Take a fresh look at your lifestyle.

అంతరాలను పెంచుతున్న ఆన్‌లైన్‌ ‌విద్య

“పేద ప్రజల బిడ్డలకు పెన్నిధిగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అన్‌లైన్‌ ‌విద్యా బోధన ను అర్థం చేసుకోవడం సంక్లిష్టంగా మారింది.తెలంగాణలో ఈ విద్యా సంవత్సరం జూలై 1వ తేదినుండి విద్యార్థులకు దూరదర్శన్‌ ‌ద్వారా అన్‌లైన్‌ ‌పాఠాలు ప్రారంభమైనాయి.ఉపాధ్యాయులు తరగతుల వారీగా విద్యార్థులను అడాప్ట్ ‌చేసుకోని ఫోన్‌ ‌ద్వారా అన్‌లైన్‌ ‌పాఠాలను మానిటరింగ్‌ ‌చేస్తున్నారు. ఐ.సి.టి వినియోగం లోనైపుణ్యం గల ఉపాధ్యాయులు కొందరు పిల్లలకు జూమ్‌ ‌గూగుల్‌ ‌మీట్‌ ‌ల ద్వారా మరిన్ని ఇన్నోవేటివ్‌ ‌పద్ధతులతో పాఠాలు బోధిస్తున్నప్పటి కొంత మంది విద్యార్థులు మాత్రమే వాటిని సద్వినియోగం చేసుకుంటున్నారు.ఈ చర్య ఉపాధ్యాయులకు తీరని ఆవేదన కల్గిస్తున్నది.కాస్తలోతుగా అలోచించి చూస్తే ఇందులో విద్యార్థులను కూడా తప్పు పట్టే పరిస్థితి లేదనిపిస్తుంది.సుదీర్ఘకాలం ప్రత్యక్ష బోధనకు దూరమైన విద్యార్థులు నియంత్రణ కోల్పోయి సహజంగానే చదువు పట్ల నిరాసక్తత ను కలిగియుంటారు.”

దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్మించబడియుందన్నాడు విద్యా వేత్త కొఠారి. ప్రతిభావంతమైన మానవ వనరుల సృష్టి కి మూలమైన మన పాఠశాలలు కొరోనా మహామ్మారీ కాటుకు రెండు సంవత్సరాలు గా ప్రత్యక్ష బోధన లేక కళతప్పి విలవిల లాడుతున్నాయి.అనేక అంతరాలతో కొనసాగుతున్న మన దేశ విద్యా విధానం అన్‌లైన్‌ ‌చదువుల తో మరింత అగాధంలోకి నెట్టబడింది.పేద ప్రజల బిడ్డలకు పెన్నిధిగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అన్‌లైన్‌ ‌విద్యా బోధన ను అర్థం చేసుకోవడం సంక్లిష్టంగా మారింది.తెలంగాణలో ఈ విద్యా సంవత్సరం జూలై 1వ తేదినుండి విద్యార్థులకు దూరదర్శన్‌ ‌ద్వారా అన్‌లైన్‌ ‌పాఠాలు ప్రారంభమైనాయి.ఉపాధ్యాయులు తరగతుల వారీగా విద్యార్థులను అడాప్ట్ ‌చేసుకోని ఫోన్‌ ‌ద్వారా అన్‌లైన్‌ ‌పాఠాలను మానిటరింగ్‌ ‌చేస్తున్నారు. ఐ.సి.టి వినియోగం లోనైపుణ్యం గల ఉపాధ్యాయులు కొందరు పిల్లలకు జూమ్‌ ‌గూగుల్‌ ‌మీట్‌ ‌ల ద్వారా మరిన్ని ఇన్నోవేటివ్‌ ‌పద్ధతులతో పాఠాలు బోధిస్తున్నప్పటి కొంత మంది విద్యార్థులు మాత్రమే వాటిని సద్వినియోగం చేసుకుం టున్నారు.ఈ చర్య ఉపాధ్యా యులకు తీరని ఆవేదన కల్గిస్తున్నది. కాస్తలోతుగా అలోచించి చూస్తే ఇందులో విద్యార్థులను కూడా తప్పు పట్టే పరిస్థితి లేదని పిస్తుంది. సుదీర్ఘకాలం ప్రత్యక్ష బోధనకు దూరమైన విద్యార్థులు నియంత్రణ కోల్పోయి సహజంగానే చదువు పట్ల నిరాసక్తత ను కలిగియుంటారు. పాఠశాల లో సమవయస్కుల మధ్య ,ఉపాధ్యాయుల పర్యవేక్షణ లో పాఠ్య, సహాపాఠ్యాంశాలను నేర్చు కుంటూ మానసిక ఉల్లాసాన్ని పొందే విద్యార్థులు టీ.వి ల ముందు కూర్చుని పాఠాలు విని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. కానీ నేడు మనమున్న సంక్షోభ పరిస్థితుల లో ఇంతకంటే మెరుగైన ప్రత్యామ్నాయం మరొకటిలేదనే సత్యాన్ని ఒప్పుకోవాల్సిందే.

