Take a fresh look at your lifestyle.

ఒక్క ఫోన్‌ ..ఎం‌త పని చేస్తున్నది..!!

కరోనా, లాక్‌ ‌డౌన్‌ ‌కారణంగా పేదల బాధలు చూసి చలించిపోయిన వాళ్ళు ఎందరో..వాళ్ళను ఆదుకోవడానికి మనసు ఉన్నా, బయటకు వెళ్ళలేని పరిస్థితి. పోలీస్‌ ‌పర్మిషన్‌ ‌తీసుకుని వెళ్ళాలన్నా కొద్ది దూరమే. అప్పుడే సామాజిక సంస్థలు, కార్యకర్తలు, స్వచ్ఛంద• సంస్థలు కొత్త మార్గాన్ని ఆలోచించాయి. ఇంట్లో ఉండే ఏం చేయాలో ప్రణాళిక రూపొందింది. అలా హెల్ప్ ‌లైన్‌ ‌మొదలైంది. ఒక ఫోన్‌ ‌నంబర్‌ ‌ప్రకటించారు. ఒక 10 మంది వస్తున్న ఫోన్స్ అం‌దుకుని కేసులను రిజిస్టర్‌ ‌చేస్తున్నారు. షిఫ్టులలో ఇంటి దగ్గర నుండి పని చేస్తూ బాధితుల కోసం ఎప్పుడూ ఫోన్‌ అం‌దుబాటులో ఉంచుతున్నారు. మరి కొంత మంది వచ్చిన ఫోన్‌ ‌కాల్స్‌ను విశ్లేషించి జిల్లాల వారీగా వేరు చేస్తున్నారు. వీళ్ళు కూడా ఇళ్ళ నుండే షిఫ్టుల్లో పని చేస్తూ పని ఆగకుండా చూస్తున్నారు. అసలు సమస్య హెల్ప్ ‌లైన్‌కు ఫోన్‌ ‌చేసిన వారికి సహాయం అందించడం. దీని కోసం తెలంగాణలో అన్ని ఉమ్మడి జిల్లాల వారీగా సామాజిక కార్యకర్తలు వాట్స్ అప్‌ ‌గ్రూప్‌లుగా ఏర్పడ్డారు. అలా 10 గ్రూప్స్ ఏర్పడ్డాయి. అనేక మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, వివిధ ప్రజా సంఘాల కార్యకర్తలు, స్వచ్ఛంద• సంస్థల సిబ్బంది, రిపోర్టర్లు, ప్రొఫెసర్లు, డాక్టర్లు, సాఫ్ట్‌వేర్‌ ఇం‌జనీర్లు, ఈ పని చేయడానికి ముందుకు వచ్చారు. అందరూ ఇళ్ళ నుండే పని చేస్తున్నారు. అవసరమైనప్పుడు అధికారులకు ఫోన్‌ ‌చేస్తున్నారు. ఆకలి గొన్న వారికి తక్షణ ఆహారం అందిస్తున్నారు. తెలంగాణలో ఉండేవాళ్లు మాత్రమే కాదు, అమెరికాలో, ఇతర దేశాలలో ఉండి కూడా అనేక మంది వాలంటీర్లు హెల్ప్ ‌లైన్‌తో కలసి పని చేస్తున్నారు.

