Take a fresh look at your lifestyle.

కేంద్ర ప్యాకేజీపై .. రాజకీయ విమర్శలా?

  • లాక్‌డౌన్‌ ‌వేళా రాజకీయాలేనా
  • కెసిఆర్‌ ‌భాష అభ్యంతరకరం
  • విమర్శలపై మండిపడ్డ కేంద్రహోం  శాఖ సహాయ మంత్రి కిషన్‌ ‌రెడ్డి

కొరోనా సమయంలో ఓటు బ్యాంక్‌ ‌రాజకీయాలు అవసరమా అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ ‌రెడ్డి అన్నారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీపై సిఎం కెసిఆర్‌ ‌మాట్లాడిన తీరుపై ఆయన మండిపడ్డారు. అంతర్జాతీయ డియా ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసిస్తుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌మాత్రం విమర్శిస్తున్నారని, ఆయన భాష సరిగా లేదని మంత్రి కిషన్‌ ‌రెడ్డి అన్నారు. రెండు నాల్కల ధోరణి ఎందుకు అవలంబిస్తున్నారంటూ కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. దేశం మోదీ వెంట నడుస్తుందన్న విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తించాలన్నారు. మంగళవారం కిషన్‌ ‌రెడ్డి డియాతో మాట్లాడుతూ..కేంద్రం అద్భుతమైన ప్యాకేజీ ప్రకటించింది. రూ. 20లక్షల కోట్ల ప్యాకేజీలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు లబ్ది జరగదని భావిస్తున్నారా అని అన్నారు. ఎఫ్‌ఆర్‌బీఎమ్‌ ‌పరిధిని 3నుంచి 5 శాతానికి పెంచాం. ఎఫ్‌ఆర్‌బీఎమ్‌ ‌సంస్కరణల్లో లోపాలు ఏమున్నాయో కేసీఆర్‌ ‌చెప్పాలి. రాష్ట్రాల వాటా అని గతంలో కేసీఆర్‌ ‌మంత్రిగా పనిచేసినప్పుడు ఎందుకు చెప్పలేదు. వన్‌ ‌నేషన్‌ ‌వన్‌ ‌గ్రిడ్‌ ‌ద్వారా సంస్కరణలు చేపట్టాం. కేసీఆర్‌ ‌చెప్పినట్లు పంటలు వేయకపోతే రైతుబంధు పథకం వర్తించదా?. అని ప్రశ్నించారు. పంటల సాగు విషయంలో విధానాలను వ్యతిరేకిస్తున్నామా?. మూసపద్ధతిలో పాలన ఉండకూడదని ప్రధాని మోదీ భావిస్తున్నారు. తెలంగాణ నుంచి పొట్టచేతపట్టుకుని గల్ప్ ‌దేశాలకు వలసలు పోతున్నారు. రాష్ట్రాల నుంచి వలసలు వెళ్లకుండా మార్పు జరగకూడదా?. పాలనలో సంస్కరణలు, విదేశీ పెట్టుబడులు రాకపోతే ఎలా?. సంస్కరణలు గిట్టుబాటు ధరల కోసం చేశారేమో? కేంద్రం నిధులుండి ఇవ్వకపోతే విమర్శించాలి. ఉపాధి హా పనుల నిధులు మిషన్‌ ‌కాకతీయకు ఖర్చుపెట్టలేదా అని ప్రశ్నించారు.

కేసీఆర్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. కేసీఆర్‌ ‌భాష అభ్యంతరకరంగా ఉందన్నారు. మోదీ వెనుక దేశమంతా ఉందని న్యూయార్క్ ‌టైమ్స్ ‌సహా.. 50 అంతర్జాతీయ పత్రికలు ప్రచురించాయన్న సంగతి కేసీఆర్‌ ‌తెలుసుకోవాలన్నారు. అడ్రస్‌ ‌లేనివాళ్లు చెబితే ప్రధానిని విమర్శించడం కేసీఆర్‌కు తగదని చెప్పారు. కష్టకాలంలో ఓటు బ్యాంక్‌ ‌రాజకీయాలు సరికాదన్నారు. 20 లక్షల కోట్ల ప్యాకేజీలో తెలంగాణ ప్రజలకు లబ్ది జరగదా? అని ప్రశ్నించారు. ఉన్నంతలో కేంద్రం అద్భుతంగా ప్యాకేజీ ప్రకటించిందని కితాబు ఇచ్చారు. తెలంగాణ సహా దేశంలో చాలా ప్రాంతాల్లో ఎందుకు ఉపాధి కోసం వలసపోతున్నారని అడిగారు. వలస కార్మికుల సమస్య ఇప్పటికిప్పుడు వచ్చింది కాదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో తీసుకొస్తున్న పంటల విధానాన్ని కేంద్రం వ్యతిరేకించడం లేదన్నారు. కానీ కేంద్రం తీసుకొస్తున్న సంస్కరణలు మాత్రమే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అని కిషన్‌రెడ్డి నిలదీశారు.80కోట్ల మంది పేదలకు 5 కేజీల చొప్పున కేంద్రం ఉచిత బియ్యం అందజేశాం. రైతులు, పేద మహిళల బ్యాంక్‌ ‌ఖాతాల్లో నగదు జమ చేశాం. పెన్షన్లు, ఈపీఎఫ్‌, ‌భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చే సాయం కనిపించడం లేదా?, దేశంలో ఉపాధి పనులు దినాలు పెంచాం. ఉపాధి నిధులతో తెలంగాణలోని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయలేదా? అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ఇవన్నీ మరచిపోయి కేవలం విమర్శలు చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy