Take a fresh look at your lifestyle.

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

  • వైభవంగా చక్రస్నానం వేడుకలు
  • వైకుంఠ ఏకాదశితో ఏకంగా రూ.7.68 కోట్ల ఆదాయం

తిరుమల,జనవరి3 :  వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో స్వామి వారి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం పుష్కరిణిలో చక్రత్తాళ్వార్లకు అర్చకులు స్నానం చేయించారు. శ్రీ సుదర్శన చక్రత్తాళ్వారణు శ్రీవారి ఆలయం నుంచి శ్రీ భూవరహస్వామి వారి ఆలయానికి ఊరేగింపుగా తీసుకువచ్చి శ్రీవారి పుష్కరిణిలో స్నపన తిరుమంజన, చక్రస్నాన మహోత్సవం నిర్వహించారు. వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా తెల్ల వారుజాము నుంచే స్వామివారిని దర్శించు కునేందుకు భక్తులు బారులు తీరారు. టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే ఉత్తరద్వార దర్శనానికి అనుమతిస్తున్నారు. తిరుపతిలోని కపిలేశ్వరస్వామివారి ఆలయంలో తెప్పో త్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం శ్రీ సుబ్రమ ణ్యస్వామివారు తెప్పలపై భక్తులకు దర్శనమిచ్చారు.

విద్యు ద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పోత్సవం కన్నుల పండుగగా జరిగింది. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు అందించారు. ఈ సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు భక్తి సంకీర్తనలు ఆలపి ంచారు.ఇకపోతే తిరుమల శ్రీవారి ఆలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేనంత హుండీ ఆదాయం సమకూరింది. వైకుంఠ ఏకాదశి పర్వదినం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. భక్తులు స్వామివారికి సమర్పించిన కానుకలను లెక్కించగా ఏకంగా రూ.7.68 కోట్లు వచ్చింది.

ఒక్కరోజులో ఇంత పెద్ద మొత్తం కానుకలు రావడం చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. సోమవారం స్వామివారిని 69,414 మంది దర్శించుకోగా.. 18,612మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అయితే.. గతేడాది అక్టోబర్‌ 23‌న అత్యధికంగా రూ.6.31 కోట్లు వచ్చింది. అంతే కాకుండా 2022 లో తిరుమల హుండీలు గలగలలాడాయి. శ్రీవారికి భక్తులు రూ. 1446 కోట్లు సమర్పించారు. లడ్డూ ప్రసాదం విక్రయాల ద్వారా 11,42,78,291 కోట్ల లడ్డూలను విక్రయించారు. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం ఈ నెల 11 వరకు కొనసాగనుంది. దీంతో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. సామాన్య భక్తులు ఎక్కువ మందికి వైకుంఠ ద్వార సర్వదర్శనం చేయించాలని ఉదయం 6 గంటల నుంచే సర్వదర్శనం ప్రారంభించినట్లు టీటీడీ ఛైర్మన్‌ ‌వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. దీంతో వైకుంఠ ద్వార దర్శనం జరిగే పదిరోజులు సిఫారసు లేఖల దర్శనాలు రద్దు చేశారు. భక్తుల సౌకర్యం కోసం తిరుపతిలోని 9 ప్రాంతాల్లో స్లాటెడ్‌ ‌సర్వదర్శనం టోకెన్ల జారీ చేశారు. నిర్దేశించిన సమయానికి తిరుమల క్యూ లైన్‌ ‌లోకి రావాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a Reply