Take a fresh look at your lifestyle.

సిపిఎస్‌కు వ్యతిరేకంగా.. సెప్టెంబర్‌ 1 ‌న పెన్షన్‌ ‌విద్రోహదినం టీపీటీఎఫ్‌ ‌రాష్ట్ర అధ్యక్షులు కె. రమణ

హైదరాబాద్‌,ఆగస్ట్ 31: ఉమ్మడి రాష్ట్రంలో 2004 సెప్టెంబర్‌ 1 ‌తర్వాత నియామకం అయిన ఉద్యోగులు, ఉపాధ్యాయుల సామాజిక భద్రతకు శాపంగా మారిన కంట్రిబ్యూటరీ పెన్షన్‌ ‌పథకం రద్దు చేసి పాత పెన్షన్‌ ‌విధానాన్ని పునరుద్దరించాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుయస్పీసి), ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) ఆధ్వర్యంలో సెప్టెంబర్‌1 ‌ని పెన్షన్‌ ‌విద్రోహదినం గా పాటించాలని,ఉపాధ్యాయులు అందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని, మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఆయా పాఠశాలల ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక (యుయస్పీసి, జాక్టో) స్టీరింగ్‌ ‌కమిటీ పిలుపు నిచ్చిందని మంగళ వారం విడుదల చేసిన ప్రకటనలోటీపీటీఎఫ్‌ ‌రాష్ట్ర అధ్యక్షులు కె. రమణ పేర్కొన్నారు.

2004 జనవరి 1 నుండి కేంద్రంలోని వాజపేయి నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్‌ ‌ను అమలు చేయగా, తదుపరి ఎన్నికల్లో అధికారం చేపట్టిన మన్మోహన్‌ ‌సింగ్‌ ‌నేతృత్వంలోని కాంగ్రెస్‌ ‌పార్టీ సూచన మేరకు 2004 సెప్టెంబర్‌ 1 ‌నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రంలో దేశంలోనే ప్రప్రథమంగా సిపిఎస్‌ ‌ను ఆనాటి ముఖ్యమంత్రి డా.వైఎస్‌ ‌రాజశేఖరరెడ్డి ఏకపక్షంగా అమలుజరిపారు. గత 17 సంవత్సరాలుగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు సిపిఎస్‌ ‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉధృతమైన పోరాటాలు నిర్వహిస్తున్నారు.

పోరాటాల ఫలితంగా మరణించిన సిపిఎస్‌ ఉద్యోగుల కుటుంబాలకు గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్‌ ‌సాధించుకున్నాము. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిపిఎస్‌ ‌ను వదిలి పాత పెన్షన్‌ ‌పునరుద్దరించుకునే అవకాశం వచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్‌ ‌విధానానికే మొగ్గుచూపి అమలు చేస్తున్నారు. ఈ నేపద్యంలో సిపిఎస్‌ ‌రద్దు చేసి పాత పెన్షన్‌ ‌విధానాన్ని అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ ‌చేస్తూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌ 1 ‌న రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్‌ ‌విద్రోహదినాన్ని పాటిస్తున్నారు అని ప్రకటనలో తెలిపారు.

Leave a Reply