Take a fresh look at your lifestyle.

కోటి కోవిడ్‌ ‌టీకాల మైలురాయి దాటిన భారత్‌

  • ‌గత 24 గంటలలో ఒక్క కోవిడ్‌ ‌మరణమూ
    నమోదు కాని 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు

పీ ఐ బీ ,హైదరాబాద్‌,‌ఫిబ్రవరి 19: కోవిడ్‌ ‌మీద పోరులో భారత్‌ ‌మరో కీలకమైన మైలురాయి దాటింది. 2021 ఫిబ్రవరి 19వతేదీ ఉదయం 8 గంటలకల్లా దేశవ్యాప్తంగా అందించిన కోవిడ్‌ ‌డోసులు కోటి దాటాయి. టీకాలు అందుకున్నవారిలో ఆరోగ్య సిబ్బందితో బాటు కోవిడ్‌ ‌యోధులున్నారు. కోటి టీకాల మైలురాయి దాటటానికి భారత్‌ ‌కు 34 రోజులు పట్టింది. ఈ వేగంలో భారత్‌ ‌కు ప్రపంచంలో రెండో స్థానం దక్కినట్లయిందని ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ ‌బ్యూరో ( పీ ఐ బీ ),హైదరాబాద్‌ ‌శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

మొత్తం2,11,462 శిబిరాల ద్వారా 1,01,88,007 టీకాల డోసుల పంపిణీ జరిగినట్టు ఉదయం 8 గంటలవరకు అందిన సమాచారం నిర్థారించింది. వీరిలో 62,60,242 మంది మొదటి డోస్‌ అం‌దుకున్న ఆరోగ్య సిబ్బంది, 6,10,899 మంది రెండో డోస్‌ అం‌దుకున్న ఆరోగ్య సిబ్బంది ఉండగా 33,16,866 మంది మొదటి డోస్‌ అం‌దుకున్న కోవిడ్‌ ‌యోధులు. రెండవ డోస్‌ ఈ ‌నెల 13 న ప్రారంభం కాగా మొదటి డోస్‌ ‌వేయిమ్చుకొని 28 రోజులు పూర్తయిన వారందరూ దీనికి అర్హులు. కోవిడ్‌ ‌యోధులకోసం మొదటి డోస్‌ ‌ఫిబ్రవరి 2న మొదలైందని ప్రకటనలో తెలిపింది. ఇతర వివరాలు…టీకాల కార్యక్రమం మొదలైన 34వ రోజైన ఫిబ్రవరి 18న మొత్తం 6,58,674 టీకా డోసులు ఇచ్చారు. అందులో 4,16,942 మంది లబ్ధిదారులకు 10,812 శిబిరాల ద్వారా మొదటి డోస్‌ ఇవ్వగా వారిలో ఆరోగ్య సిబ్బంది, కోవిడ్‌ ‌యోధులు కూడా ఉన్నారు. 2,41,732మంది ఆరోహ్య సిబ్బంది రెండవ డోస్‌ ‌టీకా అందుకున్నారు.

రోజురోజుకూ దేశంలో కోవిడ్‌ ‌టీకాలు తీసుకుంటున్నవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. మొత్తం టీకాలు తీసుకున్న వారిలో 57.47% వాటా ఎనిమిది రాష్ట్రాలదే. ఉత్తరప్రదేశ్‌ ‌లో అత్యధికంగా 10.5% వాటాతో 10,70,895 టీకా డోసులు పంపిణీ అయ్యాయి .రెండవ డోస్‌ ‌టీకాలలో 60.85% 7 రాష్ట్రాలలో ఇవ్వగా 12% వాటాతో ( 73,281 మంది లబ్ధిదారులతో) అన్ని రాష్ట్రాలకంటే తెలంగాణ ముందంజలో ఉంది.

గత 24 గంటలలో 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఒక్క కోవిడ్‌ ‌మరణం కూడా నమోదు కాలేదు.అవి: గుజరాత్‌, ‌హిమాచల్‌ ‌ప్రదేశ్‌, ‌గోవా, జార?ండ్‌, ‌మేఘాలయ, పుదుచ్చేరి, చండీగఢ్‌, ‌మణిపూర్‌, ‌మిజోరం, లక్షదీవులు, సిక్కిం, అరుణాచల్‌ ‌ప్రదేశ్‌, ‌లద్దాఖ్‌, ‌త్రిపుర, అండమాన్‌, ‌నికోబార్‌ ‌దీవులు, డామన్‌-‌డయ్యూ, దాద్రా-నాగర్‌ ‌హవేలి. 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 1-5 మధ్య మరణాలు నమోదు కాగా, మూడు రాష్ట్రాలలో 6-10 మధ్య మరణాలు సంభవించాయి.భారతదేశంలో చికిత్సలో ఉన్న కోవిడ్‌ ‌బాధితుల సంఖ్య మరింతగా తగ్గుతూ ప్రస్తుతం 1,39,542 కి చేరింది. ఇది మొత్తం పాజిటివ్‌ ‌కేసులలో 1.27% మాత్రమే. ఇప్పటివరకు దేశమంతటా కోలుకున్న కోవిడ్‌ ‌బాధితులు 1,06,67,741 మంది కాగా కోలుకున్నవారి శాతం 97.30%. గత 24 గంటలలో 10,896 మంది కోలుకున్నారు. కొత్తగా కోలుకున్నవారిలో 83.15% మంది ఆరు రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు.

కేరళలో అత్యధికంగా ఒక్క రోజులోనే 5,193 మంది కోలుకోగా మహారాష్ట్రలో 2,543 మంది, తమిళనాడులో 470 మంది కోలుకున్నారు.గత 24 గంటలలో కొత్తగా 13,193 కోవిడ్‌ ‌పాజిటివ్‌ ‌కే సులు నమొదయ్యాయి. వాటిలో 86.6% కేవలం ఆరు రాష్టాలవే కాగా మహారాష్ట్రలో అత్యధికంగా 5,427 కేసులు, కేరళలో 4,584,తమిళనాడులో 457 నమోదయ్యాయి.గత 24 గంటలలో 97 కోవిడ్‌ ‌మరణాలు నమోదయ్యాయి. అందు లో 76.29% మరణాలు ఐదు రాష్ట్రాల్లోనే సంభవించాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 38 మంది, ఆ తరువాత కేరళలో 14 మంది, పంజాబ్‌ ‌లో 10 మంది చనిపోయారు.

Leave a Reply