Take a fresh look at your lifestyle.

హిమాచల్‌ ‌ప్రదేశ్‌లో అర్హులందరికీ ఒక డోసు కొరోనా టీకా

  • దేశంలోనే మొదటి రాష్ట్రం
  • గ్రామీణ సమాజంతోనే సాధికారిత అన్న దానికి నిదర్శనం హిమాచల్‌
  • ‌రాష్ట్ర ఆరోగ్య సంరక్షణ రంగ శ్రామికులతో, లబ్ధిదారులతో మాట్లాడిన ప్రధాన మంత్రి

100 ‌సంవత్సరాలలో తలెత్తే అతి పెద్దదైన అంటువ్యాధికి వ్యతిరేకంగా హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ఒక విజేతగా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశంలో అర్హులైన అందరికీ కొరోనా టీకా కనీసం ఒక డోసును వేసిన మొదటి రాష్ట్రంగా హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ‌ప్రసిద్ధికెక్కిందని ఆయన అన్నారు. ఈ సఫలత ఆత్మవిశ్వాసం మరియు ఆత్మనిర్భరతల మహత్వాన్ని స్పష్టం చేసిందని అన్నారు. హిమాచల్‌ ‌ప్రదేశ్‌లో ఆరోగ్య సంరక్షణ రంగ శ్రామికులతోను, కోవిడ్‌ ‌టీకాకరణ కార్యక్రమం లబ్ధిదారులతోను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా మాట్లాడుతూ.. టీకా మందు వృథాను కనీస స్థాయికి కుదించిన జట్టు సభ్యులకు ప్రశంసలు అందజేశారు. ఒక కష్టమైన రంగంలో సేవలను అందించడంలో వారి అనుభవం ఎలా ఉన్నదీ ఆయన చర్చించారు. టీకాకరణ సంబంధిత సదుపాయాలు ఎలా ఉన్నాయని, టీకాకరణకు సంబంధించిన వదంతులను ఏ విధంగా సంబాళించారంటూ వాకబు చేశారు. హిమాచల్‌ ‌బృందం జట్టు ప్రయాసలను ప్రధాన మంత్రి మెచ్చుకొన్నారు. టీకాలను ఇవ్వడం కోసం ఎంతో దూరంలో ఉన్న ప్రాంతానికి ఎలాగ ప్రయాణించిందీ ఆయన తెలుసుకున్నారు. వయో వృద్ధులకు ఎదురైన అనుభవాన్ని గురించి హమీర్‌ ‌పుర్‌ ‌కు చెందిన నిర్మల దేవితో ప్రధాన మంత్రి చర్చించారు.

టీకాకరణ కార్యక్రమం శర వేగంగా పురోగమించడంలో సహకరించే విధంగా లాహౌల్‌- ‌స్పీతిని తీర్చి దిద్దడంలో తోడ్పడినందుకు గాను బౌద్ధ నాయకులకు ప్రధాన మంత్రి ధన్యవాదాలు తెలిపారు. భారతదేశంలో టీకాల ను ఇప్పించే కార్యక్రమం సఫలత దేశం పౌరుల కఠోర శ్రమ, వారి లోని స్ఫూర్తిల ఫలితమని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశం ప్రతి ఒక్క రోజు 1.25 కోట్ల టీకా మందును ఇస్తూ రికార్డ్ ‌స్థాయిలో టీకాకరణ చేస్తున్నది. భారతదేశంలో ఒక రోజుకు ఇస్తున్న టీకాల సంఖ్య అనేక దేశాల జనాభా కంటే ఎక్కువగా ఉందని, టీకాకరణ ఉద్యమంలో వైద్యులు, ఎఎస్‌హెచ్‌ఎ ‌శ్రామికులు, ఆంగన్‌ ‌వాడీ శ్రామికులు, చికిత్స సిబ్బంది, ఉపాధ్యాయులు, మహిళలు అందిస్తున్న తోడ్పాటుకు వారిని ప్రధాన మంత్రి ప్రశంసించారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడు తాను ‘సబ్‌ ‌కా ప్రయాస్‌’ ‌ను గురించి మాట్లాడిన సంగతిని ప్రధాన మంత్రి గుర్తుచేసుకుంటూ, ఈ సఫలత ‘సబ్‌ ‌కా ప్రయాస్‌’ ‌ను ఆచరణాత్మకంగా మార్చిందని అన్నారు. హిమాచల్‌ ‌దేవతల భూమి అనే వాస్తవాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తూ, ఈ విషయంలో సంభాషించడం, సహకరించుకోవడం అనే నమూనాను మెచ్చుకొన్నారు. లాహౌల్‌-‌స్పీతి వంటి ఒక దుర్గమ జిల్లాలో సైతం 100 శాతం ఒకటో డోసును ఇవ్వడంలో హిమాచల్‌ అ‌గ్రస్థానంలో ఉందని ప్రధాన మంత్రి పేర్కొంటూ హర్షాన్ని వ్యక్తం చేశారు.

