Take a fresh look at your lifestyle.

రైతుల సమస్యలపై .. సర్కార్‌ను నిలదీస్తాం

రానున్న బడ్జెట్‌ ‌సమావేశంలో కాంగ్రెస్‌ ‌పార్టీ రైతుల పక్షాన ప్రభుత్వాని నిలదీస్తుందని ,రైతు సమస్యల ప్రధాన ఎజెండాగా పోరాడుతుందని తెలంగాణ కాంగ్రెస్‌  ‌పార్టీ నాయకులు స్పష్టం చేశారు.శనివారం గాంధీభవన్‌ ‌లో జాతీయ కిసాన్‌ ‌సెల్‌ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అధ్యక్షతన , టీపీసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది.ఈ  సమావేశానికి సిఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క , ఎమ్లెయ్‌ ‌జగ్గారెడ్డి ,ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి  , రాష్ట్ర ఛైర్మెన్‌ అన్వేష్‌ ‌రెడ్డి, పలువురు డీసీసీ లు హాజరైయ్యారు.రాబోయే పార్లమెంట్‌, అసెంబ్లీ బడ్జెట్‌ ‌సమావేశాలో పార్టీ ప్రధానంగా లేవనెత్తాల్సిన అంశాలు వ్యవసాయ, రైతు సమస్యల పై చర్చించారు.కొత్త రెవెన్యూ చట్టం వచ్చే శాసనసభలో ప్రవేశపెట్టాలని,కొత్త రెవెన్యూ చట్టం తెస్తే కాంగ్రెస్‌ ‌పార్టీ సహకరిస్తుంది కానీ ప్రవేశపెట్టే ముందే రాజకీయ పార్టీ లకు కొత్తచట్టానికి సంబందించిన కాపీ ఇస్తే సూచనలు చేస్తామని కోదండరెడ్డి తెలిపారు.ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి మాట్లాడుతూ… పంటరుణాల మాఫీ పై స్పష్టత లేదని , రైతుభిమా-రైతుబంధు రైతులందరికీ అందడం లేదని విమర్శించారు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు 6వేల మంది రైతులు మరణించారని తెలిపారు  రైతుబంధు ఎలాంటి ఆంక్షలు లేకుండా అందరికీ వర్తింపజేయాలని కోరారు. మరణించిన రైతులకు ఇవ్వాల్సిన నష్టపరిహారం వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ ‌చేశారు. సహకార ఎన్నికల్లో టీఆరెస్‌ ‌తో సమానంగా డైరెక్టర్లను కాంగ్రెస్‌ ‌పార్టీ గెలుచుకుంది తెలిపారు.

టీఆరెస్‌ ‌పార్టీ డ్రామా క్రియేట్‌ ‌చేస్తుంది..జగ్గారెడ్డి
గాంధీభవన్‌ ‌లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ …వచ్చే అసెంబ్లీ సమావేశంలో కాంగ్రెస్‌ ‌రైతుపక్షాన పోరాటం చేస్తుందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు..గ్రామీణ ప్రాంతాల్లో రైతుల పట్ల పోరాటం చేసేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. మిషన్‌ ‌కాకతీయ అనేది ప్రచారం లో తప్ప గ్రౌండ్లో ఎక్కడా లేదని , చెరువులో హరీష్‌ ‌రావు నిద్రిస్తే-కేసీఆర్‌ ‌కుర్చీ వేసుకొని ఒక్క రోజు  కూర్చుంటే సమస్యలు  పరిష్కారం కావని మండిపడ్డారు. టీఆరెస్‌ ‌పార్టీ డ్రామా క్రియేట్‌ ‌చేస్తుందని ఎక్కడ గ్రౌండ్లో మాత్రం ఫలితం లేదని అన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్‌ ‌పార్టీ సత్తా ఏంటో చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు..మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌సీఎం కిరణ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి సీఎం హయాంలో చెరువుల పూడికతీత పై సర్వే చేయించారని ,అప్పుడు తెలంగాణ ఉద్యమం తీవ్రస్థాయిలో ఉండటంతో దానికి బ్రేక్‌ ‌పడిందన్నారు..పేదలు- ఎస్సి-ఎస్టీ లకు భూమి ఇవ్వడం అనేది కాంగ్రెస్‌ ‌పార్టీకి మాత్రమే సాధ్యం అయిందని గుర్తు చేశారు. భూమి పై ఆధారపడి రైతుకు ఉపాధి కాంగ్రెస్‌ ‌కల్పిస్తే.. టీఆరెస్‌ ‌భూములను అమ్మి పేదలను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు.  కాళేశ్వరం డ్యామ్‌ ఎప్పుడు నింపుతారో ఎవ్వరికి తెలీదని అన్నారు.

సమావేశానికి ఎమ్మెల్యే లు , ఎంపీ లు డుమ్మా
గాంధీభవన్‌ ‌లో రానున్న అసెంబ్లీ , పార్లిమెంట్‌ ‌సమావేశంలో చర్చించాల్సిన అంశాల పై జరిగిన సమావేశానికి ఎమ్మెల్యే లు సీతక్క పొడెం వీరయ్య , కోమటిరెడీ రాజగోపాల్‌ ‌రెడ్డి , శ్రీధర్‌ ‌బాబు లు హాజరు కాలేదు.ఎమ్పీ లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి , రేవంత్‌ ‌రెడ్డి లు సైతం డుమ్మా కే కొట్టారు.ఒక వారం రోజుల ముందు నుండి సమావేశం ఉందనే సమాచారం ఉన్న , అసెంబ్లీ , పార్లిమెంట్‌ ‌లో మాట్లాడాలినా నేతలే సమావేశానికి రాకపోవడం పై పార్టీ  లోనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Leave a Reply