Take a fresh look at your lifestyle.

దేశంలో కొనసాగుతున్న కొరోనా ఉధృతి

  • కొత్తగా 44,230 పాజిటివ్‌ ‌కేసులు నమోదు
  • మరో 555 మంది మరణించినట్లు వెల్లడించిన ఆరోగ్యశాఖ
  • కర్నాటకలోనూ పెరుగుతున్న కేసుల సంఖ్య

దేశంలో కొరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 44,230 పాజిటివ్‌ ‌కేసులు నమోదు కాగా, 555 మంది మరణించారు. మహమ్మారి నుంచి 42,360 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దేశంలో ఇప్పటి వరకు 3,15,72,344 పాజిటివ్‌ ‌కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం 4,05,155 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకు వైరస్‌ ‌నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,07,43,972. మరణాల సంఖ్య 4,23,217కు చేరింది. ఇక 45.60 కోట్ల మందికి పైగా కోవిడ్‌ ‌టీకాలు పంపిణీ చేశారు. కేరళ తరవాత ఇప్పుడు కర్ణాటకలో మరోసారి కొరోనా కేసులు పెరుగుతున్నాయి. గురువారం రాష్ట్రంలో 2,052 కేసులు నమోదు అయ్యాయి. బుధవారం నాటి సంఖ్యతో పోల్చుకుంటే 34 శాతం అదనం. రాజధాని నగరం బెంగళూరులో కూడా మహమ్మారి విజృంభిస్తుంది.

ఇక్కడ కూడా క్రితం రోజు (బుధవారం 376)తో పోల్చుకుంటే 34 శాతం అదనంగా ..గురువారం 505 కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన బులెటిన్‌ ‌ప్రకారం…రాష్ట్రంలో ప్రస్తుతం 23,253 యాక్టివ్‌ ‌కేసులున్నాయి. గురువారం నాటికి పాజిటివిటీ రేటు 1.37 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో 35 మంది మరణించారు. దీంతో కర్ణాకటలో ఇప్పటి వరకు కొరోనా బారిన పడి వారి సంఖ్య 29 లక్షలను దాటగా… ఈ మహమ్మారి ధాటికి 36,491 మంది బలయ్యారు. గురువారం మధ్యాహ్నం వరకు 1,00,224 టీకా డోసులు పంపిణీ అయ్యాయి. మొత్తంగా 2,97,01,302 వ్యాక్సిన్లు వినియోగించారు. కర్ణాటకలో ఇటీవల ఆంక్షలు సడలించారు. జులై 19 నుండి సినిమా ధియేటర్లు కూడా తెరిచారు. నైట్‌ ‌కర్ఫ్యూ సమయాన్ని కూడా కుదించారు. జులై 26 నుండి ఆన్‌లైన్‌ ‌తరగతులకు అనుమతినిచ్చారు.

Leave a Reply