‌ అవుతాయన్నారు. ఆధార్‌ ఇవ్వని వారికోసం ప్రత్యేక పద్ధతిని పాటిస్తామన్నారు. ప్రస్తుతం ప్రతి రిజిస్ట్రేషన్‌ ‌కార్యాలయంలో రోజుకు 24 స్లాట్‌ ‌లను కేటాయిస్తామని, డిమాండ్‌ ‌మేరకు వాటిని పెంచడం జరుగుతుందన్నారు. సాంకేతికంగా ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు వార్‌ ‌రూం లో పనిచేస్తున్న టెక్నికల్‌ ‌టీం పరిష్కరిస్తుందని సిఎస్‌ ‌తెలిపారు. రిజిస్ట్రేషన్‌ ‌స్లాట్‌ •••.‌తీవస్త్రఱ•తీ••ఱశీఅ.•వశ్రీ•అస్త్ర•అ•.స్త్రశీఙ.ఱఅ అనే వెబ్‌ ‌సైట్‌ ‌ద్వారా ఆన్‌ ‌లైన్‌లో బుక్‌ ‌చేసుకోవలసి ఉంటుందన్నారు.

Leave a Reply