అదే సందర్భంలో మన కళ్ళముందు కనబడుతున్న మరికొన్ని సత్యాలు కూడా అంగీకరించాలి. విద్యా వ్యాపారీకరణ జరిగి ప్రయివేటు విద్యారంగం విస్తరించడం తో ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడంలో అలసత్వాన్ని ప్రదర్శించాయి.మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు ప్రతి సంవత్సరం బడ్జెట్‌ ‌లో నిధులు కేటాయింపులు తగ్గిస్తూ వచ్చారు. ఫలితంగా అనేక ప్రభుత్వ పాఠశాలలు మౌలిక వసతుల కొరతను ఎదుర్కొంటున్నాయి.దీని వల్ల ధనవంతులు పిల్లలు ప్రయివేటు బళ్ళలో పేద . బడుగు వర్గాల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పరిస్థితులు సృష్టించబడినాయి.ఈ అంతరాలకు తోడుగా ప్రభుత్వ రంగంలోనే గురుకులాల పేరుతో కొంత మంది పిల్లలకు మాత్రమే మెరుగైన విద్యను అందించటానికి ప్రభుత్వం పూనుకొన్నది. దీనితో ప్రభుత్వ, మండల,జిల్లా పరిషత్‌ ‌పాఠశాలల్లో చదివే విద్యార్థులు అర కొర సౌకర్యాలతో విద్యనభ్యసిస్తున్నారు. ప్రత్యక్ష బోధనకు దూరమైన నేటి కొరోనా పరిస్థితులలో కూడా సాపేక్షికంగా ఇలాంటి అంతరాలే నెలకొన్నాయి.

లక్షలాది రూపాయలు వెచ్చించి తమ పిల్లలను కార్పొరేట్‌ ‌పాఠశాలల్లో చదివించే తల్లి తండ్రులు ఆన్లైన్‌ ‌విద్యకు అవసరమైన సౌకర్యాలను కల్పించడంలో ముందున్నారు. కాని రెక్కాడితే డొక్కాడని పేద తల్లి తండ్రులు తమపిల్లలకు ఇప్పటికి స్మార్ట్ ‌ఫోన్లు కొనివ్వలేని స్థితిలో ఉన్నారు.ఫోన్లు కొన్న వారికి డాటాను రీచార్జ్ ‌చేసుకుని వాడలేని పరిస్థితులున్నాయి.విద్యార్థుల తల్లి దండ్రులకు ఫోన్‌ ‌చేసినప్పుడు ఫోన్లు కొనివ్వలేని వారి ఆర్థిక స్థితి ని ఆవేదనగా తెల్పినప్పుడు బాధ కల్గక మానదు. అన్లైన్‌ ‌పాఠాలు జరుగుతున్న ఈ తరుణం లో పేద పిల్లల చదువులు గాడిలో పడాలంటే ప్రభుత్వం ఆ వర్గాల పట్ల ప్రత్యేక శ్రద్ధ ను కనబరచాలి.వారికి స్మార్ట్ ‌ఫోన్ల తో పాటు డాటా రీచార్జ్ ‌సదుపాయం కల్పించాలి. మధ్యాహ్న భోజనానికి దూరమైన విద్యార్థులు పౌష్టికాహార కొరతను ఎదుర్కొంటున్నారు.అలాంటి వారికి బియ్యం తో పాటు గ్రుడ్ల ను అందించాలి.దీని ద్వారా తల్లిదండ్రులు పిల్లల చదువుల పై దృష్టి మరల్చి ఆన్లైన్‌ ‌పాఠాలను వినడానికి అవసరమైన సానుకూల వాతావరణం సృష్టించ గలుగుతారు.

