కొనసాగుతున్న అన్నదానాలు.. సరకుల పంపిణి
కూలీలు,నిరుపేదలు,అనాధలు,గంగిరెద్దుల వాళ్లకు వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం వారు చేస్తున్న అన్నదానం గురువారం సైతం కొనసాగింది. దేవస్థానం నిత్యాన్నదాన సత్రంలో సిద్ధం చేసిన భోజ నాలను దేవస్థానం ముందుభాగంలోని పేదలకు, కట్టకింద బస్‌స్టాండ్, సాయిరక్ష డాబా,శాస్త్రినగర్‌లోని గంగిరెద్దుల వాళ్లు, శివపార్వతుల కాలనీ పేదలకు, వలస కూలీలకు ప్రత్యేక వాహనంలో భోజనాలను తీసుకెళ్లి అందజేశారు.ఇదే సమయంలో వేములవాడ మున్సిపాలిటి అధ్వర్యంలో అన్నపూర్ణ క్యాంటీన్ వద్ద భోజనాలను అందజేశారు.ఆర్యవైశ్వ సత్రం,మున్నూరు కాపు నత్రం నిర్వాహకులు సైతం వలస కూలీలకు భోజనాలను సమకూర్చారు. వేములవాడ ఆర్టీసి బస్‌డి పోలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికులక వేములవా డలోని తోట రామ్‌కుమార్ ఛారిటబుల్ ట్రస్టు ప్రతినిధు లు మొట్టల మహేశ్,నాయిని శేఖర్ తదితరులు 12 రకాల నిత్యావసర సరకులను ఆర్టీసి ఆర్ఎం జీవన్ ప్రసాద్ ద్వారా అందజేశారు.
ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ భూపతిరెడ్డి, ట్రాఫిక్ సూపరింటెండెంట్ వర్జిల్, మెకానికల్ సూపరింటెండెంట్ హర్భన్సింగ్, పిఆర్ఓ శ్రీనివాస్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. రాజన్నగుడి అధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలలోని కోడెలకు, ఆవులకు బిజెపి నాయకుడు ఎర్రం మహేశ్, రాష్ట్ర గోశాలల ఫెడరేషన్ మెంబర్ బైరి సతీష్,గొడిశెల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పచ్చగడ్డిని వితరణ చేసి, ఆవులకు తినిపించారు.ఇదే సమయంలో రాష్ట్ర గోశాల ల ఫెడరేషన్ అధ్యక్షుడు మహేశ్ అగర్వాల్ 12 క్వింటాళ్ల పచ్చగడ్డిని గోశాల సిబ్బందికి అప్పగించారు. చందుర్తి మండల కేంద్రంలో 5 క్వింటాళ్ల కూరగాయలను అక్కడి ప్రజలకు కాంగ్రెస్ నాయకుడు ఆది శ్రీనివాస్ పంపిణి చేశారు.ఈ కార్యక్రమంలో జడ్పీటిసి సభ్యుడు నాగం కుమార్,ఎంపిటిసి సభ్యులు గణేశ్,దేవస్వామి,సర్పంచులు జలపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.