Take a fresh look at your lifestyle.

సచివాలయ భవనాల కూల్చివేతపై .. స్టే పొడిగింపు

ఈనెల 15 వరకూ ఆపివేయాలని హైకోర్టు ఆదేశం 

తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేత పనులపై విధించిన స్టేను హైకోర్టు పొడిగించింది. ఈమేరకు సోమవారం వరకు ఇచ్చిన  స్టేను ఈనెల 15 వరకూ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయ భవనాల కూల్చివేత పనులను నిలిపివేయాలని టీజేఎస్‌ ఉపాధ్యక్షుడు ప్రొ.పీఎల్‌ ‌విశ్వేశ్వరరావు హైకోర్టులో పిటిషన్‌ ‌దాఖలు చేసిన విషయం తెలిసిందే.కూల్చివేతలపై• పూర్తి వివరాలతో కౌంటర్‌ ‌దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.  సోమవారం తిరిగి విచారణ చేపట్టిన హైకోర్టు సచివాలయ భవనాల కూల్చివేతకు సంబంధించి మంత్రివర్గం తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన ప్రతిని సమర్పించకుండా ఎలా విచారణ జరపాలని ఏజీని ప్రశ్నించింది.
దీనికి ఏజీ సమాధానమిస్తూ సచివాలయం కూల్చివేతపై జూన్‌ 30‌న ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వివరణ ఇవ్వగా, మంత్రివర్గ నిర్ణయంపై కనీసం ప్రెస్‌నోట్‌ ‌కూడా ఇవ్వరా అని వ్యాఖ్యానించింది. దీంతో మంత్రివర్గ నిర్ణయ ప్రతిని సాయంత్రంలోపు సమర్పిస్తామని ఏజీ కోర్టుకు విన్నవించారు. మంత్రివర్గ నిర్ణయాన్ని సీల్డు కవర్‌లో సమర్పించాలని హైకోర్టు ఏజీని ఆదేశించింది. అలాగే, ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌పై ఏవైనా అభ్యంతరాలుంటే మంగళవారం లోగా సమర్పించాలని పిటిషనర్లను ఆదేశించింది. దీంతో తాము కూడా రిప్లై కౌంటర్‌ ‌దాఖలు చేస్తామని పిటిషనర్‌ ‌తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ ‌కోర్టుకు వెల్లడించారు. తదుపరి విచారణను ఈనెల 15కు వాయిదా వేసింది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply