Take a fresh look at your lifestyle.

కార్మిక వ్యతిరేక విధానాలపై నిరసన సెగ

మందమర్రి, మే 22, ప్రజాతంత్ర విలేఖరి : కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాక్‌లను ప్రైవట్‌ ‌పరం చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పని గంటలను పెంచాలని కుట్రలను నిరసిస్తూ కార్మిక సంఘాల సెగ మొదలైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా 4 జాతీయ సంఘాలు ఇచ్ని పిలుపు మేరకు ఎఐటియుసి, ఐఎన్‌టియుసి, సిఐటియు, హెచ్‌ఎంఎస్‌, ఐఎఫ్‌టియు సంఘాల ఆధ్వర్యంలో గురువారం మందమర్రి జీఎం కార్యాలయం ముస్త్రందు ఎఐటియుసి, సిఐటియు, ధర్నా చేపట్టాయి. అదే విధంగా ఐఎన్‌టియుసి కార్యాలయం ముందు ఐఎన్‌టియుసి నాయకులు హెచ్‌ఎంఎస్‌ ‌కార్యాయం ముందు భౌతిక దూరాన్ని పాటిస్తూ ఒక్క రోజు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా జాతీ య సంఘాలనాయకులు ఐఎన్‌టియుసి సెక్రటరీ జనరల్‌ ‌జనక్‌ ‌ప్రసాద్‌, ఎఐటియుసి శ్రీనివాస్‌లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కరోనా జనతా కర్ఫూ, లాక్‌డౌన్‌ ‌సమయాన్ని ఆసరగా చేసుకొని కార్మిక సంఘాల్లో మార్పు తేవాలనే దురుద్దేశంతో కార్మిక వ్యతిరేక విధానాలను పాల్పడుతోందని కార్మికుల నిశబ్దాన్ని ఆసరగా చేసుకోన వెక్కిలి చేష్టలకు పాల్పడుతున్నారని వారు మండిపడ్డారు. గతంలో కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులు రద్దు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనులను ప్రైవేటీ కరణ చేయాలని చూస్తున్నారని అన్నారు.

కేంద్రమంత్రి నిస్సిగ్గుగా బొగ్గు గనులను ప్రైవేట్‌ ‌వాళ్లకు ఇస్తామని, 50 వేల కొట్ల రూపాయాలు ప్రభుత్వ ధనాన్ని అప్పుగా ఇస్తామని చెప్పడం సిగ్గుచేటని వారు నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రైవేటీకరణ వ్యవస్థకు ప్రభుత్వానికి నిరసనగా భారతదేశ వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలతో కలిసి పోరాటం చేస్తున్నామని అవసరమైతే కార్మికుల పక్షాన నిలబడి వారి హక్కులకై ప్రాణత్యాగానికైనా వెనుకాడబోనని వారు హెచ్చరించారు. కార్మిక హక్కులకు రాజీ పడేది లేదని కేంద్ర ప్రభుత్వానికి సవాల్‌ ‌విసిరారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరణను ఉపసంహరించుకోని కార్మికుల హక్కులను కాపాడాలని, లెనియెడల రాబోవు రోజుల్లో జాతీయ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దీక్షలు చేపడుతామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సందర్భంగా మందమర్రి ఏరియా డివైజీఎం వెంకటేశ్వర్లు కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఐఎన్‌టియుసి ఏరియా ఉపాధ్యక్షుడు దేవి భూమయ్య, ఐఎన్‌టియుసి కేంద్ర కమిటి ఉపాధ్యక్షులు సిద్ధంశెట్టి రాజమౌళి, డిప్యూటి జనరల్‌ ‌సెక్రెటరీ పుల్లూరి లక్ష్మణ్‌, ‌నాయకులు జీడి బాపు, సకినాల శంకర్‌, ఎం.‌డి.సర్వర్‌, ఎఐటియుసి నాయకులు శైలేంద్ర సత్యనారాయణ, భీమానాథుల సుదర్శన్‌, అక్బర్‌ అలీ, ఇప్పకాయల లింగయ్య, సిఐటియు నాయకులు రామగిరి రామ స్వామి, రాజేందర్‌, ఐఎఫ్‌టియు నాయకులు రాయమల్లు, జాఫర్‌, ‌కుమార్‌, ‌మహేశ్వరి కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy