Take a fresh look at your lifestyle.

అమెరికాలో ఒకేరోజు రికార్డు స్థాయిలో కొరోనా కేసులు

న్యూయార్క్,‌నవంబర్‌12: అమెరికాను కొరోనా మహమ్మారి వణికిస్తూనే ఉంది. జాన్స్ ‌హాప్కిన్స్ ‌లెక్కల ప్రకారం బుధవారం ఒక్కరోజే అమెరికా వ్యాప్తంగా 1,36,325 కొరోనా కేసులు నమోదయ్యాయి. కొరోనా మహమ్మారి దేశంలోకి ప్రవేశించిన నాటి నుంచి ఒకేరోజు ఇన్ని కేసులు నమోదుకావడం ఇదే మొదటిసారి అని తెలుస్తోంది. కొత్తగా నమోదైన కేసులతో అమెరికాలో మొత్తం కేసుల సంఖ్య 1,07,08,728కు చేరుకుంది. మరోపక్క అమెరికాలో కొరోనా బారిన పడి ఇప్పటివరకు 2,47,398 మంది మత్యువాతపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కొరోనా కేసులు, మరణాలు అమెరికాలోనే నమోదైన విషయం తెలిసిందే. శీతాకాలం సమీపించడంతో అమెరికాలో కొరోనా మూడో వేవ్‌ ‌మొదలైంది.దేశంలో పరిస్థితి ఈ విధంగా ఉన్నప్పటికి అధ్యక్షుడు ట్రంప్‌ కొరోనాకు సంబంధించి ఒక్క అధికారిక ప్రకటన కూడా చేయడం లేదు.

నవంబర్‌ మూడో తేదీన జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటమి చెందడంతో.. అప్పటి నుంచి ఆయన అధికారికంగా ఒక్క కార్యక్రమంలో కూడా పాలుపంచుకోలేదు. బుధవారం వెటరన్స్ ‌డే సందర్భంగా ఆయన మొదటిసారి వైట్‌ ‌హౌస్‌ ‌నుంచి బయటకు వచ్చి అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే.. అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ ఇప్పటికే కొవిడ్‌19 టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ టాస్క్‌ఫోర్స్ ‌కొరోనాను ఏ విధంగా నియంత్రించాలన్న దానిపై పనిచేస్తుంది. గతంలో ఎబోలా వంటి వైరస్‌ల నుంచి దేశాన్ని కాపాడిన అనేక మంది నిపుణులు ఈ టాస్క్‌ఫోర్స్‌లో భాగమయ్యారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply