Take a fresh look at your lifestyle.

తెలంగాణలో కొనసాగుతున్న లాక్‌డౌన్

ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్న పోలీసులు
అనవసనరంగా రోడ్లపైకి వస్తే చర్యలు తప్పవన్న డిజిపి
రోజూ ఆవరేజ్‌గా 8వే ల కేసులు..5వేల వాహనాల సీజ్‌

కొరోనా తీవ్రత దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ 14‌వ రోజుకు చేరుకుంది. హైదరాబాద్‌ ‌సహా అన్ని పట్టణాల్లో ఉదయం పది తరవాత పోలీసులు రంగప్రవేశం చేశారు. ఎక్కడిక్కడ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. పది తరవాత కూడా వాహనదారుల రాకతోహైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌ ‌జామ్‌ ఏర్పడింది. లకిడికాపూల్‌ ‌నుంచి పంజాగుట్ట వరకు ట్రాఫిక్‌ ‌జామ్‌ అయ్యింది. మూసరంబాగ్‌ ‌నుంచి కోటి వరకు వాహనాలు నెమ్మదిగా కదిలాయి.  రాణిగంజ్‌, ‌ప్యారడైజ్‌, ‌ప్యాట్నీ సెంటర్ల వద్ద వాహనాల రద్దీ ఏర్పడింది. అయితే రాష్ట్రంలో చిన్న పట్టణాల నుంచి హైదరాబాద్‌ ‌వరకు లాక్‌డౌన్‌ ‌సమర్థవంతంగా కొనసాగుతోందని డీజీపీ మహేందర్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు. కూకట్‌పల్లిలో లాక్‌డౌన్‌ను పరిశీలించి పోలీసు అధికారులకు డీజీపీ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వి•డియాతో మాట్లాడారు. అనవసరంగా రోడ్ల వి•దకు రావొద్దు అని ప్రజలకు డీజీపీ విజ్ఞప్తి చేశారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలన్నారు. లాక్‌డౌన్‌ ‌వేళల్లో బయటకు వచ్చే వాహనాలను సీజ్‌ ‌చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి ప్రవేశించే వారికి ఈ-పాసులు తప్పనిసరి అని డీజీపీ తేల్చిచెప్పారు. ఈ-పాసును ఎక్కడ తీసుకున్నా అనుమతిస్తామని అన్నారు.

పాసులను దుర్వినియోగం చేయకూడదన్నారు. రైతుల వ్యవసాయ పనులకు ఎక్కడా ఆటంకం కలిగించడం లేదని డీజీపీ మహేందర్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. ఈస్ట్ ‌జోన్‌ ‌పరిధిలోని విశాల్‌ ‌మార్ట్ అం‌బర్‌పేట్‌ ‌చెక్‌పోస్ట్ ‌వద్ద తనిఖీలను పరిశీలించామని  సీపీ అంజనీ కుమార్‌ ‌తెలిపారు. ఈస్ట్‌జోన్‌ ‌పరిధిలో 25 చెక్‌ ‌పోస్టులు ఉన్నాయని, జాయింట్‌ ‌సీపీ రమేష్‌ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నారన్నారు. ఇతర సిటీలతో పోలిస్తే మన హైదరాబాద్‌లో కొరోనా కేసుల సంఖ్య చాలా తక్కువగా నమోదు అవుతున్నాయని చెప్పారు. డెత్‌రేట్‌ ‌కూడా చాలా తక్కువగా ఉందన్నారు. ప్రజలు ఇదే విధంగా మరికొద్ది రోజులు లాక్‌డౌన్‌ ‌నిబంధనలు పాటిస్తే ఇంకా మంచి రిజల్ట్ ‌కనిపిస్తుందని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ వెహికల్స్, ‌పర్మిషన్‌ ఉన్న వాహనాలను మాత్రమే అనుమతి ఇస్తున్నామన్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చి వారిపై రోజుకు ఆవరేజ్‌గా 8 వేల కేసులు నమోదు చేశామని…5వేల వాహనాల వరకు సీజ్‌ ‌చేశామని చెప్పారు. కొంతమంది వాహనదారులు పాస్‌లను మిస్‌ ‌యూజ్‌ ‌చేస్తున్నారన్నారు.

అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారిపై కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్‌ ‌చేస్తున్నట్లు తెలిపారు. మలక్‌పేట్‌ ‌చెక్‌పోస్టు వద్ద 60 వాహనాలను సీజ్‌ ‌చేయడం జరిగిందని సీపీ అంజనీకుమార్‌ ‌వెల్లడించారు. ఇదిలావుంటే కొరోనా•తో  మరణించిన వారిని ఇల్లు/హాస్పిట నుంచి శ్మశాన వాటికకు ఉచితంగా తరలించేందుకు అంతిమయాత్ర రథాలను ప్రభుత్వం గ్రేటర్‌లో హైదరాబాద్‌లో అందుబాటులోకి తెచ్చింది. వీటిని అవసరమైన వారు సంబంధిత ఫోన్‌ ‌నెంబర్లలో సంప్రదించవచ్చని అధికారులు పేర్కొన్నారు. ఈమేరకు అంబులెన్స్‌ల కోసం సంప్రదించాల్సిన అధికారుల ఫోన్‌నెంబర్లను మునిసిపల్‌ ‌పరిపాలనశాఖ ప్రిన్సిపల్‌ ‌సెక్రటరీ అర్వింద్‌కుమార్‌ ‌జోన్ల వారీగా వెల్లడించారు. మరణించిన వారి మృతదేహాలను తరలించేందుకు అంబులెన్సుల వారు భారీఎత్తున వసూళ్లకు పాల్పడుతూ దోపిడీ చేస్తున్నారనే ఫిర్యాదులతో మంత్రి కేటీఆర్‌ ‌సూచన మేరకు ప్రభుత్వం ఈ సదుపాయం అందుబాటులోకి తెచ్చినట్లు ట్విట్టర్‌ ‌వేదికగా తెలిపారు.

Leave a Reply