Take a fresh look at your lifestyle.

జూన్‌ 4‌న జిల్లాలో…

  • ఆయిల్‌ ‌ఫామ్‌ ‌మొక్కలకు నాటే కార్యక్రమానికి శ్రీకారం
  • మొదట రిజిస్ట్రేషన్‌ ‌చేసుకున్న వారికే మొదట మొక్కల పంపిణీ
  • మంత్రి తన్నీరు హరీష్‌రావు

సిద్ధిపేట, మే 28 (ప్రజాతంత్ర బ్యూరో): సిద్ధిపేట జిల్లాలో వచ్చే నెల (జూన్‌)4‌న ఆయిల్‌ ‌ఫామ్‌ ‌మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు తెలిపారు. జిల్లాలో 50వేల మొక్కలు నాటే ఈ కార్యక్రమానికి  సిద్ధిపేట జిల్లాలలోని నంగునూరు కేంద్రంగా ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.  సిద్ధిపేట కలెక్టరేట్‌ ‌మీటింగ్‌ ‌హల్‌లో  ఆయిల్‌ ‌ఫామ్‌ ‌సాగు, సెరికల్చర్‌ ‌సాగుపై సంబంధిత శాఖల అధికారుల తో మంత్రి సమీక్షించారు. జిల్లా ఉద్యాన వన ఉప సంచాలకులు  రామలక్ష్మి ఆయిల్‌ ‌ఫామ్‌ ‌సాగు కార్యాచరణ ప్రణాళికను మంత్రికి వివరించారు. వచ్చే జూన్‌, ‌జులైలలో 160మంది రైతులకు సంబంధించిన 1000 ఎకరాలలో ఆయిల్‌ ‌ఫామ్‌ ‌మొక్కలను నాటేలా కార్యాచరణ సిద్ధం చేశామన్నారు.

ప్రస్తుత సంవత్సరాంతంలోగా 5 వేల ఆయిల్‌ ‌ఫామ్‌ ‌మొక్కలు నాటడమే లక్ష్యం పెట్టుకున్నట్లు  ఆమె మంత్రికి తెలిపారు. ఆయిల్‌ ‌ఫామ్‌ ‌సాగు ప్రయోజనాలను వివరించి సాధ్యమైనంత ఎక్కువ మంది రైతులు ఆయిల్‌ ‌ఫామ్‌ ‌సాగు చేసేలా ప్రత్యేక చొరవ చూపాలని మంత్రి ఉద్యానవన శాఖ అధికారులకు సూచించారు. జిల్లాలో ఆయిల్‌ ‌ఫామ్‌ ‌తోటల పెంపకానికి ముందుకు వచ్చి మొదట రిజిస్ట్రేషన్‌ ‌చేసుకున్న వారికే మొదట మొక్కలను పెంచుకునేందుకు అవకాశం ఇస్తామనీ మంత్రి అన్నారు. అంతేకాకుండా, ఉచితంగా మొక్కలను అందిస్తామన్నారు. రాయితీ పై డ్రిప్‌ ‌సౌకర్యం, ఎరువులు అందిస్తామన్నారు. ఉపాధి హామీ పథకం కింద పని దినాలను కల్పిస్తామన్నారు. గోదావరి,జైన్‌, ‌నెటాఫిన్‌ ‌తదితర సంస్థలు ఆయిల్‌ ‌ఫామ్‌ ‌పంటలకు డ్రిప్‌ ఇరిగేషన్‌ ‌సౌకర్యం కల్పించాలన్నారు. 1000 ఎకరాలలో రాయితీ పై రైతులకు డ్రిప్‌ ఇరిగేషన్‌ ‌సౌకర్యం కల్పిస్తేనే భవిష్యత్తులో భారీ ఎత్తున చేపట్టనున్న ఆయిల్‌ ‌ఫామ్‌ ‌సాగులో కూడా వీరికి అవకాశం కల్పిస్తామన్నారు.

అలాగే ఉద్యానవన, ప్రభుత్వం ఇతర పథకాలలో అవకాశం కల్పిస్తామన్నారు. అనంతరం సెరికల్చర్‌  ‌కార్యకలాపాలను సమీక్షించిన మంత్రి అయా శాఖ అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సంవత్సరం 400 ఎకరాలలో మల్బరీ సాగు ను చేపట్టాలన్నారు.  ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్‌ ‌వెంకట్రామ రెడ్డి, అదనపు కలెక్టర్‌ ‌ముజమ్మిల్‌ ‌ఖాన్‌, ‌సిద్ధిపేట ఆర్డీవో అనంత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply