Take a fresh look at your lifestyle.

ప్రజా సమస్యలపై… ప్రజా అసెంబ్లీ

పాలకుల కళ్లు తెరిపించేందుకు..
ఈనెల 4 నుంచి 6వరకు ఆన్‌లైన్‌ ‌సమావేశాలు

తెలంగాణలో ప్రజా సమస్యలు వినేవారే కరువయ్యారు. పాలకులు ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించకపోగా కోవిడ్‌ ‌సాకుతూ ప్రజా ఉద్యమాలను అణచివేస్తున్నారు. దీంతో సమస్యలపై ప్రశ్నించడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. రాష్ట్రంలోని అన్ని వర్గాలు ఏం చేయాలో తెలియని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. జీవనోపాధి లేక వలస కార్మికులు, గిట్టుబాటు ధర లేక రైతులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా నిరుద్యోగులు, మెడికల్‌, ‌ఫార్మా రంగాలపై ఆధారపడి జీవిస్తున్న వారు దీనస్థితిలో కాలం వెళ్లదీస్తున్నారు. ఈనెల 7 నుంచి తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ రంగాలలో నిష్ణాతులైన మేధావులు, నిపుణులు ఆయా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

ఇందులో భాగంగా ఈనెల 4 నుంచి 6 వరకు ప్రజాస్వామిక పాలన కావాలి, ఏకస్వామ్య నియంతృత్వం కాదు అనే నినాదంతో తెలంగాణ ప్రజా అసెంబ్లీ పేరుతో నిర్వహించే సమావేశాలలో వివిధ అంశాలపై అన్ని వర్గాల ప్రజా సంఘాల ప్రతినిధులు, నిపుణులు, సామాన్య ప్రజలు పాల్గొంటారు. ప్రజా అసెంబ్లీలో తీర్మానాల నుంచి తెలంగాణ ప్రజల చాప్టర్‌ ‌రూపొందించి సెప్టెంబర్‌ 7‌న రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశంలో రాజకీయ పార్టీల నాయకులు ముందు ఉంచడం జరుగుతుంది. ఆయా పార్టీల స్పందన కోరడమే కాకుండా ప్రజల చార్టర్‌లోని అంశాలను రాష్ట్ర అసెంబ్లీ సమావేశంలో లేవనెత్తాలని ప్రజా సంఘాలు డిమాండ్‌ ‌చేస్తున్నాయి.

తెలంగాణ ప్రజా అసెంబ్లీ సమావేశాలలో భాగంగా మొదటి రోజైన 4న ఉదయం ఉపాధి,కార్మికుల హక్కులు, సాయంత్రం సహజ వనరులు, ప్రజల హక్కులు, 5న వ్యవసాయం, గ్రామీణ ఉపాధులు, సామాజిక ఆహార భద్రత, ఆరోగ్యం, విద్య, 6న అణగారిన వర్గాల హక్కులు, ప్రజాస్వామిక హక్కులు, సవాళ్లు అంశాలపై ఆయా వర్గాలకు చెందిన మేధావులు, నిపుణులు కూలంకషంగా చర్చిస్తారు. ఈ సమావేశాలలో వచ్చిన స్పందనలు, తీర్మానాలను అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే ఈనెల 7న అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి ప్రజా అసెంబ్లీ తీర్మానాలను మీడియా ద్వారా ప్రజల ముందు ఉంచుతామనీ ఈ అంశాలను రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తాలని ఆయా పార్టీల నేతలను డిమాండ్‌ ‌చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వివరాలు, రిజిస్ట్రేషన్‌ ‌కోసం కిరణ్‌ ‌విస్సా 9701705743, కె.సజయ 9948352008, కన్నెగంటి రవి 9912928422 నంబరులో సంప్రదించాలని కోరారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!