Take a fresh look at your lifestyle.

గణేశ్‌ ఉత్సవాల నిర్వహణపై…. ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌
‌గణేష్‌ ‌విగ్రహాలను అడ్డుకుంటే
ఫాంహౌస్‌కు తరలిస్తాం: ఎమ్యెల్యే రాజాసింగ్‌

రాష్ట్రంలో గణష్‌ ఉత్సవాల నిర్వహణపై టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ప్రజలను ఉద్దేశపూ ర్వకంగా తప్పుదోవ పటిస్తున్నదని బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. ఈ ఉత్సవాల నిర్వహణపై ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి స్పష్టత లేదని విమర్శించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియా ప్రతినిధులకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. గణష్‌ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్‌ ‌చేశారు. క్షేత్ర స్థాయిలో పోలీసులు తమ ఇష్టానుసారం ఉత్సవాల నిర్వహణకు నిబంధనలు విధిస్తున్నారనీ, ఉత్సవ నిర్వాహకులను బెదిరింపులకు గురి చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు, హిందూ వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నారని ధ్వజమెత్తారు. ధార్మిక సంస్తలు, హిందూ ఉత్సవ సమితులు నిర్దేశించిన విధానాలకు అనుగుణంగా గణేష్‌ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఉత్సవ నిర్వాహకులకు బీజేపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కోవిడ్‌ ‌నిబంధనల పేరిట అధికారులు, పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తే టీఆర్‌ఎస్‌ ‌ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. కోవిడ్‌ ‌నిబంధనల సాకుతో టీఆర్‌ఎస్‌ ‌నేతలు అవలంభిస్తున్న హిందూ వ్యతిరేక విధానాలను ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం అనుసరిస్తున్న హిందూ వ్యతిరేక విధానాలను తిప్పికొడతామన్నారు.

గణేష్‌ ‌విగ్రహాలను అడ్డుకుంటే ఫాంహౌస్‌కు తరలిస్తాం : రాజాసింగ్‌
‌గణేష్‌ ఉత్సవాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తే ధూల్‌పేట్‌ ‌గణేష్‌ ‌విగ్రహాలను కేసీఆర్‌ ‌ఫాంహౌస్‌కు తరలిస్తామని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ‌హెచ్చరించారు. హిందువుల పండుగలకు టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం కావాలనే అడ్డంకులు సృష్టిస్తున్నదని ఆరోపించారు. గణేష్‌ ‌మంటపాలు ఏర్పాటు చేసిన వారిపై బైండోవర్‌, ‌రౌడీషీట్లు ఓపెన్‌ ‌చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. గణేష్‌ ఉత్సవాలకు మంటపాల ఏర్పాటుపై మంత్రుల ప్రకటనలకు, పోలీసుల ప్రవర్తనకు పొంతన లేదన్నారు. ధూల్‌పేటలో కళాకారులు తయారు చేసిన విగ్రహాలను ప్రభుత్వమే కొనుగోలు చేసి భక్తులకు పంపిణీ చేయాలని ఈ సందర్భంగా రాజాసింగ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు.

మంటపాలకు ప్రభుత్వ అనుమతి అవసరం లేదు: భగవంతరావు
గణష్‌ ‌మంటపాలకు ప్రభుత్వ అనుమతి అవసరం లేదని భాగ్యనగర్‌ ‌గణష్‌ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు తెలిపారు. 1980 నుంచి గణేష్‌ ఉత్సవాలు జరుగుతున్నాయనీ, గతంలో ఎప్పుడూ మంటపాలకు ప్రభుత్వ అనుమతి తీసుకోలేదని చెప్పారు. అయితే, విగ్రహాలను మెయిన్‌ ‌రోడ్డుపై కాకుండా గల్లీల్లో, కమ్యూనిటీ హాళ్లలో ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. కోవిడ్‌ ‌నిబంధనలు పాటించాలనీ, మండపంలో ఐదుగురు మాత్రమే ఉండాలనీ, మాస్కులు ధరించాలని సూచించారు. గణష్‌ ఉత్సవాలతో కొరోనా వ్యాప్తి చెందిందనే అపవాదు రాకుండా చూసుకోవాలని సూచించారు. గణేష్‌ ‌మంటపాల వద్ద ప్రసాద వితరణ ఉండదనీ, అలాగే, సామూహిక నిమజ్జనం కూడా చేయవద్దని పేర్కొన్నారు.

Leave a Reply