Take a fresh look at your lifestyle.

లాక్‌డౌన్‌ 5.0‌లో చేతులెత్తేస్తున్నామా!

ఒక వైపు వేగంగా విస్తరిస్తున్న కొరోనా , ఇంకోవైప •ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాలనే ఆలోచనలతో కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలు ఆంక్షల సడలింపు వల్ల డిసెంబర్‌ ‌నాటికి సగం భారతీయ జనాభాను ఈ మహమ్మారి తన గుప్పిటోకి తీసుకుంటుందనే అభిప్రాయాలూ వాస్తవమయ్యేట్టు కనబడుతున్నాయి. దీనికి తోడు చెదురు ముదురు వర్షాలు వైరస్‌ ‌బలాన్ని చేకూరుస్తున్నాయని చెప్పవచ్చు. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే మొదటి• మూడు లాక్‌డౌన్‌లో గ్రీన్‌ ‌జోన్లుగా ఉన్న ప్రాంతాలలో కూడా కేసుల సంఖ్య నమోదు కాబడుతున్నాయి.
మొదటి దశలో అనుమానం వస్తేనే •రెడ్‌జోన్‌,  ‌టెస్టుల కోసం హైదరాబాద్‌కు తరలించడం, ఆయా ప్రాంతాలను క్వారంటైన్‌ ‌చేయడం జరిగేది. ఇప్పుడు వైరస్‌ ‌శాశ్వతంగా తిష్ఠ వేసే సమయానికి మనం చేతులెత్తేస్తున్నామా అన్న ప్రశ్నకు అవుననే సమాధానం వస్తుంది. నిన్న ప్రకటించిన 5.0  లాక్‌డౌన్‌ను పరిశీలిస్తే వైరస్‌ను నియంత్రించటం కంటే, ప్రోత్సహించడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబడుతుందని చెప్పవచ్చు.
మొదట్లో డబ్బు ప్రధానం కాదు, ప్రాణాలే ముఖ్యం అని చేసిన నినాదాన్ని రెండు నెలలకే వెనక్కి తీసుకున్నామా అని ఆశ్చర్యం వేస్తుంది. ఆర్థిక వ్యవస్థను బలపర్చుకోవడం ముమ్మాటికీ ఆవశ్యకమైనప్పటికీ, దేశ ప్రజల భద్రత కూడా అంతే అవసరం. నేటితో ఆరంభమయ్యే క్రొత్త లాక్‌డౌన్‌లో ప్రజలు స్వేచ్ఛగా రాష్ట్రాల మధ్య ప్రయాణాలు కొనసాగించవచ్చు, దశల వారీగా పాఠశాలలు, థియేటర్స్, ‌పబ్స్  ‌లాం• •ప్రదేశాలపై కూడా ఆంక్షలను తొలిగిస్తున్నామన్న సంకేతాలు కేంద్రం వెలువరించడం జరిగింది.5.0లో వైరస్‌ ‌సామూహిక ప్రార్థనలు చేయడం ద్వారా, దేవాలయాలకు వెళ్లడం, ప్రయాణాలు చేయడం ద్వారా వ్యాప్తి చెందదు అని ప్రయోగశాలలో రుజువైనట్టు ప్రవర్తిస్తున్నాయి ప్రభుత్వాలు. ఇంట్లో కూర్చుండి దేశాన్ని కాపాడే అవకాశాన్ని కోల్పొకండని అప్పట్లో అన్ని మాధ్యమాలలో వైరల్‌ అవడం జరిగింది, అది కూడా ఇప్పుడు తారుమారు చేసి •మనం నడుచుకుంటున్నామా అన్న సందేహం వ్యక్తమౌతుంది.కేసుల నమోదులో చైనాతో పోటీపడుతున్న వేళ, మరణాలలో వెనుకనే ఉన్నామని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నామా అన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. రానున్న వర్షాకాలంలో సాధారణంగా భారతదేశంలో జలుబు, దగ్గు, జ్వరం లాంటి సమస్యలు భారీగా నమోదు అవుతాయి, అప్పుడు ఏ మూలనో దాగి ఉన్న కొరోనా వైరస్‌ ఇం‌కా భారీస్థాయిలో విజృంభిస్తుందని ప్రముఖవైద్యులు, విశ్లేషకులు, హెచ్చరిస్తున్నారు.
నియంత్రణకు సామాజి క దూరం ఒక్కటే మార్గం అని చెప్పిన పెద్దమనుషులు ఇప్పుడు దానిని ప్రక్కకు పెట్టారు కానీ దాని ప్రత్యామ్నాయం ఏంటో సామాన్య ప్రజానికానికి చెప్పాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.
ఇలానే మనం సడలించుకుంటూ పోతే ఇంటికో ఉద్యోగమిచ్చిన్నట్టు, ప్రతి ఒక్కరి ఖాతాలో లక్షల రూపాయలు జమచేసినట్టు, ఇంటి కో కొరోనా వైరస్‌ ‌ప్రసాదింపబడుతుందనేది ఖాయం.
ఇదంతా చూస్తుంటే క్రికెట్‌ ఆటలో 40  ఓవర్లు జాగ్రత్తగ ఆడి• చివరి పది ఓవర్లలో నిర్లక్ష్యపు ఆటతీరుతో •గెలిచే మ్యాచ్‌ను చేతులారా పోగొట్టుకున్నట్టు, మనం 4.0  మరియు  5.0 లో ప్రవర్తి స్తున్నా మా అన్న ప్రశ్నకు సమీప భవిష్యత్తే సమా ధానం చెప్పాలి.
image.png
డా।। ఎండి  ఖ్వాజామొయినొద్దీన్‌
‌ప్రొఫెసర్‌, అకౌంటింగ్‌ అం‌డ్‌ ‌ఫై•నాన్స్

Leave a Reply