Take a fresh look at your lifestyle.

ఒక తరగతి – ఒక ఛానల్

‘వ్యాక్సిన్ తయారీలో ఆలస్యం ,ప్రస్తుత దుస్థితి దీర్ఘకాలం కొనసాగుతుందన్న అంచనాలతో విద్యారంగం సరికొత్త వ్యూహాలకు సాన పట్టాల్సిన తరుణమిది .ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో విద్యారంగం ముందున్న ఏకైక ప్రత్యామ్నాయం డిజిటల్ విద్య మరియు ఆన్ లైన్ బోధన. .’

సంక్షోభాలు వచ్చినా, విపత్తులు వచ్చినా అవి చేసే కీడులు అనంతం ,అదే సందర్భంలో వాటి దరిమిలా సంభవించే సానుకూల పరిణామాలు అపారంగా ఉంటాయి. కొవిడ్ -19 పూర్తిగా తగ్గిపోతుందా ,పెరుగుతుందా అనేది కాలమే చెబుతుంది. ఇది కాలాన్ని కరొనాకు ముందు, కరొనా తర్వాత అన్నట్లు విభజిస్తూ మానవాళికి కొన్ని పాఠాలు నేర్పింది .కానీ ఇది ఇప్పటికే బాగా వ్యాపించి నందున దానితో మనం సహజీవనం చేయక తప్పదు.కొవిడ్- 19 అనంతర పరిణామాలు విద్యా వ్యవస్థ పై తీవ్ర ప్రభావము చూపుతున్నాయి. విశ్వవ్యాప్తంగా ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు దాదాపు 150 కోట్ల మంది విద్యార్థుల చదువులు ప్రభావితమయ్యాయి. ఈ పరిస్థితి మొత్తం విద్యావ్యవస్థలో సమూల మార్పులకు దోహదం కానుంది తాజాగా ఫ్రాన్స్ లో లాక్ డౌన్ అనంతరం పునః ప్రారంభమైన పాఠశాలలు ,కళాశాలలో కరొనా పాజిటివ్ కేసులు అధిక సంఖ్యలో నమోదు కావడం ఆందోళన కలిగించే అంశంగా ఉంది .కరొనా కేసుల సంఖ్య క్రమేణా పెరుగుతుండడం ,వ్యాధి సోకిన ఎలాంటి లక్షణాలు బయటపడకుండా యువకులు తిరిగేస్తూ ఉండటం విద్యారంగానికి ప్రధాన అవరోధం .దీనివల్ల విద్యా సంవత్సరం ప్రారంభం మరియు నిర్వహణ గురించి సందేహాలు మొదలయ్యాయి .వ్యాక్సిన్ తయారీలో ఆలస్యం ,ప్రస్తుత దుస్థితి దీర్ఘకాలం కొనసాగుతుందన్న అంచనాలతో విద్యారంగం సరికొత్త వ్యూహాలకు సాన పట్టాల్సిన తరుణమిది .ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో విద్యారంగం ముందున్న ఏకైక ప్రత్యామ్నాయం డిజిటల్ విద్య మరియు ఆన్ లైన్ బోధన.

అభివృద్ధి చెందిన దేశాల్లో దాదాపు 70 శాతం మందికి తరగతి గదుల ద్వారానే బోధన కొనసాగుతుంది .ఆన్ లైన్ విధానంలో విద్యా బోధన చాలామందికి కొత్త అనుభవమే అయినా ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో యాజమాన్యాలు ,ఉపాధ్యాయులు ,విద్యార్థులు నూతన పరిణామాలకు మారాల్సిన పరిస్థితి ఏర్పడింది .మెకన్సీ 2019 నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా ఆన్లైన్ పాఠాల కోసం స్మార్ట్ ఫోన్లు వినియోగించే యువత 70 శాతానికి పైగా పెరిగింది .సాంకేతిక పరిజ్ఞానం పెరిగి ప్రపంచ దేశాలన్నీ ఆన్ లైన్ ద్వారా పాఠాలు ,పరీక్షలు ,మూల్యాంకనం చేస్తున్నాయి. ఒకసారి మిస్ అయిన పాఠాలు మళ్లీ ఎప్పుడైనా ,ఎక్కడైనా, ఎన్నిసార్లైనా వినడానికి అవకాశం ఉంది .ఆన్లై ఆన్ లైన్ ద్వారా కొంతవరకు చెడు ప్రభావం ఉన్నా 80 శాతం వరకు మంచి ఫలితాలు నమోదవుతున్నాయి .పబ్జి ,వీడియో గేమ్ లు అంటూ ఎప్పుడు స్మార్ట్ ఫోన్లలో ముఖం పెడుతున్న విద్యార్థులు కోకొల్లలు .నిత్యం తరగతి గదిలో పాఠ్యాంశాల బోధన జరుగుతున్న ఆ సమయంలోనే ఇలాంటి ఎన్నో కేసులు నమోదయ్యాయి .ప్రస్తుత లాక్‌డౌన్‌ విద్యావిధానంలో ఎన్నో మార్పులను తీసుకువచ్చింది ఆన్ లైన్ పాఠాలతో సాంకేతికతను ,వినియోగాన్ని పెంచి అనవసర కాలక్షేఫాన్ని తగ్గించింది. ఈ క్రమంలో జూమ్ ,కైజాల్ వంటి రకరకాల యాప్ లతో ఆన్ లైన్ పాఠాలు స్మార్ట్ ఫోన్ల ద్వారా అందుబాటులోకి వచ్చాయి .అయితే సాంకేతిక పరిజ్ఞానం తో ఏర్పడిన సౌలభ్యం తో పాటు కొంత ముప్పును కూడా విద్యార్థులు ఎదుర్కోక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు .విద్యార్థులకు అశ్లీల సైట్లు ఓపెన్ కాకుండా సాఫ్ట్వేర్ సంస్థలు నియంత్రణ పాటించాలని, తల్లిదండ్రుల నిత్య పర్యవేక్షణ మరియు పనికిరాని సైట్లను ప్రభుత్వాలు కట్టడి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

