Take a fresh look at your lifestyle.

వేములవాడలో కొనసాగుతున్న సేవలు

లాక్‌డౌన్‌ ‌నేపథ్యంలో వేములవాడ శ్రీ రాజరాజే శ్వరస్వామి దేవస్థానం అధ్యర్యంలో కొనసాగు తున్న అన్నదానం గురువా రం సైతం నిర్వహించారు. దేవస్థానం నిత్యాన్నదాన సత్రంలో సిద్ధంచేసిన భోజనాలను కట్టకింద బస్‌స్టాండ్‌,‌సాయిరక్ష డాబా, శాస్త్రిన గర్‌లోని సంచార తెగలు,వలస కూలీలు,శివపార్వతుల కాలనీ వద్దకు రాజన్నగుడి ప్రత్యేక వాహనం లో తీసుకువెళ్లి భోజనాలను అందించారు.ఇదే సమయంలో అన్నపూర్ణ క్యాంటీన్‌ ‌వద్ద మున్సిపాలిటి అధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు.

ఆర్యవైశ్య సత్రం, మున్నూరుకాపు నిత్యాన్న సత్రం వారు భోజనాలను సిద్ధం చేసి ఆయా ఏరియాల వద్ద గల వలస కూలీలకు పంపిణి చేశారు. తోటరామ్‌ ‌కుమార్‌ ‌ఛారిటబుల్‌ ‌ట్రస్టు ప్రతినిధులు మొట్టల మహేశ్‌కుమార్‌,‌నాయిని శేఖర్‌లు చందుర్తి మండల కేంద్రంతో పాటు ఎన్గల్‌, ‌గుడిపేట, జోగాపూర్‌ ‌గ్రామాలకు చేరుకుని నిరుపేదలకు నిత్యావసర సరకులను జడ్పీటిసి నాగం కుమార్‌,ఎం‌పిటిసి సభ్యుడు మేకల గణేశ్‌, ‌నాయకులు మ్యాకల ఎల్లయ్య ల ద్వారా పంపిణి చేశారు

Leave a Reply