వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

‘‌గాంధీ’లో అక్రమాలపై.. ప్రభుత్వం సీరియస్‌

February 14, 2020

On the irregularities in Gandhi .. Government is serious

గాంధీ దవాఖానలో వెలుగు చూస్తున్న అక్రమాలపై ప్రభుత్వం స్పందించింది. మొత్తం వ్యవహారంపై విచారణ కమిటీ వేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ‌నిర్ణయించారు. గత కొద్ది రోజులుగా గాంధీ ఆసుపత్రిలో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ముందుగా గాంధీ ఆసుపత్రికి కొవిడ్‌ 19 అనుమానంతో వచ్చిన ఇద్దరికి నిర్వహించిన పరీక్షలలో పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని అదే ఆసుపత్రికి చెందిన డాక్టర్‌ ‌వసంత్‌ ‌మీడియాకు సమాచారం ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ మరుసటి రోజే అవినీతి ఆరోపణల పేరుతో గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ‌డాక్టర్‌ ‌శ్రవణ్‌ అయనను వైద్య విద్య సంచాలకుల కార్యాలయానికి సరెండర్‌ ‌చేశారు. దీంతో ఆగ్రహించిన వసంత్‌ ‌వొంటికి పెట్రోల్‌ ‌డబ్బాలు చుట్టుకుని ఆత్మహత్య చేసుకుంటానంటూ గాంధీ దవాఖాన ఆవరణలో నానా హంగామా సృష్టించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనానికి కారణమైంది. దీనికి తోడు గాంధీ ఆసుపత్రిలో ఆర్థిక పరమైన కుంభకోణాలు చోటుచేసుకు ంటున్నాయని ఇందులో దవాఖాన సూపరింటెండెంట్‌ ‌శ్రవణ్‌కు కూడా ఇందులో భాగస్వామ్యం ఉందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.దీనికి కౌంటర్‌గా వసంత్‌ ఓ ‌కాంట్రాక్టర్‌ ‌నుంచి డబ్బులు డిమాండ్‌ ‌చేసినట్లుగా ఓ ఆడియో టేపును శ్రవణ్‌ ‌మీడియాకు విడుదల చేశారు. అంతేకాకుండా ఆయనకు మతిస్థిమితం లేదని ఆరోపించారు. మరోవైపు, గాంధీ ఆసుపత్రిలో అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఆసుపత్రిలో గత 8 నెలలుగా బయో మెట్రిక్‌ ‌పరికరాలు పనిచేయడం లేదని తెలిసింది. అయినప్పటికీ వైద్యులు, ఇతర సిబ్బందికి వేతనాలు ప్రతీ నెలా చెల్లిస్తున్న విషయం బయటకు వచ్చింది. అలాగే, గత కొద్ది రోజులుగా గాంధీ ఆసుపత్రిలో ఓ నకిలీ వైద్యుడు రోగులకు చికిత్సలు అందిస్తున్నప్పటికీ ఈ వ్యవహారం ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ‌దృష్టికి రాకపోవడం గమనార్హం.

ఇందులో ఆయనకు సైతం ఇందులో భాగస్వామ్యం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జూనియర్‌ ‌వైద్యులు ఇంటర్న్‌షిప్‌కు హాజరు కానప్పటికీ కొందరు వైద్యులు డబ్బులు తీసుకుని వారిని పాస్‌ ‌చేయిస్తున్నారనే ఆరోపణలు సైతం గుప్పుమన్నాయి. ఈ వ్యవహారం ఇలా కొనసాగుతుండగానే గాంధీ దవాఖాన పరిపాలనా భవనంలోనికి శుక్రవారం మీడియా ప్రతినిధులను అనుమతించకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. దవాఖానలో జరుగుతున్న వ్యవహారాలపై ఆరా తీయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధుల• బృందంపై అక్కడి వైద్యులు విరుచుకుపడ్డారు. దవాఖాన ప్రాంగణంలోనికి మీడియాకు అనుమతి లేదంటూ చిరాకుపడ్డారు. ఈ నేపథ్యంలో గాంధీ దవాఖానలో అవినీతి బాగోతంపై మంత్రి ఈటల స్పందించారు. మొత్తం వ్యవహారంపై విచారణ కమిటీ వేయాలని నిర్ణయించారు.