లేనిచో కుటుంబ అవసరాల నిమిత్తం పిల్లలను పొలం పనులు ఇతరత్రా కూలీ పనులకు పంపించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే గ్రామాల్లో పాఠాలు వినాల్సిన పిల్లలు పనులు బాట బట్టారని తెలుస్తుంది.ఈ స్థితి నుండి బయట పడే మార్గాల గురించి ఆలోచించనట్లైతే పేద విద్యార్థుల భవిష్యత్తు మరింత అంధాకారమౌతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చేస్తున్న హెచ్చరికలను బట్టి కొరోనా ఉపద్రవం ఇప్పట్లో ముగిసే అవకాశం లేదనుపిస్తుంది.థర్డ్ ‌వేవ్‌ ‌ప్రమాద ఘంటికలు మన ఆశల పై నీళ్ళు జల్లుతూ ఆందోళన కల్గిస్తున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర విద్యాశాఖ ఒక దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాలి.సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో వెనుకబడిన ఉపాధ్యాయులకు శిక్షణ అందించాలి. ఆన్లైన్‌ ‌విద్యను రాష్ట్రం లోని ప్రతి మారుమూల పల్లెకు,గిరిజన,ఆదివాసి గూడాలకు అందునుట్లు చర్యలు చేపట్టాలి.సమాజ భాగస్వామ్యం తో ఈ సంక్షోభ స్థితిని అధిగమించాలి.

తల్లి దం డ్రులు పాఠశాల యాజ మాన్య కమిటీ లకు అవ గాహాన కల్పించి వారి సహా కారంతో ఆన్లైన్‌ ‌విద్యా ఫలితాలు అన్ని వర్గాల పిల్ల లకు అందునట్లు కార్యా చరణ రూపొం దించాలి. డీ.టి.ఎఫ్‌ ‌లాంటి ప్రగతి శీల ఉపాధ్యాయ సంఘాలు విద్యా రంగం లోని అసమానతలు తొలగి ంచడానికి కామన్‌ ‌స్కూల్‌ ‌విద్యా విధానమే పరిష్కార మని ఎన్నో ఏళ్ళుగా ఒక ఉద్యమంగా ముందుకు తీసుకు పోతున్నవి. ప్రొఫెసర్‌ అనిల్‌ ‌సద్గోపాల్‌ ఆధ్వర్యంలో కామన్‌ ‌స్కూల్‌ ‌విద్యా విధానం అవసరాన్ని తెలియజేస్తూ దేశవ్యాప్తంగా అనేక సదస్సు నిర్వహించబడినాయి. ఈ స్పూర్తితోనే తెలంగాణ ఉద్యమ సందర్భంలో కామన్‌ ‌స్కూల్‌ ‌నా కల అన్న ప్రస్తుత ముఖ్యమంత్రి తర్వాత కాలంలో ఆ దిశగా ఆలోచించక పోగా మరింత అగాధాన్ని సృష్టించారు .ఆంధ్ర ప్రదేశ్‌ ‌లో నాడు-నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల మౌలిక సదుపాయాలను మెరుగు పరిచినట్లు తెలంగాణ లో కూడా ప్రభుత్వ పాఠశాలలను బాగు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలియుచున్నది. ఇది కార్య రూపం దాల్చితే సంతోషించ దగ్గ పరిణామమే. ఇప్పటికిప్పుడు ప్రత్యక్ష తరగతులు నిర్వహించలేని పరిస్థితుల వల్ల ఆన్లైన్‌ ‌విద్యను దృష్టిలో ఉంచుకుని సమాచార, ప్రసార, సాంకేతిక విజ్ఞాన కేంద్రాలుగా పాఠశాలను తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం కనబడుతున్నది.ప్రభుత్వం ఆ దిశ గా చిత్త శుద్ధి తో అడుగులు వేసినప్పుడే పేద ప్రజల ఆశా కిరణగా నున్న ప్రభుత్వ బడుల మనుగడ మరి కొంత కాలమైన కొనసాగుతుంది.

– గన్‌ ‌రెడ్డి ఆదిరెడ్డి, 9494789731

Leave a Reply