Take a fresh look at your lifestyle.

మానవ మహోపకారి ప్రవక్త ముహమ్మద్‌

‌మీలాద్‌ – ఉన్‌ – ‌నబీ సందర్భంగా
అరబ్బుల మత, రాజు కీయ నాయకుడు, ఇస్లాం చివరి ప్రవక్త ముహమ్మద్‌ ‌లేదా మహమ్మద్‌. ‌ముస్లింలు ఇస్లాంను, ఏకేశ్వరో పాసక మతముల ప్రకటనలో చివరి మెట్టుగా భావిస్తారు. ఇస్లాం పరంపర ఆదామ్‌ ‌ప్రవక్తతో ప్రారంభ మైనది. అనేక ప్రవక్తల గొలుసు క్రమంలో మహమ్మద్‌ ‌చివరివారు. ముస్లిమేతరులు సాధారణంగా మహమ్మద్‌ ‌ను ఇస్లాం మత స్థాపకునిగా భావిస్తారు. కాని ఇస్లాం మతం ప్రారంభమైంది ఆది పురుషుడైన ఆదమ్‌ ‌ప్రవక్తతో అని విశ్వాసం. సాంప్రదాయ ముస్లిం జీవితకర్తల ప్రకారం మహమ్మద్‌ ‌సి.570లో మక్కాలో జన్మించి, 8వ జూన్‌, 632‌లో మదీనాలో పరమ పదించారు. మక్కా, మదీనా రెండూ అరేబియన్‌ ‌ద్వీపకల్పం లోనివే. ఖురాన్‌ ‌లో ‘‘ముహమ్మద్‌ ‘‘ అని పేర్కొన బడింది. ముహమ్మద్‌ అనే పదానికి అరబ్బీ మూలం హమ్‌ (‌హ మ్‌ ‌ద్‌) అర్ధం. హమ్‌ ‌ద్‌ ‌పదానికి ము చేర్చిన ముహమ్మద్‌ అగును. అంటే శ్లాఘించ బడిన వాడు లేదా కీర్తించ బడినవాడు అని అర్థం.

ఈ పేరునే ముహమ్మద్‌, ‌మొహమ్మద్‌, ‌మహమ్మద్‌, ‌మహమ్మదు అని రాస్తారు. టర్కీవాసులు మహ్మెట్‌ ‌లేదా మహమెట్‌ అని, అహ్మద్‌ అనీ పలుకుతారు. మహమ్మద్‌ ‌తొలి ముస్లిం మూల నివేదిక ప్రకారం 611లో 40 ఏళ్ళ వయసులో హిరా గుహలో ధ్యానం చేస్తుండగా, దివ్య దృష్టిని పొందారు. ఈ విషయాన్ని సమీప వ్యక్తులకు వర్ణిస్తుండగా, దేవ దూత జిబ్రాయీల్‌ ఆయనకు కనిపించి, ఖురాన్‌ ‌ప్రవచనాలను గుర్తు పెట్టుకుని, ఇతరులకు బోధిం చమని అల్లాహ్‌ ఆదేశించినట్లు చెపుతారు. మహమ్మద్‌, అరబ్బులకు తెలిసిన జుడాయిజమ్‌ (‌యూద మతము)ను కాని క్రైస్తవ మతాన్ని కాని పూర్తిగా తిరస్కరించ లేదు. ఇబ్రాహీం ప్రవక్త అవలంబించిన ఇస్లాం మత మును ప్రకటిస్తున్నానని చాటారు.

తక్కువ సమ యంలోనే అనేకుల విశ్వాసం పొందినా, విగ్రహారా ధనావలంబీకులైన అరబ్‌ ‌తెగల ద్వేషాన్ని తప్పించు కోవడానికి తాత్కాలికంగా 622లో మక్కా నుండి వలస వెళ్ళి, తన సహచరులతో కలిసి యస్రిబ్‌ (‌నేటి మదీనా)లో స్థిరపడినారు. ఇక్కడే మహమ్మద్‌ ‌తొలి ముస్లిం సముదాయమును స్థాపించి, నాయకులైనారు. తర్వాత ఖురేషులు మరియు మదీనా వాసులైన విశ్వాసులకు మధ్య జరిగిన యుద్ధంలో మహమ్మద్‌, ఆయన అనుచరులు విజయం సాధించారు. మహమ్మద్‌ ‌మృతి చెందే నాటికి అరేబియా ద్వీపకల్పాన్ని సమైక్య పరిచి, ఉత్తరాన సిరియా మరియు పాలస్తీనా ప్రాంతాలలో ఇస్లాంను వ్యాపింప చేశారు. మహమ్మద్‌ ‌తర్వాత ఖలీఫాల నేతృత్వంలో ఇస్లామీయ సామ్రాజ్యం పాలస్తీనా సిరియా, ఇరాక్‌, ఇరాన్‌, ఈజిప్టు, ఉత్తర ఆఫ్రికా, స్పెయిన్‌ ‌దేశాలకు వ్యాపించింది.

ముస్లింలు, ముస్లి మేతరుల మధ్య వర్తక సంబంధాలు, మత ప్రచార కార్య కలాపాలు మహమ్మద్‌ ‌ప్రవచించిన మతాన్ని భూమి నలు చెరగులా వ్యాప్తి చెందించడానికి దోహద పడ్డాయి. ముహమ్మద్‌ ‌జీవితాన్ని గురించి ఖురాన్‌, ‌సీరత్‌ ‌హదీస్‌ ‌సేకరణలు తెలుపు తున్నాయి. హదిత్‌ ‌సేకరణలలో ముహమ్మద్‌ ‌జీవితానికి సంబంధించి అనేక అప్రామాణిక సాంప్రదాయాలు ముస్లిం ముస్లిమేతర పండితులు ఏకగ్రీవంగా అంగీకరిస్తారు. అయితే ముహమ్మద్‌ ‌చారిత్రక, జీవిత విశే షాలను మాత్రం అందరూ అంగీకరిస్తారు. 20 ఏప్రిల్‌, 570 ‌లో రబీ అల్‌-అవ్వాల్‌ ‌పన్నెండవ రోజు మక్కాలో ప్రవక్త ముహమ్మద్‌ ‌జన్మించారని కొందరు ముస్లింలు నమ్ముతారు. షియాల ప్రకారం 26 ఏప్రిల్‌ 571‌గా భావిస్తారు. ముహమ్మదు ప్రవక్త కొన్నిరోజులు అనారోగ్యం పాలయ్యారు, తదనంతరం 63 సంవత్సరాల వయస్సులో మదీనా నగరంలో 8 జూన్‌ 632 ‌సోమవారం పరమ పదించారు. మహమ్మదు ప్రవక్త, చాలా సంవత్సరాలు వర్తకుడుగాను, ప్రబోధకుడి గానూ గడిపారు. తాను కరవాలాన్ని చేబట్టింది కేవలం 10 సంవత్సరాలు మాత్రమే. అదియూ స్వీయ , ముస్లింల రక్షణకొరకు మాత్రమే యుధ్ధాలు చేశారు. కొద్దిమంది గల సేనతో, అరకొర ఆయుధాలతో యుధ్ధాలు చేసి విజయం పొందడం వీరి విశ్వాస పటుత్వానికి , అల్లాహ్‌ ‌దయకు ప్రతీక.

622లో ముహమ్మద్‌ ‌మక్కావీడి మదీనాకు వలస వెళ్ళారు. ఈ వలస తేదీతోనే ఇస్లామీయ క్యాలెండర్‌ ‌యొక్క మొదటి సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఈ శకానికే హిజ్రీ శకం అంటారు. ఇస్లామిక్‌ ‌క్యాలెండర్లో రబీ ఉల్‌ అవాల్‌ 3 ‌వ నెల, దీనిని హిజ్రీ క్యాలెండర్‌ అని కూడా పిలుస్తారు. అరబిక్‌లో, ‘‘రబ్బీ’’ అనే పదానికి వసంతం అని, ‘‘అల్‌ అవ్వాల్‌’’ అం‌టే మొదటిది అని అర్థం. అందువల్ల రబ్బీ ఉల్‌ అవ్వాల్‌ ‌మొత్తంగా ‘ది ఫస్ట్ ‌స్ప్రింగ్‌’ ‌గా అనువదించారు. రబీ ఉల్‌ అవాల్‌ ఇస్లామిక్‌ ‌చరిత్రలో అత్యంత ముఖ్యమైన నెల. పవిత్ర ప్రవక్త మొహమ్మద్‌ (‌స) జన్మించడం ద్వారా ఈ నెలకు ప్రాముఖ్యత చేకూరింది. ఇది మానవ చరిత్రలో అత్యంత ముఖ్యమైన మరియు గొప్ప సంఘటన. కాబట్టి, ఈ నెలను ప్రవక్త (స) పుట్టిన నెల అని పిలుస్తారు. మహమ్మద్‌ ‌ప్రవక్త పేరు ఉచ్ఛరించి నపుడు సల్లల్లాహు అలైహి వస ల్లమ్‌ (అతని మీద శాంతి కలుగుగాక) అని పలు కుతారు. ముస్లింలు మహమ్మద్‌ ‌ప్రవక్త జన్మ దినాన్ని మీలాద్‌ – ఉన్‌ – ‌నబీగా జరుపు కుంటారు.

Leave a Reply