Take a fresh look at your lifestyle.

తెరమీద విలన్‌ – ‌నిజ జీవితంలో హీరో

తెరమీద అతడు ప్రతి నాయకుడు (విలన్‌), ‌నిజ జీవితంలో ఎదుటివారి కష్టాలు చూసి చలించి పోయే దయార్ద్ర హృదయం గల నాయకుడు.ఎంత మంది ఉన్నారు ఈ రోజుల్లో సోనూ సూద్‌ ‌వంటి నటులు..! కొరోనా కష్టకాలంలో ఆయన అందిస్తున్న సేవలు బాలీవుడ్‌ ‌లోనే కాకుండా టాలీ వుడ్‌, ‌కోలీవుడ్‌ ‌సహా అన్ని భాషల చిత్ర రంగాలవారిని కదిలిస్తున్నాయి. సాధారణంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సినీ రంగానికి చెందిన ప్రముఖులు జోలి పట్టి విరాళాలు సేకరించి బాధితులకు అందజేస్తుంటారు. కానీ, సోనీ సూద్‌ ‌తన కష్టార్జితంలో కొంత భాగాన్ని ఆపన్నులకు కేటాయిస్తున్నారు. ఇది ఆయన లోని నిబిడీకృతమైన మహోన్నతమైన మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం. అక్షయ్‌ ‌కుమార్‌ ‌వంటి బాలీవుడ్‌ ‌నటులు కూడా ప్రధానమంత్రి ఏర్పాటు చేసిన పిఎం కేర్స్ ‌ఫండ్‌ ‌కి విరాళాలు అందజేశారు. కానీ, సోనూ సూద్‌ అం‌దించే సాయం లబ్ధిదారులకు జీవితాంతం గుర్తుండి పోయేవనడంలో అతిశయోక్తి కాదు. టెలివిజన్‌ ‌చానల్స్ ‌లో ప్రసారం అయ్యే కథనాలకు ఆయన స్పందిస్తున్న తీరు అందరి ప్రశంసలు అందుకుంటోంది. సాఫ్ట్ ‌వేర్‌ ఉద్యోగిగా పని చేసి కొరోనా కారణంగా ఉద్యోగం కోల్పోయిన శారద అనే నిరుపేద కుటుంబానికి చెందిన యువతి మనో ధైర్యం కోల్పోకుండా రోడ్డు పక్కన కూరగాయలు విక్రయించి కుటుంబాన్ని పోషిస్తోంది. ఆమె తండ్రికి తోడ్పడుతోందన్న విషయం రీట్చ్ ‌షెల్సన్‌ అనే వ్యక్తి ట్విట్టర్‌ ‌ద్వారా సోనూను కోరగానే, తన తరఫు వ్యక్తి ఆమెకు ఉద్యోగ నియామక పత్రాన్ని సోమవారం అందజేశాడని ఆయన బదులు ఇచ్చాడు దాంతో ఆశ్చర్యం వ్యక్తం చేసిన షెల్సన్‌ ‌సోనూ ఔదార్యాన్ని ప్రశంసించడమే కాకుండా, సోనూ చేస్తున్న సహాయ కార్యక్రమాల గురించి పదిమందికి తెలియజేయడం కోసం ట్విట్టర్‌ ‌వేదికగా ఉపయోగించుకుంటున్నారు. గంటల వ్యవధిలో సాఫ్ట్ ‌వేర్‌ ‌శారదకు సోనూ ఉద్యోగం ఇప్పించిన తీరు అందరినీ ఆశ్చర్య పర్చింది.

