Take a fresh look at your lifestyle.

అనాథ తెలంగాణ .. నేడు పసిడి పంటల తెలంగాణ..

నాకు చాలా గర్వంగా ఉంది
కొండపోచమ్మ జలాశయం ప్రారంభోత్సవ ప్రెస్‌ ‌మీట్‌లో సిఎం కేసీఆర్‌
​ ఇవాళ నాకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. కొండపోచమ్మ సాగర్‌ ‌ప్రారంభోత్సవం రాష్ట్ర చరిత్రలో ఉజ్వలమైన ఘట్టం. కొండపోచమ్మ సాగర్‌ ‌ప్రాజెక్టు అపూరపమైన ప్రాజెక్టు. ఆరేండ్ల కిందట అనాథ తెలంగాణ ఉన్న తెలంగాణ నేడు పసిడి పంటల తెలంగాణ అయింది. దేశం మొత్తం మీద తెలంగాణ రాష్ట్రమొక్కటే 53లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించింది. గర్వంగా ఉండటానికి  ఇంతకంటే ఏం ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల  చంద్రశేఖర్‌రావు అన్నారు. సిద్ధిపేట జిల్లాలోని మర్కూక్‌ ‌మండలంలోని పాములపర్తిలో నిర్మించిన 15టిఎంసిల సామర్ధ్యం గల శ్రీ కొండపోచమ్మ రిజర్వాయర్‌ను చినజీయర్‌ ‌స్వామితో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేసిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో సిఎం కేసీఆర్‌ ‌మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా భూములు కోల్పోయిన భూ నిర్వాసితుల త్యాగాలు వెలకట్టలేనివి అని, కాళేశ్వరం నుంచి కొండపోచమ్మ వరకు భూములు కోల్పోయిన భూ నిర్వాసితులందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నా.  ప్రాజెక్టు కోసం పని చేసిన ఇతర రాష్ట్రాల కూలీలకు కూడా.  అలాగే,అధికారులు, సిబ్బంది ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నిర్వాసితుల  త్యాగాల వల్ల లక్షలాది ఎకరాల భూములు సాగులోకి వచ్చాయన్నారు. భూ నిర్వాసితులందరికీ మంచి నష్ట పరిహారం ఇచ్చాం. భూ నిర్వాసితుల త్యాగాలు గుర్తు చేసుకోకుండా ఉండలేమని సీఎం స్పష్టం చేశారు.  అన్ని విధాలుగా తెలంగాణ ప్రభుత్వం అండదండగా ఉంటుందన్నారు. కొండపోచమ్మ సాగర్‌ ‌ప్రారంభోత్సవం రాష్ట్ర చరిత్రలో ఉజ్వలమైన ఘట్టం. కొండపోచమ్మ సాగర్‌ ‌ప్రాజెక్టు అపూరపమైన ప్రాజెక్టు అని సి కేసీఆర్‌ ‌పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా పదో లిఫ్టు కింద కొండపోచమ్మ సాగర్‌లోకి గోదావరి జలాలు ప్రవేశించాయి. కాళేశ్వరం నుంచి కొండపోచమ్మ వరకు భూములు కోల్పోయిన భూనిర్వాసితులకు శిరసు వంచి నమస్కరిస్తున్నా. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారి త్యాగం వల్లే లక్షలాది ఎకరాలు సాగులోకి వచ్చాయి. నిర్వాసితుల త్యాగాలు వెలకట్టలేనివి. మంచి నష్ట పరిహారం ఇచ్చాం. అన్ని విధాలా వారికి ప్రభుత్వం అండదండగా ఉంటుందన్నారు

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!