Take a fresh look at your lifestyle.

కొనసాగుతున్న లోకేశ్‌ ‌పాదయాత్ర

  • నాలుగోరోజు పలమనేరు నుంచి ప్రారంభం
  • కర్నాటకలో పెట్రో రేట్లు తక్కువన్న లోకేశ్‌
  • ఎపిలో దోపిడీకి ఈ రేట్లే నిదర్శనమని విమర్శలు

కుప్పం,జనవరి30: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ ‌యువగళం పాదయాత్ర నాలుగో రోజు కొనసాగుతోంది. సోమవారం ఉదయం కర్ణాటక రాష్ట్రం పంతాన్‌ ‌హల్లికి పాదయాత్ర చేరుకుంది. లోకేష్‌ ‌పాదయాత్రకు కర్ణాటక పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. పంతాన్‌ ‌హల్లి పెట్రోల్‌ ‌బంక్‌లో ఆగిన టీడీపీ నేత… తన కాన్వాయ్‌ ‌వాహనాలకు దగ్గరుండి డీజిల్‌ ‌కొట్టించారు. అనంతరం తానే స్వయంగా డబ్బులు ఇచ్చి ఏపీలో ఉన్న రేట్లకి కర్ణాటకలో ఉన్న పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌రేట్లకి ఉన్న తేడాను తెలుసుకున్నారు. పెట్రోల్‌, ‌డీజిల్‌పై జగన్‌ ‌రెడ్డి బాదుడే బాదుడు అని లోకేష్‌ ‌మండిపడ్డారు. కర్ణాటకలో లీటర్‌ ‌డీజిల్‌ ‌రూ.88, పెట్రోల్‌ ‌రూ.102 అని… ఏపీలో లీటర్‌ ‌డీజిల్‌ ‌రూ.99.27, రూ.పెట్రోల్‌ 111.50‌లుగా ఉందని… అంటే జగన్‌ ‌రెడ్డి బాదుడు 10 రూపాయిలు అని చెప్పుకొచ్చారు.

తనతో నడుస్తున్న ప్రజలకు, కార్యకర్తలకు రేట్ల తేడా గురించి వివరించారు. దేశం మొత్తంలో ఏపీలోనే ఎక్కువ రేట్లు ఉన్నాయంటూ పన్నుల భారం గురించి ప్రజలు, కార్యకర్తలకు లోకేష్‌ ‌వివరించారు. లోకేష్‌ ‌యువగళం పాదయాత్ర నాలుగో రోజు పలమనేరు నియోజకవర్గం నుంచి ప్రారంభమైంది. ఇదిలావుంటే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ’‌యువగళం’ పాదయాత్ర లో ఏపీ-కర్నాటక సరిహద్దులో ఓ అసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. పాదయాత్రలో కర్నాటక పరిధిలో వచ్చిన రోడ్లపై ఆ రాష్ట్ర పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేశారు.

సరిహద్దు దాటి తిరిగి ఏపీలోకి అడుగుపెట్టేలోపు లోకేష్‌ ‌వారికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే టీడీపీ నేతలు కర్నాటక పోలీసులను అభినందించారు. ఈ సందర్బంగా టీడీపీ నేతలు  మాట్లాడుతూ సరిహద్దులో లోకేష్‌ ‌పాదయాత్రకు కర్నాటక పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. వాళ్లకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. లోకేష్‌ ‌పాదయాత్రకు కర్నాటక పోలీసులు కల్పించిన భద్రత, వాళ్లు వ్యవహరించిన తీరు అద్భుతమని మరో టీడీపీ నేత అన్నారు. కర్నాటక పోలీసులను చూసి ఆంధ్రా పోలీసులు నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కాగా 4వ రోజు సోమవారం ఉదయం పలమనేరు నియోజకవర్గం నుంచి నారా లోకేష్‌ ‌పాదయాత్ర ప్రారంభమైంది.

వి.కోటలో పట్టుగూళ్ల రైతులు లోకేష్‌ను కలిశారు. ఈ సందర్భంగా లోకేష్‌ను వి.కోటలో పట్టుగూళ్ల రైతులు కలిశారు. ప్రభుత్వం తమకు సబ్సిడీ ఇవ్వట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలపై స్పందించిన లోకేష్‌.. ‌టీడీపీ అధికారంలోకి రాగానే.. సబ్సిడీ అందిస్తామని హా ఇచ్చారు. రాత్రికి కృష్ణాపురం టోల్‌గేట్‌ ‌సపంలో లోకేష్‌ ‌బస చేస్తారు.

Leave a Reply