Take a fresh look at your lifestyle.

ఎనిమిదవ రోజు ‘మహిష మర్ధిని’’గా దర్శనమిచ్చిన శ్రీ భద్రకాళీ అమ్మవారు

చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్‌ ‌మహానగరంలో స్వయం వ్యక్తమై మహామహిమాన్వితమైన శ్రీ భద్రకాళీ దేవస్థానంలో దేవీశరన్నవరాత్ర మహోత్సవ కార్యక్రమంలో భాగంగా శనివారం ఎనిమిదవ రోజు అమ్మవారిని ‘మహిష మర్ధిని’’గా అలంకరించి చతుస్థానార్చన జరిపారు. నవరాత్ర వ్రతంలో వరాహ పురాణాంతర్గత నవదుర్గా విధానాన్ని అనుసరించి అమ్మవారికి మహాగౌరీ మరియు సిద్ధిధాత్రి క్రమంలో అట్లాగే బోధాయన ప్రణీత ఆగమోక్త దేవపూజా విధిననుసరించి నిశుంభహా మరియు శుంభహా దుర్గాక్రమంలో పూజాదికములు నిర్వర్తించి అమ్మవారి ఆజ్ఞ స్వీకరించి నవరాత్ర వ్రతంలో చివరి ఘట్టమైన మహాపూర్ణాహుతి నిర్వహించారు.

ఎనిమిదవ రోజు తిధి ద్వయం అనగా మహాష్టమి (దుర్గాష్టమి) మహానవమి రెండూ అయినందున ఒక వైపు భక్తుల తాకిడి ఇంకోవైపు రెండు కృత్యములు నిర్వహించవలసి రావడంతో ఋత్విక్కుల మీద అర్చకులు, సిబ్బంది మీద పని వొత్తిడి పెరిగినా వీరు నిర్వర్తించే ఆగమోక్త ఉత్సవ విధులు భక్తులకు కనువిందు చేశాయి.  ఉదయం 4 గటలకు ప్రారంభమైన ఆలయ నిత్యాహ్నికం ప్రాతఃకాల పూజకాగానే అమ్మవారికి నవరాత్ర విశేష సేవలు ఆరంభింపబడ్డాయి. ఈ మహాపూర్ణాహుతి కార్యక్రమంలో వరంగల్‌ ‌తూర్పు నియోజక వర్గ ఎంఎల్‌ఏ ‌నన్నపునేని నరేందర్‌ ‌పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply