Take a fresh look at your lifestyle.

ఒక్క అడుగు పడలే

శిల్పి ముడిరాయిని చెక్కి ప్రాణంపోస్తే
నాయకులు బతుకున్న మనుషుల్నే మూటలగడ్తున్నరు

ఆరిపోతున్న దీపాలకు సమురుపోసి
ఆరోగ్యాలను నిలబెట్టండంటే
ప్రతిదినం ఓ కొత్తభాషనే
ప్రతి నాయకుడు
ఓ భాషా శాస్త్ర వేత్తనే
పంటచేల్లో కలుపు పెరిగినట్లు మాటలు
నిందించుకున్నంత సహజంగా
నిజాల్ని కుప్పేయలేకపోతున్నరు

ప్రతి దరువాజకో కులమున్నట్లే
ప్రతి మాటెనుక ఓ రాజకీయమే
పంతాలకు మీసాలను అతికిస్తున్నరుగానీ
పొద్దుపొడువూ నిలబడ్డోళ్లకు టెస్టులు చేయలేకపోతున్నారు
ఇంటినిండా బియ్యమున్నాగాని కడుపులెండినట్లుంది
ప్రయివేటోడు దర్జాగా తలుపులు మూస్తడు
సర్కారోడు బాజాప్తగా తలుపులు తెరుస్తడు
లోపల నిడిల్‌ ‌లేని సిరంజులే !

చెప్పినప్పుడల్లా
ఓట్లేసినందుకేమో అస్థికలు కూడ మిగుల్తలేవు
ప్రాణం పుట్టడం ఖరీదే గాదు
ప్రాణం పోవడమూ ఖరీదే !

ఉన్మాదానికీ
మాటలు మంటలు పెరుగుతున్నవి గానీ
మనిషిని నిలబెట్టడానికి
ఒక్క అడుగు పడలే!
కర్రులేని ఎడ్లను కాడిగట్టినట్లే ఉంది

-వనపట్ల సుబ్బయ్య, 9492765258

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply