Take a fresh look at your lifestyle.

మరోసారి హైదరాబాద్‌లో కుండపోత

  • లోతట్టు ప్రాంతాలు జలమయం
  • జంట జలాశయాలకు పోటెత్తిన వరద
  • శివగంగ థియేటర్‌ ‌గోడ కూలి వాహనాలు ధ్వంసం

హైదరాబాద్‌ ‌నగరంలో శనివారం సాయంత్రం మరోమారు పలు చోట్ల కుండపోత వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో భారీగా వర్షం పడింది. దిల్‌సుఖ్‌నగర్‌, ‌సరూర్‌నగర్‌, ‌కుషాయిగూడ, చెంగిచెర్ల, ఉప్పల్‌, ‌రాంనగర్‌, ‌సికింద్రాబాద్‌, ‌ముషిరాబాద్‌, ‌ఖైరతాబాద్‌, ‌పంజాగుట్ట, లక్డీకాపూల్‌, ‌చంపాపేట, సైదాబాద్‌, ‌చైతన్యపురి పాటు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వానపడింది. ఒక్కసారిగా వర్షం కురవడంతో రోడ్లపైకి నీరు చేరింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇదిలా ఉండగా.. నగరంలో మధ్యాహ్నం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జీహెచ్‌ఎం‌సీ సైతం అప్రమత్తమైంది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల ప్రజలకు సహాయం అందించేందుకు సైతం జీహెచ్‌ఎం‌సీ కంట్రోల్‌ ‌రూంను ఏర్పాటు చేసింది. అత్యవసరమైతే 040 2111 1111 నంబరులో సంప్రదించాలని సూచించింది.  భారీ వర్షాల దృష్ట్యా నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు, అప్రమత్తంగా ఉండాలని  అధికారులు సూచించారు. వాతావరణ పరిస్థితులను బట్టి ప్రయాణాలను ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. భారీ వర్షం సూచనతో డిఆర్‌ఎఫ్‌ ‌బృందాలు కూడా అలర్ట్ అయ్యాయి. శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి నగరం అతలా కుతలం అయ్యింది. నగరంలోని పలు కాలనీలు, బస్తీల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అనేక కాలనీలు మళ్ళీ నీటమునిగాయి.

 

జంటజలాశయాలకు వరద పోటెత్తింది. హిమాయత్‌ ‌సాగర్‌ ‌నుంచి నీటిని విడుదల చేయడంతో నాలాలు పొంగి ప్రవహిస్తున్నాయి. యథావిధిగానే మళ్లీ సరూర్‌ ‌నరగ్‌ ‌చెరువు నుంచి వరద పోటెత్తి కోదండరామ్‌ ‌నగర్‌ ‌సహా అనేక కాలనీల్లోకి భారీగా వరదనీరు చేరింది. నగరంలోని చంపాపేట్‌ ‌రెడ్డి కాలనీ సరూర్‌ ‌నగర్‌, ‌కోదండరామ్‌ ‌నగర్‌లోని లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. దిల్‌సుఖ్‌నగర్‌లోని కొన్ని కాలనీల్లో మోకాళ్ల లోతు నీళ్లలో ప్రజలు అవస్థలు పడుతున్నారు. మరోవైపు భారీ వర్షానికి జంట జలాశయాలకు వరద పోటెత్తింది. ఇకపోతే సరూర్‌ ‌నగర్‌ ‌శివగంగ థియేటర్లో దారుణం చోటు చేసుకుంది.

Once again a pothole in Hyderabad

రాత్రి  సినిమాకు వొచ్చి..పార్కింగ్‌లో పెట్టిన వాహనాలపై గోడ కూలిపోయింది. దాదాపు వందకు పైగా ద్విచక్ర వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. వాహనాల యజమానులు ఫస్ట్ ‌షో సినిమా చూసి బయటకు వొచ్చేసరికి ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న జీహెచ్‌ఎం‌సీ అధికారులు శనివారం ఉదయం థియేటర్‌ను పరిశీలించారు. జరిగిన నష్టంపై థియేటర్‌ ‌యాజమాన్యాన్ని ఆరా తీశారు. జేసీబీతో గోడను తొలగించి వాహనాలను బయటకు తీశారు. కాగా.. థియేటర్‌ ‌పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. దీంతో శివ గంగా థియేటర్‌ ‌పూర్తిగా నీటమునిగింది. నగరంలో నిన్న రాత్రి 7 నుంచి 9గంటల వరకు వరుణుడు సృష్టించిన బీభత్సానికి లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. చాలా చోట్ల రహదారులు చెరువులను తలపిస్తుండటంతో రాకపోకలు స్తంభించాయి.

 

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌ ‌మెట్‌ ‌మండలం గుంతపల్లి నుంచి మజీద్‌ ‌పుర్‌కి వెళ్లే దారిలోని వాగులో ఆర్టీసీ బస్సు ఆగి పోయింది. దీంతో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌ ‌స్తంభించింది. హైదరాబాద్‌- ‌బెంగళూరు రహదారిపై వరద నీరు భారీగా నిలిచింది. నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జి వద్ద ఓ లారీ బ్రేక్‌ ‌డౌన్‌ అయి వరదనీటిలో చిక్కుకుంది. ఫలితంగా ఈ మార్గంలో భారీగా ట్రాఫిక్‌ ‌జామ్‌ ఏర్పడింది. రహదారికి ఇరువైపులా 3 కి.వి• మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అరాంఘర్‌- ‌శంషాబాద్‌ ‌రహదారిపై కూడా వరద నీటితో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జీహెచ్‌ఎం‌సీ పరిధిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అత్యవసర పనులు తప్ప ఎవ్వరూ బయటకు వెళ్లొద్దన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఉత్తర, వాయవ్య దిశల నుంచి రాష్ట్రంలోకి కిందిస్థాయి గాలులు వీస్తున్నాయి. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని అధికారులు సూచించారు. భారీ వర్ష సూచన నేపథ్యంలో డైరెక్టర్‌ ఆఫ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ‌విజిలెన్స్, ‌డిజాస్టర్‌ ‌మేనేజ్‌మెంట్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. వాతావరణ పరిస్థితులను బట్టి పౌరులు తమ ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply