Take a fresh look at your lifestyle.

ఐదు అం‘తరాలు’

తాతల వాహనాలు జత కాళ్ళు
నాన్న వాహనాలు సైకిల్‌ ‌గిర్రలు
నా వాహనం మోటారు స్కూటరు
కొడుకు కూతురు కారులో షికారు
విమానంలో మనుమడి విహారాలు !

తాత నివసించె గుడిసె గూట్లో
నాన్న నివాసం చిన్న పెంకుటింట్లో
స్లాబ్‌ ‌రూంలో తెల్లారింది నా బతుకు
మార్బుల్‌ ‌ధగధగల్లో కుమారుడి నివాసం
డిజిటల్‌ ఏసి మేడలో మనుమడి దర్జాలు !

తాత వస్త్రాలు తిపాగ దోతులు
చేనేత పట్టు వస్త్రాలే నాన్న వస్త్రాలు
పాలిస్టర్‌ ‌ప్యాంటు షర్టులో నేను
బూట వర్క్ అద్దాల్లో నా కూతురు కోడలు
చిరిగిన టైట్‌ ‌జీన్స్‌లో మా మూడోతరం !

కట్టెల పొయ్యి పొగలో నాన్నమ్మ వంటలు
కిరోసిన్‌ ‌స్టౌవ్‌తో అమ్మ కుక్కింగు కుస్తీలు
గ్యాస్‌ ‌స్టవ్‌తో నా వంటల తంటాలు
ఓవెన్‌, ‌ఫ్రై పాన్‌లో కొడలి కమ్మని వంటలు
బర్గర్‌ ‌ఫిజ్జాలకే మనుమడి ఎదురు చూపులు !

సున్ను పిండితో తాతనాన్నమ్మ తానాలు
సబ్బు నురగతో నాన్న తరం స్నానాలు
పీయర్స్ ‌సోపులే మా తరం సోకులు
లిక్విడ్‌ ‌సోప్‌తో కొడుకు కోడలి స్నానాలు
ఫేస్‌ ‌ప్యాక్‌లకే మనుమరాలి మక్కువలు !

తాత తరంలో ఉమ్మడి కుటుంబాలు
నాన్న ఇంట్లో తోటి కోడళ్ల కొట్లాటలు
మా ఇంట్లో ఉన్నది భార్య పిల్లలు
కొడుకు ఏక సంతాన న్యూక్లియర్‌ ‌ఫామిలీలు
మనుమడి తరం స్మార్ట్ ‌ఫోన్‌తో ఏకాంతాలు !

ప్రయాణంతో చుట్టాలను చుట్టే తాతలు
నాన్న పయనాలు ఎడ్ల బండ్ల వాహనాలు
ఉత్తరాలు రాసె నా తరం కుశల వార్తలు
కొడుకు కోడలు ఈ-మెయిల్‌ ఉత్తరాలు
మనుమడు మునిగెను సోషల్‌ ‌మీడియా !

తాత తరం రాతి లోహ యుగమైంది
అయ్య తరం హరిత యుగమైంది
నా తరం పారిశ్రామిక ప్రగతైంది
కొడుకు కాలానికి కంప్యూటర్‌ ‌వచ్చింది
మనుమడి చేతిలో డిజిటల్‌ ‌విప్లవముంది !

– మధుపాళీ
కరీంనగర్‌, 9949700037

Leave a Reply