Take a fresh look at your lifestyle.

ఎముకలు కొరికే చలిలోనూ.. ఢిల్లీలో కొనసాగుతున్న రైతుల ఆందోళన

లేఖలతో ప్రయోజనం లేదంటున్న రైతు సంఘాలు
నూతన సాగు చట్టాలు రద్దు చేయాల్సిందేనని డిమాండ్‌

‌వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన కొనసాగతూనే ఉంది. ఇటీవల డిల్లీలో ఉష్ణోగ్రతలు అయిదారు డిగ్రీలకు పడిపోయి ఎముకలు కొరికే చలి గాలులు వీస్తున్నా లెక్కచేయకుండా తమ డిమాండ్ల సాధనకు భీష్మించుకున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వమే తేల్చాలని ఆందోళన చేస్తున్న రైతులు స్పష్టం చేస్తున్నారు. ఇటీవల ప్రధాని ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ శిరస్సు వంచి, చేతులు జోడించి వేడుకుంటున్నా, ప్రభుత్వాన్ని అర్థం చేసుకోండని అన్నారు. దీన్ని బట్టి రైతుల ఉద్యమ ప్రభావం ప్రధానమంత్రిపై బలంగానే ఉన్నట్టు అనిపిస్తోంది. ఢిల్లీ పొలిమేరల్లో మూడు వారాలుగా ఉద్యమం చేస్తున్న రైతుల ఆందోళనపై దాఖలైన వ్యాజ్యాలను సుప్రీమ్‌ ‌కోర్టు కూడా విచారణకు స్వీకరించింది.

రైతుల ఉద్యమాన్ని సామరస్యంగా పరిష్కరించని పక్షంలో దేశవ్యాప్త ఉద్యమం అవుతుందని సర్వోన్నత న్యాయస్థానం సైతం ఆందోళన వ్యక్తంచేసింది. కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని అంతా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వంతో చర్చలు జరపాలని సుప్రీమ్‌ ‌కోర్టు కూడా రైతులకు సూచించింది. మరోవైపు వివాదస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టిన రైతులకు కేంద్ర ప్రభుత్వం పలుమార్లు లేఖలు రాసింది. అయితే ఆ లేఖలను ‘టైంపాస్‌ ‌లెటర్లు’ అని రైతులు అభిప్రాయపడ్డారు. తమతో చర్చలు చేయకుండా ఈ లేఖల కాలక్షేపం ఏంటని మండిపడ్డారు. కేంద్రం రాసిన లేఖల్లో జరిగిన చర్చల గురించి మినహా మరింకేం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు, తాము డిమాండ్‌ ‌చేస్తున్న అంశాలను ఎందుకు ప్రస్తావించడం లేదని ప్రశ్నించారు. కనీస మద్ధతు ధరపై కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వక హావి• ఇస్తామని చెప్పినప్పటికీ మూడు చట్టాల్ని పూర్తిగా ఉపసంహరించుకోవాల్సిందేనని రైతులు డిమాండ్‌ ‌చేస్తున్నారు.

Leave a Reply