Take a fresh look at your lifestyle.

ఏడవ రోజు ‘సరస్వతి’’గా దర్శనమిచ్చిన శ్రీ భద్రకాళీ అమ్మవారు

వరంగల్‌ ‌శ్రీ భద్రకాళీ దేవస్థానంలో దేవీశరన్నవరాత్ర మహోత్సవములు శుక్రవారం ఏడవ రోజుకు చేరుకున్నాయి.  ఉదయం 4 గంటలకు ప్రారంభమైన ఆలయ నిత్యాహ్నికం ప్రాతఃకాల పూజకాగానే అమ్మవారికి నవరాత్ర విశేష సేవలు ఆరంభింపబడ్డాయి.

ఏడవ  రోజు శరన్నవరాత్ర మహోత్సవ కార్యక్రమంలో భాగంగా అమ్మవారిని ‘సరస్వతి’’గా అలంకరించి చతుస్థానార్చన జరిపారు. నవరాత్ర వ్రతంలో వరాహ పురాణాంతర్గత నవదుర్గా విధానాన్ని అనుసరించి అమ్మవారికి కాళరాత్రి దుర్గా క్రమంలో మరియు బోధాయన ప్రణీత ఆగమోక్త దేవపూజా విధిననుసరించి రక్తబీజహా దుర్గాక్రమంలో పూజాదికములు నిర్వర్తించి సాయంకాలం రథ సేవ నిర్వహించారు.

Leave a Reply