జాతీయస్థాయిలో లాక్ డౌన్ అనంతరం తెరుచుకోనున్న విద్యా సంస్థలకు కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసింది పాఠశాలలు కళాశాలలు ఇప్పటివరకు ఉన్న సిట్టింగ్ అరేంజ్మెంట్ ను మార్చి వ్యక్తిగత దూరం పాటించేలా ఏర్పాటు చేయాలని కోరింది .ప్రతిరోజు పాఠశాలలో నిర్వహించే ప్రేయర్ తో పాటు ఇతర సామూహిక సమావేశాలను రద్దు చేస్తూ ,ప్రతి విద్యార్థి కి మాస్కులు తప్పనిసరి చేసింది విద్యాసంస్థల భవనాలను క్రమం తప్పకుండా డిస్ఇన్ఫెక్ట్ చేయడం తో పాటు షిఫ్ట్ విధానంలో తరగతులు నిర్వహించడం వంటి నిర్ణయాలను ప్రకటించింది .అదేవిధంగా రాబోయే విద్యా సంవత్సరానికి విద్యా సంస్థలలో భౌతిక దూరాన్ని పాటించేందుకు సరి- బేసి విధానాన్ని అమలు చేయాలని జాతీయ విద్య పరిశోధన మండలి మరియ మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఈ విధానంలో 50 శాతం మంది విద్యార్థులకు రోజు విడిచి రోజు ఆఫ్ లైన్ లో తరగతులు నిర్వహించడం మరియు మిగతా 50 శాతం మంది విద్యార్థులకు ఆన్ లైన్లో ఇంటి వద్దనే తరగతులు నిర్వహించడం చేయాలి .ఉన్నత విద్య వరకు ఆన్ లైన్ విధానం బాగానే ఉన్నా, పాఠశాల స్థాయిలో ఆన్ లైన్ విద్యను మరింత ప్రోత్సహించే విధంగా ఒకటి నుంచి 12 తరగతుల విద్యార్థులకు వేరువేరుగా విద్యా చానళ్ళు ప్రారంభిస్తున్నారు. ఒక తరగతి ఒక ఛానల్ విధానాన్ని అమలు చేస్తున్నారు .విద్యార్థులకు ప్రస్తుతం మూడు ఛానల్ ద్వారా అందిస్తున్న పాఠ్యాంశాలను మరొక 12 స్వయంప్రభ చానళ్లను ఏర్పాటు చేసి ,ప్రతి తరగతికి ఒక ఛానల్ ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్నారు .దీనికి టాటా స్కై ,ఎయిర్ టెల్ వంటి డిటిహెచ్ ప్రైవేట్ ఆపరేటర్ల సహాయం తీసుకుంటున్నారు. డిజిటల్ ,ఆన్ లైన్ విద్యకు సంబంధించి పిఎం ఈ- విద్య పేరుతో ఒక బహుముఖ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. పాఠశాల విద్యలో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ (దీక్ష )యాప్ ను విస్తృతంగా వాడకంలోకి తీసుకవచ్చి అవసరమైన పాఠ్యాంశాలను ఉపాధ్యాయులు, విద్యార్థులు స్వయంగా డౌన్లోడ్ చేసుకునే విధానాన్ని కల్పిస్తున్నారు. కరొనా విజృంభన నేపథ్యంలో విద్యార్థుల లో ఉన్న మానసిక ఆందోళన దూరం చేసేందుకు “మనోదర్పణ్” అనే కార్యక్రమాన్ని రూపొందించారు. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ కు చెందిన టీమ్స్ యాప్, జూమ్ యాప్ బాగా ప్రాచుర్యం పొందిన నేపథ్యంలో రిలయన్స్ జియో నుంచి “జియో మీట్” మార్కెట్లోకి విడుదల చేస్తున్నందున ఆన్ లైన్ విద్య కు ఇది బహువిధాలుగా ఉపయోగ పడగలదని చెబుతున్నారు .కరొనా మహమ్మారి వల్ల ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థుల ,తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా విద్యావిధానంలో మార్పు తీసుకురాక తప్పదు. పాఠ్యాంశాలు పూర్తిచేయడం ,పరీక్షలు పెట్టడం ,మూల్యాంకనం చేయడం విద్యా సంవత్సరాన్ని కాపాడుకోవడం మన ముందున్న సవాళ్లు .దీనికోసం సాంకేతిక పరిజ్ఞానం వాడుకోవడం తప్ప వేరే మార్గం లేదు.

challa prabhakar reddy
డా చల్లా ప్రభాకర్ రెడ్డి ,
రాష్ట్ర కార్యదర్శి
ప్రభుత్వ ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం

Leave a Reply