Take a fresh look at your lifestyle.

నూటాపదేళ్ళ ‘మహిళా’ సమానత్వం

  • నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం
  • మండువ రవీందర్‌ ‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి

ప్రతీఏటా క్రమంతప్పకుండా అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని జరుపుకుంటూనేఉన్నాం. నూటా పదేళ్ళుగా కొనసాగుతున్న ఈ తంతువల్ల మహిళాభ్యుదయం ఏమైనా సాధ్యమైందా అంటే కాదని పూర్తిగా కొట్టిపారేయలేకపోయినా, అవునని ఖచ్చితంగా చెప్పేపరిస్థితిలేదు. ఈ నూటా పదేళ్ళకాలంలో మహిళలకు సంబంధించి అనేక చట్టాలు రూపుదిద్దుకున్నాయి. అనేక హక్కులు సంభవించాయి. అయినా మహిళలు ఇంకా సమాజంలో నిర్లక్ష్యానికి, అవమానానికి గురవుతూనే ఉన్నారు. అందుకు చట్టాల్లో ఉన్న లొసుగులు కొంత్తైతే వాటిని అమలు పర్చే ప్రభుత్వాల ఉదాసీనత ఇంకో కారణమన్న విమర్శలు ఉన్నాయి. ఈ లెక్కన పురుషులతో సమానంగా మహిళలు ఎదగాలంటే ఎంతలేదన్నా ఇంకా శతాబ్దకాలమైనా పడుతుందంటున్నారు. ప్రపంచంలోని మహిళలందరూ అన్నిరంగాల్లో సమానత్వం సాధించాలంటే ఎనభై మూడేళ్ళు పడుతుందని 2016లో వరల్డ్ ఎకనామిక్‌ ‌ఫోరం అంచనావేసింది. ప్రస్తుతం సమాజంలో నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే అంతకు ఎక్కువ కాలమే పడుతుందన్నది నిర్వివాదాంశం. అంతెందుకు ఆకాశంలో సగం అని చెప్పుకుంటున్న వీరి సంఖ్య క్రమేణా తగ్గిపోతున్నది.

మనదేశ జనాభా నిష్పత్తిలో ప్రతీ వెయ్యి పురుషులకు 933 మంది స్త్రీలు మాత్రమే ఉన్నట్లుగా లెక్కలు చెబుతున్నాయి. కారణం భ్రూణహత్యలు. గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని తెలిస్తే గర్భస్రావం చేయించుకుంటున్నారు. అది చట్టప్రకారం నేరమని తెలిసినా బిడ్డపుట్టకుండానే చంపివేస్తున్నారు. పూర్వకాలంనుండీ నేటివరకు మగ సంతానంపైనే ఇంకా మోజు చూపిస్తున్నారు. వంశోద్ధారకుడు ఒకడు ఉండాలన్నది సెంటిమెంటు. ఈ విషయంలో భర్త, అత్తమామల వేధింపులను తట్టుకోలేక ప్రాణత్యాగంచేసేవారుకూడా లేకపోలేదు. దానికి తగినట్లుగా సరైన చికిత్సలు అందకనో, మరో కారణంగానో అధిక సంఖ్యలో ప్రసూతి మరణాలు సంభవిస్తున్నాయి. యూనిసెఫ్‌ ‌సమాచారం మేరకు ప్రపంచవ్యాప్తంగా ప్రసవ సమయంలో ప్రతీరోజూ ఎనిమిది వందలమంది చనిపోతున్నట్లు తెలుస్తున్నది.

ఇందులో భారత మహిళల సంఖ్య ఇరవై శాతముంది. వీటికితోడుగా వరకట్న వేదింపులకుగురై ఆత్యహత్యలకు పాల్పడడమో, లేదా అత్తింటివారే ఏదోవిధ•ంగా హత్యచేయడమోలాంటి కారణాలతోకూడా మహిళల సంఖ్య క్రమేణా తగ్గుతున్నది. ఇటీవల కాలంలో పరువు హత్యలపేర అనేక సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. తల్లిదండ్రులకు ఇష్టంలేకుండా ఇతర కులస్థులనో లేదా ఇతరమతస్తులనో చేసుకున్నారన్న కోపంతో తాము కన్నవారేనన్న కనికరంలేకుండా కన్నబిడ్డలను చంపుకుంటున్న ఉదంతాలనేకం వెల్లడవుతున్నాయి. మద్యానికి, మత్తు పదార్థాలకు బానిసై భార్య, పిల్లలు అన్న విచక్షణను మరిచి మగవారు కసాయివాళ్ళుగా మారుతున్న ఉదంతాలుకూడా లేకపోలేదు. మైకంలో ఏంచేస్తున్నారో తెలియకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జరిగిన ఉదంతం అందరినీ కన్నీరుపెట్టించింది. ముక్కుపచ్చలారని ముగ్గురు కూతుళ్ళను చెరువునీటిలో ముంచి హత్యచేశాడో కసాయితండ్రి. ఆర్థిక పరిస్థితి సరిగాలేకపోవడంతో ఆడపిల్లల పెళ్ళిళ్లు చేయలేమన్న భయంతో కన్నకూతుళ్ళను మట్టుబెడుతున్నారు. యాసిడ్‌ ‌కేసులు, అత్యాచారాలగురించి చెప్పేదేలేదు. ఉదయం లేవగానే వార్తా పత్రికల్లో ఇవేవార్తలు కనిపిస్తున్నాయి. ఒకటిన్నర ఏళ్ళ పసిపాప మొదలు హైస్కూలు, కళాశాల విద్యార్థినుల వరకు రేప్‌ ‌చేయచడం, హత్య చేయడం లేదా పెళ్ళిచేసుకుంటానని కలిసి కాపరంచేసి ఉడాయించిన సంఘటనలనేకం.

సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ, విద్య, వైద్యరంగాలన్నిటిలో మహిళలు ఎక్కడోదగ్గర వివక్షతకు గురవుతూనే ఉన్నారు. అటు కుటుంబంలో, ఇటు బయటి సమాజంలో ఉన్నతస్థానాన్ని పొందేందుకు పోరాడుతున్న మహిళలకు అనేక అవరోధాలు ఎదురవుతున్నాయి. అయితే సాధించింది కూడా తక్కువేమీలేదు. వివిధ ఉద్యమాలతో వారసత్వ సమాన వాటా, భ్రూణహత్య నిరోధక చట్టం, గృహ హింసా నిరోధక హక్కు, ప్రసూతి ప్రయోజనాల హక్కు, న్యాయసహాయక హక్కు, అత్యాచారానికి లేదా లైంగిక వేధింపులకు గురైనప్పుడు కేవలం ఆ విషయాన్ని మెజిస్ట్రేట్‌కే చెప్పే విధంగా గోప్యత హక్కును, ఆన్‌లైన్‌ ‌పిర్యాదుల హక్కు, సాయంత్రం ఆరునుండి ఉదయం ఆరువరకు అరెస్టు కాకుండా ఉండే హక్కు, పోలీస్‌ ‌స్టేషన్‌కు వెళ్ళకుండా ఉండేహక్కు, సమానవేతన హక్కు, పని ప్రదేశంలో వేధింపులపై చర్యలను చేపట్టే చట్టం, తమ పేరును వెల్లడించకుండా ఉండే హక్కులాంటి అనేక హక్కులను మహిళలు ఉద్యమాలద్వారా సాధించుకున్నారు.

న్యాయస్థానాలుకూడా పలు విషయాల్లో మహిళలకు అనుకూలంగా తీర్పునిచ్చాయి. వాస్తవంగా స్త్రీ,పురుష సమానత్వం రాజ్యాంగ సందేశమని అత్యుత్తమ న్యాయస్థానం వ్యాఖ్యానించిన విషయం తెలియందికాదు. ఇటీవల సుప్రీంకోర్టుకూడా సంచలనతీర్పులనిచ్చింది.ట్రిబుల్‌ ‌తలాఖ్‌ ‌విషయంలోనైతేనేమీ, శబరిమల ఆలయం, ముంబైలోని అలీ దర్గా, కొల్హాపూర్‌ ‌మహాలక్ష్మి ఆలయ గర్భగుడిలో ప్రవేశం, మహారాష్ట్రలో శనిసింగనాపూర్‌ ఆలయ ప్రవేశంలాంటి మహిళా సంఘాల పోరాటాలు సత్ఫలితాలిచ్చాయి. కేంద్రం భేటీ బచావో- భే•టీ పడావో నినాదంతో ముందుకు పోతుంటే తెలుగు రాష్ట్రాలుకూడా మరోఅడుగు ముందుకేశాయి. ఏపి ప్రభుత్వం దిశ చట్టాన్ని తీసుకువస్తే, తెలంగాణ ప్రభుత్వం మహిళలు, బాలికల రక్షణకోసం కెసిఆర్‌• ‌కిట్‌తోపాటు అమ్మాయిలు పుడితే 13వేల నగదు ప్రోత్సాహం, మహిళా రక్షణకు షీటీమ్‌ల ఏర్పాటు, నిరుపేద అమ్మాయిల పెళ్ళిళ్ళకోసం కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ ‌లాంటివాటితోపాటుగా, ఎక్కువ సంఖ్యలో బాలికలు చదువుకునేందుకు రాష్ట్రంలో రెసిడెన్షియల్‌ ‌పాఠశాలల్లో సగం బాలికలకే కేటాయించడంలాంటి చర్యలనేకం చేపడుతున్నప్పటికీ ఢిల్లీ బహత్‌ ‌దూర్‌ ‌హై అన్నట్లు పురుషులతో సమానంగా ఎదగడానికి ఇంకో శతాబ్ధకాలంపడుతుందంటున్నారు ఎకానమిస్టులు.

Leave a Reply