Take a fresh look at your lifestyle.

కొనసాగుతున్న కొరోనా ఉధృతి

  • రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,19,966
  • తాజాగా మరో 56మంది బాధితుల మృతి

తెలంగాణ రాష్ట్రంలో కొరోనా ఉధృతి కొనసాగుతున్నది. మంగళవారం పదివేలకు పైగా నమోదైన కొరోనా కేసులు.. బుధవారం  8 వేలకు పైగా నమోదు అయ్యాయి. మంగళవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 8,061 మందికి కొరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. తాజాగా మరో 56 మంది కొరోనాకు బలయ్యారు. 5,093 మంది బాధితులు కొరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,19,966కు చేరింది. ప్రస్తుతం 72,133 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. నిన్న ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 82,270 మందికి కొరోనా పరీక్షలు నిర్వహించగా, 8 వేల మందికి పైగా కొరోనా సోకినట్లు నిర్దారణ అయింది.

కొత్తగా నమోదైన పాజిటివ్‌ ‌కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎం‌సీ పరిధిలో 1,508 కేసులు ఉన్నాయి. ఇక మేడ్చల్‌ ‌మల్కాజిగిరి జిల్లాలో 673, రంగారెడ్డిలో 514, సంగారెడ్డి జిల్లాలో 373, మహబూబ్‌నగర్‌ ‌జిల్లాలో 328 పాజిటివ్‌ ‌కేసులు నమోదు అయ్యాయి.  కొరోనా టెస్టుల కోసం పరీక్షా కేంద్రాల వద్ద కొరోనా అనుమానితులు పెద్ద సంఖ్యలో క్యూ కడుతున్నారు. తెల్లవారుజాము నుంచి టెస్టింగ్‌ ‌కోసం జనం బారులు తీరారు. గుంపులు గుంపులుగా జనం మోహరించడంతో పాటు సోషల్‌ ‌డిస్టెన్స్ అనేదే కనిపించడం లేదు. ఒక్కో టెస్టింగ్‌ ‌కేంద్రంలో 50 మందికి మాత్రమే పరీక్షలు చేయడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూకట్‌పల్లిలోని ఎల్లమ్మ బండ పీహెచ్‌సీలో ఒకే చోట టెస్టింగ్‌ ‌వాక్సినేషన్‌ ‌చేయడంతో గందరగోళం నెలకొంది.

Leave a Reply