అలాగే, చిత్తూరు జిల్లాలో కాడెద్దులు లేకపోవడం వల్ల ఇద్దరు కుమార్తెలతో ఒక రైతు పొలం దున్నిస్తున్న సంఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. ప్రసార మాధ్యమాల్లో దీనిని తిలకించి చలించిన సోనూ సూద్‌ ఆ ‌కుటుంబానికి ఆగమేఘాలపై ఒక ట్రాక్టర్‌ ‌ను పంపారు. గతంలో కూడా సినీ రంగానికి చెందిన ప్రముఖులు ఆపన్నులకు సాయం అందించిన ఘటనలు ఉన్నాయి. అయితే, ఉన్న పళంగా సోనూ సూద్‌ ‌సాయం అందించడానికి ప్రసార మాధ్యమాల్లో వారి కథనాలు వెనువెంటనే చేరడం, ఆన్‌ ‌లైన్‌ అకౌంట్‌ ‌ద్వారా డబ్బు పంపేందుకు సౌకర్యాలు విస్తరించడం కారణం కావచ్చు . మనసుంటే మార్గం ఉందనే సామెత ఉంది. చేతిలో డబ్బు సమయానికి లేకపోయినా, చలించే హృదయం ఉంటే సాయం అందించడానికి ఏదీ అడ్డు రాదని సోనూ రుజువు చేస్తున్నారు. ఇంతకీ సోనూ ఆస్తుల విలువ 150 కోట్ల రూపాయిలనీ, తనకున్న దానిలోనే ఆపన్నులను ఆదుకోవాలనే దాతృత్వ గుణం ఆయనలో ఉండటం వల్లనే సాయం చేయగలుగుతున్నాడని సన్నిహితులు చెబుతున్నారు. ఆ మాట నిజమే., వేల కోట్ల రూపాయిల కుంభకోణాలు జరుగుతున్న ఈ రోజుల్లో కష్టార్జితంలోంచి సాయం అందించడం చెప్పుకోదగిన విషయమే . కొరోనా బాధితుల కోసం ఎన్నో సంస్థలు ఆహారం, మాస్క్ ‌లు, కిట్స్, ఇతర వైద్య పరికరాలను విరాళంగా అందిస్తున్నాయి. గోరంత చేసి కొండంత ప్రచారం చేసుకునే వారు ఎంతో మంది ఉన్నారు. సినీరంగంలో ఉదారవైఖరిని కలిగి పేదల ఆపద్భాంధవునిగా, రాబిన్‌ ‌హుడ్‌ ‌గా జనాకర్షక పాత్రలు ధరించిన నటులు నిజ జీవితంలో కూడా అదే మాదిరిగా ఉంటారని జనం అనుకుంటారు. కానీ, అలాంటి వారు కొద్ది మందే ఉన్నారు. వెనకటి తరానికి చెందిన ఎంజీ రామచంద్రన్‌ ‌తెరమీదనే కాకుండా, నిజ జీవితంలో ఎంతో మందికి సాయం అందించి పేదల హృదయాలలో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు. ఎంజీఆర్‌ ‌మాదిరిగా తెరమీద పాత్రల ప్రభావంతో రాజకీయాలలో ఉన్నత పదవులను అలంకరించిన వారూ ఉన్నారు. పేదల పక్షాన ఎంత మంది నిలబడ్డారన్నది ప్రజలకు తెలుసు.

సోనూ సూద్‌ ‌తెలుగు తెరపై కూడా పలు పాత్రలు ధరించి ప్రజలకు దగ్గరైన కారణంగా తెలుగువారికి కూడా తన వంతు సాయం అందిస్తున్నారు. అలాగే, ఇతర రాష్ట్రాల్లో వారికి కూడా ఆయన సాయం అందిస్తున్నారు. పన్నుల రాయితీ కోసం సాయం వెండితెర ప్రముఖులు విరాళాలు ఇస్తారన్న వాదం ఉన్నప్పటికీ,అలా మాత్రం చేసే వారెంత మంది ఉన్నారు..? సోనూ సూద్‌ ‌ముంబాయిలో ఒక హోటల్‌ ‌నిర్మించి కోవిడ్‌ ‌వైద్య సేవలు అందిస్తున్న వైద్యులకు వసతి కల్పిస్తున్నారట. ఆయన సహాయ కార్యక్రమాలు బహుముఖంగా విస్తరించాయి. మొక్కలు నాటే కార్యక్రమం పట్ల తెలుగు సినీ ప్రముఖులు చూపుతున్న శ్రద్దా సక్తులను అభినందించాల్సిందే. కానీ, అదే సందర్భంలో కోవిడ్‌ ‌వంటి ఎన్నడూ కనీవినీ ఎరుగని విపత్తు సంభవించినప్పుడు కనీసం విరాళాలను సేకరించైనా బాధితులను ఆదుకోవడం సినీరంగం ప్రముఖులపై ఉంది.

Leave a Reply