అటల్‌ ‌సొరంగాన్ని నిర్మించడానికి పూర్వం ఈ ప్రాంతాని కి దేశం లోని మిగిలిన ప్రాంతాల తో సంబంధాలు నెలల తరబడి తెగిపోయాయయి అని ఆయన చెప్పారు. టీకాకరణ ప్రయాసల కు ఏ వదంతి, ఏ దుష్ప్రచారం అడ్డుపడకుండా చూసినందుకు గాను హిమాచల్‌ ‌ప్రజల ను ప్రధాన మంత్రి పొగడారు. ప్రపంచంలో అతి పెద్దది, అమిత వేగంగా సాగుతున్న టీకాకరణ ఉద్యమానికి దేశం లోని గ్రామీణ సమాజం ఏ విధం గా సాధికారితను కల్పిస్తున్నదో హిమాచల్‌ ‌రుజువు చేస్తోందని ప్రధాని అన్నారు. అలాగే, సంధానాన్ని బలపరడం వల్ల పర్యటన రంగం కూడా దాని తాలూకు ప్రత్యక్ష ప్రయోజనాన్ని అందుకొంటోందని ప్రధాన మంత్రి అన్నారు. కాయగూరలను, పండ్లను పండిస్తున్న రైతులు, తోటల పెంపకందారులు కూడా దీని లబ్ధిని పొందుతున్నారని ఆయన వివరించారు. పల్లెలలో ఇంటర్‌ ‌నెట్‌ ‌సదుపాయాన్ని ఉపయోగించుకోవడం ద్వారా హిమాచల్‌ ‌లోని యువ ప్రతిభావంతులు వారి సంస్కృతిని, పర్యటన రంగం తాలూకు కొత్త కొత్త అవకాశాలను దేశ, విదేశాలకు పరిచయం చేయగలుగుతారని ఆయన చెప్పారు. ‘ఆజాదీ కా అమృత్‌ ‌మహోత్సవ్‌’ ‌సందర్భంలో రాబోయే 25 సంవత్సరాల కాలంలో హిమాచల్‌లో సేంద్రియ వ్యవసాయాన్ని అవలంబించవలసిందంటూ రైతులకు, తోటల పెంపకందారులకు ప్రధాన మంత్రి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశార్ణు మన నేలకు రసాయన పదార్థాల బారి నుంచి మెల్ల మెల్లగా మనం విముక్తిని ప్రసాదించాలని ప్రధాని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌, ‌ముఖ్యమంత్రి, జెపి నడ్డా, కేంద్ర మంత్రి అనురాగ్‌ ‌సింహ్‌ ‌ఠాకుర్‌ , ‌పార్లమెంట్‌ ‌సభ్యులు, ఎమ్‌ఎల్‌ఎలు, పంచాయతీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply