Take a fresh look at your lifestyle.

ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళన

  • వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందే
  • 4న చర్చల్లో పరిష్కారం దక్కకుంటే మరింత ఉధృతం చేస్తామన్న నేతలు

కొత్త సంవత్సరం ప్రారంభం రోజైన శుక్రవారం సైతం రైతుల ఆందోళనలు కొనసాగాయి. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళన 37వ రోజుకు చేరింది. కేంద్ర ప్రభుత్వం, రైతు ప్రతినిధుల మధ్య బుధవారంనాడు చర్చల సందర్భంగా పర్యావరణం, విద్యుత్‌ ‌చట్టంపై ఇరుపక్షాలు ఏకాభిప్రాయానికి వొచ్చినప్పటికీ, కనీస మద్దతు ధరకు లీగల్‌ ‌హా, మూడు వ్యవసాయ చట్టాలను పూర్తిగా వెనక్కి తీసుకోవాలన్న రెండు ప్రధాన డిమాండ్లపై ప్రతిష్ఠంభన కొనసాగుతుంది. ఈ నెల 4న మరో విడత చర్చలు జరుగనున్నాయి.

‘మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందే’ అని కిసాన్‌ ‌మజ్దూర్‌ ‌సంఘర్ష్ ‌కమిటీ సభ్యుడు సుఖ్వీందర్‌ ‌సింగ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. జనవరి 4న జరిగే చర్చల్లో పరిష్కారం కుదరనట్టయితే ఆందోళనలను ఉధృతం చేస్తామని చెప్పారు. తమ వద్ద మరో ఆరు నెలలకు సరిపడా తిండిగింజలు ఉన్నట్టు ఆందోళన సాగిస్తున్న మరో రైతు తెలిపాడు. పర్యావరణం, విద్యుత్‌ ‌బిల్లుల అంశం పరిష్కారం కావడంతో తాము వెనక్కి తగ్గుతామని ప్రభుత్వం భావిస్తుండవొచ్చని, ఆ ప్రసక్తే లేదని ఆయన చెప్పాడు.

Leave a Reply