తాజాగా 66,732 మందికి పాజిటివ్…816 మంది మృత్యువాత
న్యూఢిల్లీ, అక్టోబర్ 12 : దేశంలో కొరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. కొద్దిరోజులుగా రోజుకు 50వేలకుపైగా పాజిటివ్ కేసులు నిర్దారణ అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 66,732 పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం పేర్కొంది.
మహమ్మారి కారణంగా కొత్తగా 816 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో మొత్తం కొరోనా కేసుల సంఖ్య 71,20,539కి చేరింది. ఇందులో 8,61,853 ఆక్టివ్ కేసులున్నాయి. 61,49,536 మంది బాధితులు ఇప్పటి వరకు కోలుకున్నారు. వైరస్ కారణంగా 1,09,150 మరణించారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరించింది.