Take a fresh look at your lifestyle.

వైరస్‌ ‌వ్యాధిపై యుద్ధం

  • విస్తృత ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు
  • వరంగల్‌, ‌కరీంనగర్‌లలో ఐసోలేషన్‌ ‌వార్డులు

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ ‌హైదరాబాద్‌కూ వ్యాపించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌, ‌తదితర మంత్రులు రంగంలోకి దిగారు. ప్రస్తుతం కర్ణాటకలో కరోనా నేపథ్యంలో బస్సులన్నింటినీ కడిగి శుభ్రం చేస్తున్నారు. దీనికి సంబంధించిన పిక్‌ను సోషల్‌ ‌డియాలో షేర్‌ ‌చేసిన కేటీఆర్‌.. ‌మంత్రి పువ్వాడ అజయ్‌ ‌కుమార్‌కు సూచనలు చేశారు. అలాగే కరోనా వైరస్‌ ‌నేపథ్యంలో మెట్రో, ఆర్టీసీ అధికారులకు సైతం ట్విట్టర్‌ ‌వేదికగా కేటీఆర్‌ ‌సూచనలు చేశారు. బెంగుళూరు తరహాలో సత్వరమే చర్యలను చేపట్టాలని హైదరాబాద్‌ ‌మెట్రో రైల్‌, ఎల్‌అం‌డ్‌టీ ఎండీలను అభ్యర్థిస్తున్నా. అలాగే ట్రాన్స్‌పోర్ట్ ‌మినిస్టర్‌ ‌పువ్వాడ అజయ్‌ ‌గారు టీఎస్‌ఆర్టీసీలో సైతం చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తున్నా అని కేటీఆర్‌ ‌ట్వీట్‌ ‌చేశారు. దీంతో పారిశుధ్‌ ‌చర్లకు ఉపక్రమించారు. ఇకపోతే గాంధీ హాస్పిటల్‌ ఐసోలేషన్‌ ‌వార్డు హౌస్‌ ‌ఫుల్‌ అయింది. గాంధీ ఆసుపత్రికి కెపాసిటీకి మించి కరోనా అనుమానిత కేసులు వస్తున్నాయి.

ఐసోలేషన్‌లో ఉన్న పడకలు 40 మాత్రమే.. కానీ 40 గంటల వ్యవధిలో గాంధీకి 50 మంది అనుమానితులు వచ్చారు. దీంతో బెడ్ల కొరతతో పెయిడ్‌ ‌రూమ్స్‌ను సైతం ఐసోలేషన్‌కి వినియోగిస్తున్నారు. తక్కువ సిమ్‌టమ్స్ ఉన్నవారిని ఐసోలేషన్‌ ‌వైద్యులు ప్రిఫర్‌ ‌చేస్తున్నారు. కరోనా వైరస్‌పై అప్రమత్తంగా ఉన్నామని వరంగల్‌ ఎం‌జీఎం సూపరింటెండెంట్‌ శ్రీ‌నివాస్‌ ‌తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వరంగల్‌ ఎం‌జీఎంలో 25 పడకల ఐసోలేషన్‌ ‌సెంటర్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. వైరస్‌ ఇన్ఫెక్ట్ అయిన వారికి అత్యవసర వైద్యం అందేలా ఏర్పాట్లు చేశామని సూపరింటెండెంట్‌ ‌తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదని, ముందస్తుగా అప్రమత్తంగా ఉన్నామని చెప్పారు.

కరోనాపై ప్రజలు అప్రమత్తమంగా ఉండాలని సూపరింటెండెంట్‌ శ్రీ‌నివాస్‌ ‌హెచ్చరించారు. కరోనా వైరస్‌ ఆం‌దోళనతో కరీంనగర్‌ ‌జిల్లాలోని ప్రధాన ఆస్పత్రిలో ఐసోలేషన్‌ ‌వార్డును ఏర్పాటు చేశారు. ఇందుకోసం ప్రత్యేక సిబ్బందిని నియమించినట్లు సూపరింటెండెంట్‌ ‌తెలిపారు. మాస్కులు, ప్రాథమిక చికిత్స కోసం మందులను వైద్యులు అందుబాటులో ఉంచారు. వైరస్‌ ‌లక్షణాలు ఉంటే హైదరాబాద్‌కు పంపిస్తామని వైద్యులు తెలిపారు. కరోనా వైరస్‌ ‌వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో •లీ సంబరాలపై రాష్ట్రవ్యాప్తంగా నిషేధం విధించాలంటూ హైకోర్టులో పిటిషన్‌ ‌దాఖలైంది. హైదరాబాద్‌లోని మణికొండకి చెందిన గంపా సిద్దలక్ష్మి ఈ మేరకు బుధవారం హైకోర్టుని ఆశ్రయించారు. ఈ నెల 9 లేదా 10 తేదీల్లో •లీ సంబరాలు జరుగనున్నాయని ఆమె కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రజల ఆరోగ్యం దష్ట్యా ఈ వేడుకలని నిషేధించాలని రిట్‌ ‌పిటిషన్‌లో కోరారు. వేడుకలని నిషేధించడం ద్వారా ప్రజలని వైరస్‌ ‌బారిన పడకుండా కాపాడవచ్చని పేర్కొన్నారు. కాగా, కోవిడ్‌ ‌వైరస్‌ ‌విభృంభిస్తున్న నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ సైతం •లీ వేడుకలకు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నారు. ప్రజలు కూడా వేడుకలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ట్విటర్‌లో తన సందేశాన్ని ట్వీట్‌ ‌చేశారు.

- Advertisement -

ఆ 45 మందికి కరోనా సోకలేదు : గాంధీ ఆస్పత్రి
దుబాయ్‌ ‌నుంచి బెంగళూరుకు వచ్చిన సాప్ట్‌వేర్‌ ఉద్యోగికి కరోనా వైరస్‌ ‌పాజిటివ్‌ ‌వచ్చిన విషయం విదితమే. ఈ ఉద్యోగితో కలిసిమెలిసి తిరిగిన వారి సంఖ్య 88 అని ఆరోగ్య శాఖ నిర్దారించింది. ఇందులో 45 మందిని గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ ‌వార్డుకు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరందరికి కరోనా వైరస్‌ ‌సోకలేదని గాంధీ వైద్యులు స్పష్టం చేశారు. 45 మందిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశామని వెల్లడించారు. వీరంతా 14 రోజుల పాటు బయటకు రాకుండా తమ నివాసాల్లోనే ఉండాలని సూచించినట్లు డాక్టర్లు చెప్పారు. అయితే గాంధీ ఐసోలేషన్‌ ‌వార్డులో కరోనా బాధితుడికి చికిత్స అందిస్తున్న వైద్యుడికి కూడా ఈ వైరస్‌ ‌సోకినట్లు తెలుస్తోంది. వైద్యుడి రక్త నమూనాలను పుణె ల్యాబ్‌కు పంపించారు. ఆ ఫలితాలు ఇవాళ వచ్చే అవకాశం ఉంది. ఒక వేళ డాక్టర్‌కు కరోనా పాజిటివ్‌ ‌వస్తే.. తెలంగాణలో నేరుగా వ్యాధి బారిన పడిన తొలి వ్యక్తిగా నమోదు అవుతారు.

హైదరాబాద్‌ ఐటి ఉద్యోగికి కరోనా
మైండ్‌స్పేస్‌లో కరోనా కలకలం రేగింది. బిల్డింగ్‌-20‌లోని డీఎస్‌ఎం ‌కంపెనీ ఉద్యోగి పరిమిళకు కరోనా పాజిటివ్‌గా తెలిసింది. పరిమిళ విదేశాలకు వెళ్లి వచ్చినట్టు సమాచారం. కరోనా పాజిటివ్‌ ‌కేసుతో ఉద్యోగులను డీఎస్‌ఎం ‌కంపెనీ ఇంటికి పంపింది. ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లో మరో వ్యక్తికి కూడా కరోనా లక్షణాలు కనిపించాయి. ఉదయం లండన్‌ ‌నుంచి శంషాబాద్‌ ‌వచ్చిన వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు. స్క్రీనింగ్‌లో కరోనా లక్షణాలు తేలడంతో అతనిని హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Tags: virus infection, War Isolation awards, Warangal, Karimnagar

Leave a Reply