Take a fresh look at your lifestyle.

రాజన్నగుడిలో కొనసాగుతున్న దర్శనాలు

డిసిన్‌ఫెక్షన్‌ ‌టన్నల్‌ ‌ద్వారా వెళ్తున్న భక్తుడు, కోడెలకు పూజలు చేస్తున్న అర్చకులు , శ్రీస్వామివారికి అభిషేకం చేస్తున్న స్థానాచార్య భీమన్న , శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణాన్ని నిర్వహిస్తున్న అర్చకులు

వేముల వాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో భక్తుల దర్శనాలు గురువారం సైతం యథాతథంగా కొనసాగా యి. భక్తులందరికి శానిటైజేషన్‌ ‌చేసిన పిదప భౌతిక దూరం పాటించేట్లుగా చేసి,వారికి శ్రీస్వామివారి దర్శ నాన్ని కల్పించారు.ఇదే సమయంలో ఆన్‌లైన్‌లో బుక్‌ ‌చేసుకున్న భక్తుల కోసం కోడె మొక్కులు, శ్రీస్వామివారికి అభిషేకం,కుంకుమ పూజలను ఆలయంలోని అర్చకులు నిర్వహించారు.ఈ ఏర్పాట్లన్నింటిని ఎప్పటికప్పుడు ఏఇఓ ఉమారాణి,ఇఇ రాజేశ్‌లు పర్యవేక్షించి,సిబ్బందికి తగిన ఆదేశాలు జారీచేశారు.

వైభవంగా శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణం
వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన వేములవాడలోని శ్రీ వేణుగో పాలస్వామి ఆలయంలో శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణం వైభవంగా గురువారం నిర్వహించారు.ఈ ఆలయంలో గత ఐదు రోజులుగా నిర్వహించబడుతు న్న అధ్యయనోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం శ్రీ వేణుగోపాల స్వామికి అభిషేకాది పూజలను ఆలయ అర్చకుడు పురుషోత్తమ చారి నిర్వహించారు. అనంత రం రాజన్నగుడి స్థానాచార్య అప్పాల భీమన్న అధ్యర్యం లోని అర్చకులు రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగో పాల స్వామి కళ్యాణాన్ని నిర్వహించారు.ఈ కళ్యాణంలో కన్యాదాతలుగా నేరెళ్ల పురుషోత్తమ చారి,పద్మావతిలు వ్యవహరించారు.కరోనా వైరస్‌ ‌నేపథ్యంలో ఈ కళ్యాణోత్సవానికి భక్తులెవరిని అనుమతించలేదు.ఈ కళ్యాణం నిర్వహించిన పిదప సాయంత్రం ఏకాంత సేవతో అధ్యనోత్సవాలు ముగిశాయి.

Leave a Reply