మరో టీం రాష్ట్ర స్థాయిలో జిల్లాల నుండి వచ్చే సమస్యలను అర్థం చేసుకుంటూ, అన్ని ముఖ్యమైన రాష్ట్ర స్థాయి సమస్యలపై ప్రభుత్వానికి విజ్ఞాపన పత్రాలు రూపొందించి పంపిస్తున్నారు. రాష్ట్ర అధికారులతో మాట్లాడుతున్నారు. 72 గంటల్లో 350 పైగా రాష్ట్రంలో వివిధ జిల్లాల నుండి బాధితులు హెల్ప్ ‌లైన్‌కు ఫోన్‌ ‌చేశారు. ఇదొక అనుభవం. ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండి, ఒక్క మాటగా, హెల్ప్ ‌లైన్‌ ‌వేదికగా ఉమ్మడిగా పనిచేయడం. సామాజిక, రాజకీయ ఉద్యమాలతో సంబంధం ఉన్న వాళ్ళు, ప్రజల పట్ల బాధ్యత, పని చేయాలనే ఆసక్తి ఉంటే మార్గాలు కనుక్కుంటూ ముందుకు వెళతారు. ఈ పనిలో భాగం పంచుకుంటున్న వాళ్ళు అందరూ ఒకే రాజకీయ అభిప్రాయం ఉన్న వాళ్ళు కాదు. కానీ ప్రజల పట్ల ప్రేమ ఉన్న వాళ్ళు. ఈ పనిలో 18సంవత్సరాల యువకుల నుండీ 70 ఏళ్ల వయసు వారి వరకూ ఉన్నారు. ఈ టీం మొత్తంలో ఉత్సాహపూరితంగా అన్ని పనులలో భాగం పంచుకుంటూ ముందుకు నడుస్తున్న వాళ్ళు, నడిపిస్తున్న వాళ్ళు మహిళలు, ట్రాన్స్ ‌జెండర్‌లు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు మహిళలను, ట్రాన్స్ ‌జెండర్‌లను ఎందుకు తమ నిర్మాణాలలో భాగస్వాములను చేయాలో ఈ హెల్ప్ ‌లైన్‌ ‌పని మరో సారి రుజువు చేస్తున్నది.

రైతు స్వరాజ్య వేదిక, మహిళా రైతుల హక్కుల వేదిక, మానవ హక్కుల వేదిక, ఎన్‌ఏపిఎమ్‌, ‌కేరింగ్‌ ‌సిటిజన్స్ ‌కలెక్టివ్‌, ఎం‌వి ఫౌండేషన్‌, ‌తెలంగాణ విద్యా వంతుల వేదిక, పాలమూరు అధ్యయన వేదిక, దళిత బహుజన ఫ్రంట్‌, ‌భూమిక హెల్ప్ ‌లైన్‌, ‌తెలంగాణ ప్రోగ్రెసివ్‌ ‌టీచర్స్ ‌ఫెడరేషన్‌, ‌టిజెఏసి, తెలంగాణ మహిళా ట్రాన్స్ ‌జెండర్‌ ‌సంఘాల ఐక్య వేదిక, లిబరేషన్‌ ‌పార్టీ, ఐ 4 ఫార్మర్స్, ఏఐడి, సమాలోచన, ఛత్రి లాంటి అనేక ప్రజా సంస్థలు ఈ కృషిలో కీలకంగా ఉన్నాయి. క్షేత్ర స్థాయిలో అనేక స్వచ్ఛంద• సంస్థలు ఈ పనిని చాలా చురుకుగా ముందుకు తీసుకు వెళుతున్నాయి. ఆయా సంస్థల గురించి జిల్లాల వారీగా, వివరంగా మళ్లీ రాస్తాను. రాబోయే కాలంలో ప్రజల సమస్యలపై ఒక ఉమ్మడి ఉద్యమాన్ని నిర్మించడానికి ఈ హెల్ప్ ‌లైన్‌ ‌ద్వారా ఒక ప్రాతిపదిక ఏర్పడింది. ఈ హెల్ప్ ‌లైన్‌ ‌కార్యక్రమానికి నిజంగా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. సమయం కేటాయించడం తప్ప. సహాయం అందించడానికి మనం నిధులు సమకూర్చుకోవాలి..అంతే. ఈ పని అంతకు ముందే ఆంధ్ర ప్రదేశ్‌లో మొదలై కొనసాగుతున్నది. మంచి ఫలితాలు వస్తున్నాయి.

Leave a Reply