Take a fresh look at your lifestyle.

‌బ్రిటన్‌ ‌నుంచి వొచ్చిన మహిళకు ఒమిక్రాన్‌ ‌నెగెటివ్‌

బ్రిటన్‌ ‌నుంచి మూడు రోజుల క్రితం హైదరాబాద్‌కు వొచ్చిన మహిళకు ఒమిక్రాన్‌ ‌నెగిటివ్‌గా నిర్దారణ అయింది. కొరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ‌వేగంగా విస్తరిస్తున్న క్రమంలో హైదరాబాద్‌కు వొచ్చిన మహిళకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో పరీక్షలు నిర్వహించగా, కొరోనాగా నిర్ధారణ అయింది. అయితే, ఆ దేశంలో ఒమిక్రాన్‌ ‌కేసులు కూడా ఎక్కువగా ఉండటంతో ఆ మహిళ నుంచి నమూనాలు సేకరించి జన్యు విశ్లేషణ నిమిత్తం పంపించారు.

ఆ పరీక్షలలో మహిళకు ఒమిక్రాన్‌ ‌నెగిటివ్‌గా నిర్దారణ అయినట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.శంషాబాద్‌ ‌విమానాశ్రయానికి వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు స్క్రీనింగ్‌ ‌పరీక్షలు నిర్వహించగా 11 మందికి కొరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో గురువారం బ్రిటన్‌ ‌నుంచి వచ్చిన మహిళతో కలిపి పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారి సంఖ్య 12కు చేరింది. వీరందరినీ టిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి నమూనాలను జినోమ్‌ ‌సీక్వెన్సింగ్‌కు పంపారు. వీరిలో యూకే నుంచి 9 మంది, సింగపూర్‌, ‌కెనడా, అమెరికా నుంచి దేశాల నుంచి వచ్చిన 3 ప్రయాణికులు ఉన్నారు.

Leave a Reply