Take a fresh look at your lifestyle.

సిరిసిల్లో రోజుకు వెయ్యి కొరోనా పరీక్షలు

అవసరమైతే ఐసోలేషన్‌ ‌కేంద్రాలుగా డబుల్‌ ఇళ్లు

జిల్లా హాస్పిటల్‌లో కోవిడ్‌ ఐసీయూ, 40 పడకల ఆక్సిజన్‌ ‌వార్డును ప్రారంభించిన మంత్రి  కెటిఆర్‌ ‌సిరిసిల్ల జిల్లాలోనే రోజుకు వెయ్యి కొరోనా పరీక్షలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ ‌శాఖ మంత్రి కేటీఆర్‌ ‌చెప్పారు. వైరస్‌ ‌బాధితులందరికీ •ం ఐసోలేషన్‌ ‌కిట్లు అందిస్తామన్నారు. బాధితుల సంఖ్య పెరిగితే డబుల్‌ ‌బెడ్‌ ‌రూం ఇండ్లను కూడా ఐసోలేషన్‌ ‌కేంద్రాలుగా వాడుకోవాలని మంత్రి కేటీఆర్‌ ‌సూచించారు. సోమవారం సిరిసిల్ల జిల్లాలో మంత్రి కెటిఆర్‌ ‌పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా.. జిల్లా హాస్పిటల్‌లో కోవిడ్‌ ఐసీయూ, 40 పడకల ఆక్సిజన్‌ ‌వార్డుతో పాటు అంబులెన్స్‌లను కేటీఆర్‌ ‌ప్రారంభించారు. పంచాయతీరాజ్‌ ఈఈ, ‌డీఈఈ కార్యాలయ భవనాలకు మంత్రి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్‌ ‌మాట్లాడుతూ జిల్లా హాస్పిటల్‌కు సీఎస్‌ఆర్‌ ‌పథకం కింద రూ. 2.28 కోట్ల నిధులు ఇస్తున్నామని తెలిపారు. సిరిసిల్ల జిల్లాలోనే రోజుకు వెయ్యి కొరోనా పరీక్షలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. వైరస్‌ ‌బాధితులందరికీ •ం ఐసోలేషన్‌ ‌కిట్లు అందిస్తామన్నారు. బాధితుల సంఖ్య పెరిగితే డబుల్‌ ‌బెడ్‌ ‌రూం ఇండ్లను కూడా ఐసోలేషన్‌ ‌కేంద్రాలుగా వాడుకోవాలన్నారు. అవసరమైతే అదనపు సిబ్బందిని కూడా తీసుకుంటామని స్పష్టం చేశారు. కొరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వైరస్‌తో సహజీవనం తప్పదన్నారు. మాస్కులు ధరించి ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో 99 శాతం మంది రికవరీ అవుతున్నారని, వందకు వంద శాతం బాగుపడాలని కోరుకుంటున్నామని, ప్రభుత్వ పరంగా చేయాల్సిన కార్యక్రమాలన్నింటినీ చేస్తున్నామని మంత్రి కేటీఆర్‌ ‌పేర్కొన్నారు.

Leave a Reply