Take a fresh look at your lifestyle.

దేవన్నపేటలో కొనసాగుతున్న ఉద్రిక్తత

టిఆర్‌ఎస్‌ ‌సభ కోసం భూములు చదును చేసే పని
హసన్‌పర్తి సిఐ బెదిరింపులపై మండిపడ్డ రైతులు
పక్కన ఉన్న భూమిలో పూజాకార్యక్రమాలు చేసిన నేతలు

హన్మకొండ,నవంబర్‌6: ‌టిఆర్‌ఎస్‌ ‌సభ కోసం ఎంపిక చేసిన దేవన్నపేటలో ఉద్రిక్తత కొనసాగుతోంది. టీఆర్‌ఎస్‌ ‌సభా స్థలికోసం పోలీసులు అత్యుత్యాహం ప్రదర్శించారు. మరోవైపు అధికారుల అండతో గులాబీ గ్యాంగ్‌ ‌సభా స్థలంలో ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ ‌కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించాలని భావించారు. అయితే.. రైతులు పెద్దమొత్తంలో రావడంతో ఎమ్మెల్యే కార్యక్రమానికి హాజరుకాలేదు. సభాస్థలి నుంచి వెళ్లి పోవాలంటూ.. మహిళలతో హసన్‌ ‌పర్తి సీఐ శ్రీధర్‌ ‌రావు దురుసుగా ప్రవర్తించాడు. భూమి పత్రాలు తీసుకురావాలని, ఈ భూమి  జాగీరా అంటూ.. నోటికి ఎంతవస్తే అంత మాట్లాడటంతో..పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు ఆందోళనకు దిగారు. పరిస్థితి అదుపులోకి తీసుకువచ్చేందుకు భారీగా పోలీసులు మోహరించారు. పోలీసుల తీరుతో రైతులు ఆందోలన చెందడంతో దేవన్నపేటలో  ఉద్రిక్తత  కొనసాగుతోంది. విజయగర్జన  సభ కోసం  భూములు ఇవ్వమంటున్నారు  రైతులు. సభా స్థలం కోసం భూములు  పరిశీలించేందుకు  వచ్చిన టీఆర్‌ఎస్‌  ‌లీడర్లు, పోలీసులను  అడ్డుకున్నారు. హసన్‌ ‌పర్తి సీఐతో రైతులు  వాగ్వాదానికి దిగారు.. దౌర్జన్యంగా  భూములు లాక్కొని  సభ పెడుతామంటే ఊరుకునేది  లేదన్నారు. వ్యవసాయ  భూములు, ప్లాట్లలో టింగ్‌ ఎలా  పెడుతారని ప్రశ్నించారు.  భూములు చదును  చేసి  టింగ్‌ ‌పెడితే  హద్దులు చెడిపోతాయన్నారు.  అంతే కాదు భూవివాదాలు తలెత్తుతాయని  మండిపడ్డారు. మరో  15 రోజులు  అయిపోతే… పంటలు కోతకు వస్తాయని  ఇలాంటి టైంలో  సీఎం కేసీఆర్‌ ‌నిర్ణయం  సరైంది కాదన్నారు.

సభ కోసం ఎట్టి పరిస్థితుల్లో భూములు  ఇచ్చేది లేదని  తేల్చిచెప్పారు. దీంతో టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉన్న రైతుల భూముల్లో విజయోత్సవ సభ పనులు చేపట్టారు. దేవన్నపేటలో కొబ్బరికాయ కొట్టి టీఆర్‌ఎస్‌ ‌నాయకులు పనులు ప్రారంభించారు. డీసీసీబీ డైరెక్టర్‌ ‌రాజేశ్వర్‌ ‌రెడ్డి, స్థానిక కార్పొరేటర్‌ ‌భర్త రాజు నాయక్‌ ‌పనులను ప్రారంభించారు. రైతుల నిరసనలతో సభను ప్రారంభించే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ ‌విరమించుకున్నారు. మరోవైపు దేవన్నపేట ప్రాంతంలో  ఈనెల 29న తెలంగాణ విజయ గర్జన సభ నిర్వహిస్తున్నట్లు చీఫ్‌విప్‌ ‌దాస్యం వినయభాస్కర్‌ ‌తెలిపారు. హనుమకొండలో విలేకర్ల సమావేశంలో వినయభాస్కర్‌ ‌మాట్లాడారు. 29న నిర్వహించే సభ దేశ చరిత్రలో నిలిచేలా ఉంటుందన్నారు. 15 లక్షల మందితో కనీవిని ఎరుగని రీతిలో సభ నిర్వహించబోతున్నామని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సభకు 20 వేల బస్సులు, మరో 20 వేల ఇతర వాహనాల్లో తరలిరానున్నారని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేని ప్రతిపక్ష పార్టీలు ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ ‌మాట్లాడుతూ..  29న నిర్వహించే సభకు ప్రతిపక్ష పార్టీలు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. రైతులను రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు. స్థల సేకరణ విషయంలో రైతులకు ఎలాంటి నష్టం జరుగనివ్వమని ఆయన అన్నారు.

Leave a Reply