- ఘర్షణలో మరొకరు మృతి..10కి చేరిన మృతులు
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సిటిజన్ షిప్ అమెండ్ మెంట్ యాక్ట్ (సీఏఏ)కు వ్యతిరేకంగా ఢిల్లీలో కొనసాగుతున్న ఆందోళనలు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఈ ఆందోళనల సమయంలో చెలరేగిన హింసలో మరణించినవారి సంఖ్య 10కి చేరింది. భజన్ పూరాలో ఇరు వర్గాల మద్య పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఆందోళన నేపథ్యంలో పలు మెట్రో స్టేషన్లు మూసి వేశారు. ఈ ఘటనలో ఇప్పటికే పలువురికి తీవ్ర గాయాలు కాగా అందులో ఇద్దరు విలేకరుల పరిస్థితి విషమంగా ఉంది. ఇక ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో ఆందోళనకారుల రాళ్ల దాడులు, దుకాణాల విధ్వంసం, పోలీసుల లాఠీ చార్జి కొనసాగుతున్నాయి. దుకాణాలు, టైర్లు తగలబెట్టడంతో పలు ప్రాంతాల్లో పొగ కమ్ముకుంది. పరస్పర దాడుల్లో వందల మందికి గాయాలు అయ్యాయి. అల్లర్లను అదుపు చేయాలంలో ఆర్మీని రప్పించాలని సీఎం కేజీవ్రాల్ కోరుతున్నారు.

