- బ్లాక్‌లో దర్శనం టిక్కెట్ల విక్రయం…
- తిరుమలలో ముగ్గురు దళారుల అరెస్ట్
తిరుమల, ఫిబ్రవరి 9 : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 5 కంపార్టుమెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 14 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని వెల్లడించారు. బుధావారం 63,315 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 25,259 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించు కున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 5.07 కోట్లు వచ్చిందని తెలిపారు. శ్రీవైష్ణవ భక్తుడు, ఆళ్వారులలో ప్రముఖుడైన శ్రీ అనంతాళ్వారు 969వ అవతారోత్సవాన్ని ఫిబ్రవరి 19వ తేదీన తిరుమలలోని పురుశైవారి తోటలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో అనంతాళ్వార్ బోధనలు, రచనలపై సదస్సు నిర్వహిస్తున్నామని, 16 మంది పండితులు పాల్గొని ఉపన్యసించనున్నారని పేర్కొన్నారు.
బ్లాక్‌లో దర్శనం టిక్కెట్ల విక్రయం…తిరుమలలో ముగ్గురు దలారుల అరెస్ట్
భక్తుల అవసరాలను ఆసరా చేసుకుని దర్శన టికెట్లను అధిక ధరకు విక్రయిస్తున్న ముగ్గురు దళారులను తిరుమల పోలీసులు అరెస్టు చేశారు. తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శన రూ. 500 టికెట్లను బెంగళూరు, హైదరాబాద్‌కు చెందిన భక్తులకు దళారీలు అధిక ధరకు విక్రయించి పట్టుబడ్డారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి సిఫార్సు లేఖతో దర్శనానికి వచ్చిన భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వెళ్లగా వారిని విజిలెన్స్ వింగ్ అధికారులు తనిఖీలు చేయగా పట్టుబడ్డారు.బెంగళూరు భక్తులకు రూ. 500 విలువైన 5 వీఐపీ టికెట్లు రూ. 31,500లకు , హైదరాబాద్ భక్తులకు రూ. 500 విలువైన మూడు వీఐపీ టికెట్లు రూ. 15000లకు విక్రయించారు. విజిలెన్స్ అధికారుల ఫిర్యాదుతో దళారీలు తులసి, వెంకటేశ్, రఘురామన్‌పై తిరుమల టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.