Take a fresh look at your lifestyle.

దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్‌ ‌కేసులు

  • 214కు చేరిన కేసుల సంఖ్య
  • కొత్తగా  6,317 కోవిడ్‌ ‌కేసులు నమోదు
  • ఒమిక్రాన్‌పై కేంద్రం అప్రమత్తం…నేడు అధికారులతో ప్రధాని మోదీ సవిక్ష

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 22 : ‌గడిచిన 24 గంటల్లో కొత్తగా దేశంలో 6,317 కొవిడ్‌ ‌కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 6,906 మంది బాధితులు కోలుకున్నారని, వైరస్‌ ‌బారినపడి 318 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. తాజా కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య 3,47,58,481కు పెరగ్గా..ఇందులో 3,42,01,966 మంది కోలుకున్నారు. వైరస్‌ ‌బారినపడి మొత్తం 4,78,325 మంది ప్రస్తుతం దేశంలో 78,190 యాక్టివ్‌ ‌కేసులున్నాయని చెప్పింది. అలాగే కొరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ‌పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య 213కు పెరిగిందని ఆరోగ్యశాఖ తెలిపింది. ఢిల్లీలో 57, మహారాష్ట్రలో 54, తెలంగాణలో 24, కర్ణాటకలో 19, రాజస్థాన్‌లో 18, కేరళలో 15, గుజరాత్‌లో 14, కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌లో 2, ఒడిశాలో 2, యూపీలో 2, ఏపీ, ఛండీగఢ్‌, ‌లద్దాఖ్‌, ‌తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో ఒక్కొక్కటి చొప్పున ఒమిక్రాన్‌ ‌కేసులు నమోదైనట్లు వివరించింది.

ఇందులో ఇప్పటి వరకు 90 మంది కోలుకున్నారని చెప్పింది. కొత్త వేరియంట్‌ ‌కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఏపీలో మరో ఒమిక్రాన్‌ ‌కేసు నమోదైంది. కెన్యా నుంచి తిరుపతి వొచ్చిన 39 ఏళ్ల మహిళకు ఒమిక్రాన్‌ ‌పాజిటివ్‌గా నమోదైంది. కెన్యా నుంచి వొచ్చిన మహిళకు పరీక్షలు నిర్వహించగా ఒమిక్రాన్‌ ‌పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు అధికారులు తెలిపారు. ఆ మహిళ.. చెన్నై విమానాశ్రయం నుంచి తిరుపతికి వొచ్చినట్లు అధికారులు వెల్లడించారు. కాగా.. ఈ నెల 12 ఆ మహిళకు కొరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో అధికారులు శాంపిళ్లను జీనోమ్‌ ‌సీక్వేన్సింగ్‌కు పంపించగా.. ఒమిక్రాన్‌ ‌పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు అధికారులు తెలిపారు.

సమాచారం అందుకున్న అధికారులు మహిళను చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కి తరలించారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన ఒమిక్రాన్‌ ‌కేసుల సంఖ్య 214కు చేరుకుంది. 15 రాష్ట్రాల్లో ఈ వేరియంట్‌ ‌కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే కేసుల సంఖ్య భారీగా పెరిగింది. దేశంలో కొత్త వేరియంట్‌ ‌కారణంగా ఇప్పటివరకు ఒక్కరు కూడా చనిపోలేదు.

ఒమిక్రాన్‌పై కేంద్రం అప్రమత్తం…నేడు అధికారులతో ప్రధాని మోదీ సవి•క్ష
కొరోనా కొత్త వేరియెంట్‌ ఒమిక్రాన్‌ ‌వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ నేడు ఉన్నతాధికారులతో సవి•క్షా సమావేశం నిర్వహించనున్నారు. దేశంలో కొరోనా పరిస్థితిపై ప్రధాని ఉన్నతాధికారులతో గురువారం సమావేశం కానున్నారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కొరోనా పరిస్థితి, ఒమిక్రాన్‌ ‌వేరియంట్‌ ‌విస్తృతి, వైరస్‌ ‌కట్టడి కోసం తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నది. కాగా, కేంద్రం ఇప్పటికే ఒమిక్రాన్‌ ‌కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో నైట్‌ ‌కర్ఫ్యూలు విధించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీచేసింది. మొత్తం ఒమిక్రాన్‌ ‌కేసులలో ఇప్పటికే 90 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మరో 113 యాక్టివ్‌ ‌కేసులు ఉన్నాయి. ఓవరాల్‌గా కూడా ప్రస్తుతం దేశంలో 78,190 యాక్టివ్‌ ‌కేసులు ఉన్నాయి.

Leave a Reply