Take a fresh look at your lifestyle.

నాటిన మొక్కలు వందకు వంద శాతం బ్రతకాలి : కలెక్టర్‌

నాటిన మొక్కలు వందకు వంద శాతం బ్రతికి ఉండేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ ‌రాజీవ్‌ ‌గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. గురువారం 6 వ విడత కార్యక్ర మంలో భాగంగా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామ శివారులో ఏర్పాటు చేయనున్న మంకీ ఫుడ్‌ ‌కోర్టులో గ్రామంలోని పివి స్మృతి వనంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ‌మాట్లాడుతూ 6వ విడత హరితహరం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 53వేల75 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యానికి అనుగుణంగా జిల్లాలో మొక్కలు నాటేందుకు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేస్తున్నట్లు పేర్కొన్నారు. అవెన్యూ ప్లాంటేషన్‌ ‌సందర్భంగా పెద్ద మొక్కలు మాత్రమే నాటేందుకు కృషి చేయాలన్నారు. మంకీఫుడ్‌ ‌కోర్టులో వివిధ రకాల పండ్ల మొక్కలు పెద్ద ఎత్తున చేపట్టాలన్నారు. పెట్టిన మొక్కలు నీరు పొంసేందుకు జిపి ట్రాక్టర్‌ ‌ద్వారా నీరు పోస్తే జిపి కి ఆదాయం వనరులు పెరుగుతాయని చెప్పారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ ‌వైకుంఠ దామం సిగ్రియేషన్‌ ‌షెడ్ల నిర్మాణ పనులను పరిశీలించి పనులను వేగవంతం చేసి జూలైచివరి వరకు పూర్తి చేయాలన్నారు. తాత్కాలి కంగా ఏర్పాటు చేసిన పిహెచ్‌సి షేడ్స్ ‌శిథిలా వస్థల్లో ఉన్న నేపథ్యంలో ఎంత భూమి ఉందో పరిశీలన చేసి నివేదిక పంపించాలని తహశీల్దార్‌ ‌ను ఆదేశించారు. ప్రభుత్వానికి సం•ంధించిన భూమి వివరాలను కూడా పంపించాలని తహశీల్దార్‌ను ఆదేశించారు. అక్కడి నుండి పివి స్మృతి వనంలో మొక్కలు నాటారు. మొక్కలు నీరు పోయడం ఇబ్బందిగా ఉందని జడ్పీటిసి కలెక్టర్‌ను కోరగా కమలపూర్‌ ‌మండలం అంబాలలో పెద్ద ఎత్తున చేపడుతున్న మంకీ ఫుడ్‌ ‌కోర్టు, పివి స్మృతి వనంకు బోర్‌ ‌మంజూరుకు ప్రతి పాదనలు పంపించాలని కలెక్టర్‌ ‌డిఆర్‌డివోను ఆదేశించారు. అక్కడే ఉన్న బాలికల రెసిడెన్షియల్‌ ‌పాఠశాలలో గత సంవత్సరం నాటిన మొక్కలను పరిశీలించారు. ఈ సందర్భంగా మొదటిసారి వంగరకు వచ్చిన సందర్భంగా స్థానిక ప్రజా ప్రతినిధులు కలెక్టర్‌ను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీవో శ్రీనివాస్‌ ‌కుమార్‌, ‌జడ్పీటిసి, ఎంపిపి, సర్పంచ్‌, ఎం‌పీడీఓ తహశీల్దార్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply