Take a fresh look at your lifestyle.

వన్‌ ‌నేషన్‌..‌వన్‌ ‌రేషన్‌ ‌విజయవంతం

  • తొమ్మది రాష్ట్రాల్లో అమలు తీరు భేష్‌
  • ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటన

పబ్లిక్‌ ‌డిస్టిబ్యూష్రన్‌ ‌సిస్టమ్‌(‌పీడీఎస్‌)‌లో సంస్కరణలను తెలంగాణతో సహా తొమ్మిది రాష్ట్రాల్లో ’వన్‌ ‌నేషన్‌ – ‌వన్‌ ‌రేషన్‌’ ‌విజయవంతంగా అమలు చేశాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రేషన్‌ ‌లబ్దిదారులు దేశవ్యాప్తంగా ఎక్కడైనా రేషన్‌ ‌సరుకులు తీసుకునేందుకు వీలుగా కార్యక్రమాన్ని కేంద్రం అమలు చేస్తోంది. వన్‌ ‌నేషన్‌.. ‌వన్‌ ‌రేషన్‌ ‌కార్యక్రమాన్ని అమలు చేసిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ‌గోవా, హర్యానా, కర్ణాటక, కేరళ, త్రిపుర, ఉత్తరప్రదేశ్‌ ఉన్నాయని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కొరోనా మహమ్మారితో ఎదురవుతున్న సవాళ్ల దృష్ట్యా ఆర్థిక వనరులను సకరించేందుకు రాష్ట్రాలను బలోపేతం చేయడం ద్వారా ఇది సాధ్యమైందని పేర్కొంది. ‘2020-21లో స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్డీపీ)లో 2 శాతం అదనపు రుణ అనుమతి మంజూరు చేయడం వంటి చర్యలు ఉన్నాయి. ఇది మహమ్మారిని ఎదుర్కోవడానికి, ప్రజలకు సేవను అందించే ప్రమాణాలను నిర్వహించడానికి రాష్ట్రాలు అదనపు ఆర్థిక వనరులను సకరించడానికి దోహదపడిందని పేర్కొంది. మహమ్మారిపై పోరాడటానికి, సేవా ప్రమాణాలు పెంచేందుకు అదనపు ఆర్థిక వనరులను సకరించేందుకు రాష్ట్రాలకు వీలు కల్పించిందని చెప్పింది.

సంస్కరణల కోసం గుర్తించిన రంగాల్లో ఒకటి ప్రజా పంపిణీ ఒకటి, జీఎస్‌డీపీలో రెండు శాతం అదనపు రుణ పరిమితిలో, 0.25 శాతం వన్‌ ‌నేషన్‌ ‌వన్‌ ‌రేషన్‌ ‌కార్డ్ ‌వ్యవస్థ అమలుతో ముడిపడి ఉందని మంత్రిత్వశాఖ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. జాతీయ ఆహార భద్రతా చట్టం(ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ), ఇతర సంక్షేమ పథకాల కింద లబ్దిదారులకు, ముఖ్యంగా వలస కార్మికులు, వారి కుటుంబాలకు దేశవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా రేషన్‌ ‌లభించేలా చూడడమే లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే బోగస్‌, ‌డూప్లికేట్‌, అనర్హుల రేషన్‌ ‌కార్డులను తొలగించడం, సంక్షేమాన్ని పెంచేందుకు సంస్కరణలు అమలు చేసినట్లు తెలిపింది.


ఈ సంస్కరణల అమలు అనంతరం తొమ్మిది రాష్ట్రాలకు రూ.23,523 కోట్ల అదనపు రుణాలు అనుమతి లభించిందని, ఆంధప్రదేశ్‌కు రూ.2,525 కోట్లు, గోవాకు రూ.223 కోట్లు, గుజరాత్‌కు రూ.4,352 కోట్లు, హర్యానాకు రూ.2,146 కోట్లు, కర్ణాటకకు రూ.4,509 కోట్లు, కేరళకు రూ.2,261 కోట్లు, తెలంగాణకు రూ.2,508 కోట్లు, త్రిపురకు రూ.148 కోట్లు, ఉత్తర ప్రదేశ్‌కు రూ.4,851 కోట్లు వన్‌ ‌నేషన్‌ – ‌వన్‌ ‌రేషన్‌ ‌కార్యక్రమం అమలుతో అదనపు రుణాలు తీసుకునేందుకు అనుమతి లభించిందని మంత్రిత్వశాఖ తెలిపింది.

Leave a Reply