- ఎంతమందికైనా చికిత్స చేసేందుకు సిద్ధ్దం
- వైద్యులను అవమానపరిచేలా పోస్టులు తగవు
- సోషల్ డియా వార్తలు నమ్మొద్దు
- లాక్‌డౌన్‌పై త్వరలోనే సిఎం కెసిఆర్ నిర్ణయం
- మిడియా సమావేశంలో మంత్రి ఈటెల రాజేందర్
ప్రభుత్వ దవాఖానల్లో వేలమందికి క•రోనా చికిత్స అందిస్తున్నామని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. ఆరోగ్యశాఖలో 250 మంది సిబ్బందికి కరోనా పాటిజివ్ వచ్చిందన్నారు. కరోనాతో హెడ్ నర్సు చనిపోయిందని తెలిపారు. వైద్యులు ప్రాణాలు పణంగాపెట్టి ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారని వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో దష్పచ్రారం చేయడం తగదని, ప్రభుత్వ ఆస్పత్రి వైద్య సిబ్బంది ఆత్మైస్థెర్యం దెబ్బతీయోద్దని సూచించారు. సోమవారం నాడాయన డియాతో మాట్లాడుతూ ఇప్పటివరకు 184 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ వచ్చిందని, వారు కోలకుని ప్రజలకు ధైర్యం ఇచ్చారని వెల్లడించారు. సామాచిక మాధ్యమంలో వచ్చిన సమాచారం నమ్మొద్దని, ప్రభుత్వం ఇచ్చే బులెటిన్లను మాత్రమే నమ్మాలని విజ్ఞప్తి చేశారు. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత అన్ని రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. కరోనా విషయంలో గత నాలుగు నెలల క్రితం ఉన్న భయాందోళనలు ఇప్పుడు లేవని అన్నారు. మొదట్లో కరోనాతో చనిపోతారనే భయం ప్రజల్లో ఉండేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా కేసుల్లో మరణాలు 1.7 శాతం మాత్రమే ఉన్నాయని వివరించారు.
దేశంలో ఇది 3 శాతంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 240 మంది చనిపోయారని తెలిపారు. రోగి ఎప్పుడు వచ్చినా సరే చికిత్స అందించే సౌకర్యాలు ప్రభుత్వ దవాఖానల్లో ఉన్నాయన్నారు. 4700 మంది వైద్య సిబ్బందిని నియమించామని, 150 అంబులెన్సులు అదనంగా తీసుకున్నామని చెప్పారు. కరోనా బాధితుల కోసం 17,801 పడకలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఇప్పటికే 3500 పడకలకు ఆక్సిజన్ సమకూర్చామని, మరో నాలుగైదు రోజుల్లో 6,500 పడకలకు ఆక్సిజన్ సమకూరుస్తామని తెలిపారు. మొత్తం 10వేల పడకలకు అవసరమైన ఆక్సిజన్ సమకూరుస్తామని చెప్పారు. గాంధీ దవాఖానలో 10 మంది రోగులు మాత్రమే వెంటిలేటర్‌పై ఉన్నారని చెప్పారు. ఆదివారం ఛాతి ఆసుపత్రిలో మృతిచెందిన వ్యక్తికి ఊపిరితిత్తుల సమస్య లేదని వెల్లడించారు. గ్రాణ ప్రాంతాల్లో కరోనా కేసులు, మరణాలు చాలా తక్కువగా ఉన్నాయన్నారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ నగరం కావడంతో ఎక్కువ కేసులు వస్తున్నాయని చెప్పారు.
మిగతా నగరాల్లో ఉన్నంత విస్తృతి హైదరాబాద్‌లో లేదని, ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో పెరిగినట్లే నగరంలోనూ కేసులు పెరిగాయని వెల్లడించారు. హైదరాబాద్‌లో కేసులు ఉన్నచోట్ల కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేస్తామన్నారు. అవసరమైతే హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌పై ఆలోచనా చేయాల్సి ఉంటుందని సీఎం కేసీఆర్ చేప్పారన్నారు. నాలుగైదు రోజుల్లో మంత్రివర్గ సమావేశం ఉంటుందని తెలిపారు. కరోనా పరీక్షల కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. మంగళవారం నుంచి మళ్లీ కరోనా పరీక్షలు కొనసాగుతాయని, పెద్దమొత్తంలో స్వాబ్ సేకరణ చేపడతామన్నారు. ఐసీఎంఆర్ నిబంధనలకు అనుగుణంగా •ం క్వారంటైన్లో చికిత్స అందిస్తామని చెప్పారు. కరోనా లక్షణాలు లేనివారిని •ం క్వారంటైన్లో ఉంచుతున్నామని, లక్షణాలున్న వారికి మాత్రమే దవాఖానల్లో చికిత్స అందిస్తామని చెప్పారు. కోవిడ్ టెస్టులను కేవలం కోఠి తదితర ఆస్పత్రుల్లో చేస్తున్నామని, గాందీలో కేవలం చికిత్సమాత్రమే అందిస్తామని అన్నారు.